Srikanth Iyengar : టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రత్యేక పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ ఒకవైపు సినిమాలతో ఫేమస్ అవ్వడమే కాదు.. తనకు సంబంధం లేని విషయాలలో కూడా నోరు పారేసుకుంటూ నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు.. ఇటీవల ఈయన జాతిపిత మహాత్మా గాంధీ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి అందరికి తెలిసిందే.. ఆయనపై వ్యతిరేకత మొదలైంది. ఇప్పటికే పలువురు సోషల్ మీడియా ద్వారా ఆయన పై కామెంట్లు చేస్తున్నారు. క్షమాపలు చెప్పాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. సైబర్ క్రైమ్ లో నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ పై పోలీస్ కేసు నమోదు అయింది..
మహాత్మా గాంధీ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటుడు శ్రీకాంత్ అయ్యగారు పై ఇప్పటికే పలువురు పోలీస్ కేసులను నమోదు చేశారు.. యునైటెడ్ ఎన్జీఓస్ అసోసియేషన్ సభ్యులు, సేవాలాల్ బంజారా సంఘం పోలీసులకు ఫిర్యాదు చేశారు.. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహాత్మ గాంధీ లాంటి గొప్ప వ్యక్తిపై ఇలాంటి వ్యాఖ్యలు చేసిన నటుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతే కాదు ఆయన చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ చర్యలు తీసుకోవాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇది తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది.
Also Read: వీకెండ్ ఓటీటీలోకి కొత్త సినిమాలు.. ఇంట్రెస్టింగ్ గా రెండు తెలుగు మూవీస్..
స్వాతంత్ర్యంను అస్సలు గాంధీ తీసుకరాలేదు.. అది కేవలం సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ వంటి వీరుల త్యాగఫలం అని ఆయన చెప్పాడు. అంతేకాక, మహాత్ముడు ఎంతోమందిని లైంగికంగా వేధించాడని చరిత్ర చెబుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విమర్శలపై శ్రీకాంత్ స్పందిస్తూ.. నేను ఏ పోస్ట్ పెట్టినా కామెంట్లు వస్తాయి. వాటిని నేను పెద్దగా పట్టించుకోను.. అంటూ విమర్శలతో సెల్పీ వీడియో విడుదల చేశారు.. ఆ వీడియో నెట్టింటా దుమారం రేపింది.. దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయులపై ఇలాంటి అసభ్యకర వ్యాఖ్యలు చేసి సమాజంలో భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రమాదముంది.. ఇప్పటికే దీనిపై తెలుగు ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో ఆయన పై కేసులు కూడా నమోదయ్యాయి. మరి దీనిపై నటుడు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఏది ఏమైనా కూడా జాతిపిత పై ఆయన చేసిన కామెంట్స్ పై నిరసనలు కూడా మొదలైనట్లు తెలుస్తుంది. ఆయనని ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి అంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తుంది. మరి దీనిపై నటుడు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి..
మహాత్మాగాంధీ పట్ల అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలు చేసిన నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ పై సీసీఎస్ లో ఫిర్యాదు చేసిన టీపీసీసీ ఉపాధ్యక్షులు, ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూరి వెంకట్
ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో గాడ్సే, సావర్కర్ వారసులు మహాత్ముడిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు
గాంధీ అహింసా… https://t.co/BGWDxpltrQ pic.twitter.com/DEaOmsHMq0
— BIG TV Breaking News (@bigtvtelugu) October 11, 2025