BigTV English

Mg Gloster Launched: ఫిదా చేసే లుక్‌, డిజైన్‌తో రెండు కొత్త ఎడిషన్లను లాంచ్ చేసిన ఎంజి.. ధర, స్పెసిఫికేషన్స్ ఇవే

Mg Gloster Launched: ఫిదా చేసే లుక్‌, డిజైన్‌తో రెండు కొత్త ఎడిషన్లను లాంచ్ చేసిన ఎంజి.. ధర, స్పెసిఫికేషన్స్ ఇవే

MG Gloster Snowstorm, Gloster Desert Storm Launched: దేశీయ మార్కెట్‌లో ఎంజీ మోటార్ ఇండియాకు మంచి డిమాండ్ ఉంది. వాహన ప్రియులను ఆకట్టుకునేందుకు ఈ కంపెనీ తరచూ వినూత్న ప్రయత్నాలు చేస్తుంటుంది. ఇందులో భాగంగానే కొత్త లుక్, డిజైన్, అదిరిపోయే ఫీచర్లు, బడ్జెట్ ధరలలో రకరకాల మోడళ్లను పరిచయం చేసి వాహన ప్రియులను అట్రాక్ట్ చేస్తుంది. ఇప్పటికే ఎన్నో మోడళ్లను మార్కెట్‌లో రిలీజ్ చేసిన ఎంజీ మోటార్ ఇండియా.. తాజాగా మరో రెండు ఫ్లాగ్‌‌షిప్‌లను రిలీజ్ చేసింది. ‘గ్లోస్టర్ స్టార్మ్, స్నో స్టార్మ్’ అనే ఎడిషన్లను భారతీయ మార్కెట్‌లో విడుదల చేసింది.


ఈ రెండు వెర్షన్ ధరలు రూ.41.05 లక్షల ఎక్స్ షోరూమ్ ధరతో లాంచ్ చేసింది. ఈ రెండు కొత్త ఎడిషన్లు.. గ్లోస్టర్ బ్లాక్ స్టార్మ్ ఎడిషన్ ప్రేరణతో వచ్చాయి. అందులో గ్లోస్టర్ స్టార్మ్ డీప్ గోల్డెన్ పెయింట్‌ని పొందగా.. స్నో స్టార్మ్ ఎడిషన్ బ్లాక్ రూఫ్ థీమ్‌తో డ్యూయల్-టోన్ పెర్ల్ వైట్ కలర్‌తో వచ్చింది. అలాగే బ్లాక్-అవుట్ గ్రిల్, మిర్రర్ కేసింగ్‌లు, రియర్ స్పాయిలర్, అల్లాయ్ వీల్స్, రూఫ్ రెయిల్‌లను కలిగి ఉంది. టెయిల్-లైట్స్ స్మోక్డ్ ఎఫెక్ట్‌ని కూడా కలిగి ఉంటాయి. ఇది దాని ఫ్రంట్ బంపర్, హెడ్‌లైట్‌లు, మిర్రర్ కేసింగ్‌లతో పాటు రెడ్ యాక్సెంట్‌లను కూడా పొందుతుంది. స్నోస్టార్మ్ ఏడు సీట్ల పరిమాణంలో మాత్రమే అందించబడుతుంది.

మరోవైపు గ్లోస్టర్ డెసర్ట్ స్టార్మ్ గోల్డ్ కలర్ స్కీమ్‌లో వస్తుంది. దాని గ్రిల్ బ్లాక్డ్ అవుట్ ఫినిష్, అల్లాయ్ వీల్స్, ఓఆర్‌విఎం, రూఫ్ రైల్స్, డోర్ హ్యాండిల్స్ వంటి బ్లాక్ ఎక్స్‌టీరియర్ ఎలిమెంట్స్ ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి. హెడ్‌లైట్స్ కోసం రెడ్ కలర్ లైట్స్ కలిగి ఉంటాయి. ఈ ఇటరేషన్లో రెడ్ కలర్డ్ బ్రేక్ కాలిపర్స్‌ను అందించారు. హెడ్‌ల్యాంప్స్ కోసం ఇన్సర్ట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.


Also Read: హూండా డిస్కౌంట్ల జాతర.. ఈ కార్లపై రూ. 1 లక్షకుపైగా ప్రయోజనాలు.. కొద్ది రోజులు మాత్రమే..!

ఇక ఇంటీరియర్ పరంగా చూసుకుంటే.. లోపల బ్లాక్ ఇంటీరియర్ థీమ్‌ ఉంటుంది. స్ట్రీరింగ్ వీల్‌కు మాత్రమే కొన్ని మార్పులు చేయబడ్డాయి. ఈ డెసర్ట్ స్మార్మ్ ఆరు సీట్లు, ఏడు సీట్ల రూపాల్లో అందుబాటులోకి వచ్చింది. ఈ రెండు ఎడిషన్లు, సీట్ మసాజర్స్, థీమ్డ్ కార్పెట్ మ్యాట్స్, డ్యాష్ బోర్డ్ మ్యాట్స్, జేబీఎల్ స్సీకర్స్ వంటి యాక్ససరీలతో వచ్చాయి. ఇది రెండు రకాల ఇంజన్‌లతో వచ్చింది. ఒకటి టర్బోచార్జ్డ్, మరొకటి ట్విన్-టర్బోచార్జ్డ్. 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్‌లతో అందించబడుతుంది.

Tags

Related News

D-Mart: కొనేది తక్కువ, దొంగతనాలు ఎక్కువ.. డి-మార్ట్ యాజమాన్యానికి కొత్త తలనొప్పి!

JIO Super Plans: జియో నుంచి సూపర్ ఆఫర్లు.. ఏది ఫ్రీ, ఏది బెస్ట్ అంటే?

SEBI – Foreign Funds: భారతీయ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. విదేశీ ఫండ్స్‌కి SEBI గ్రీన్ సిగ్నల్

ICICI Bank New Rules: కస్టమర్లకు ICICI బిక్ షాక్.. కనీస బ్యాలెన్స్ రూ.10 వేలు కాదు.. అంతకుమించి.. పేదోళ్ల సంగతి ఏంటో?

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Big Stories

×