ఇ-కామర్స్ ప్లాట్ ఫామ్ ఫ్లిప్ కార్ట్ ఎప్పటి లాగే ఈసారి దీపావళికి క్రేజీ ఆఫర్లను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఫ్లిప్ కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ 2025 పేరుతో అదిరిపోయే డిస్కౌంట్లు అందించబోతోంది. అక్టోబర్ 11 నుంచి బిగ్ బ్యాంగ్ సేల్ ప్రారంభం కానుంది. ఫ్లిప్ కార్ట్ ప్లస్, ఫ్లిప్ కార్ట్ బ్లాక్ సభ్యులు ఇవాళ్టి(అక్టోబర్ 10) నుంచే షాపింగ్ చేసే అవకాశం లభిస్తోంది. ఫ్లిప్ కార్ట్ బ్లాక్ కోసం సైన్ అప్ చేయడం ద్వారా వినియోగదారులు ఈ సేల్ లో క్రేజీ ఆఫర్లను ముందుగానే పొందే అవకాశం ఉంటుంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో, ఫ్లిప్ కార్ట్ ప్రమోషన్ లో భాగంగా పలు లావాదేవీల మీద ఇన్ స్టంట్ క్యాష్ బ్యాక్ పొందే అవకాశం ఉంటుంది. అదనపు తగ్గింపుల కోసం, కస్టమర్లు ఎక్స్ఛేంజ్ ప్రమోషన్లు, ఉచిత EMI ప్లాన్లను కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఫ్లిప్ కార్ట్ మెంబర్ షిప్ కోసం ప్రస్తుతం సంవత్సరానికి రూ.1,249 ఛార్జ్ చేస్తుంది. గత ఏడాది రూ.1,499 వసూళు చేయగా, ఇప్పుడు ఆ మొత్తాన్ని తగ్గించింది. అంతేకాదు, రెగ్యులర్ కస్టమర్లకు ఉచిత లాయల్టీ ప్రోగ్రామ్ అయిన ఫ్లి ప్‌కార్ట్ ప్లస్ ద్వారా గిఫ్ట్ లు అందిస్తోంది. SBI క్రెడిట్ కార్డులు, SBI డెబిట్ కార్డులతో పాటు క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలను కొనసాగిస్తే 10 శాతం ఇన్ స్టంట్ తగ్గింపును అందిస్తోంది. ఫ్లిప్ కార్ట్, SBI కార్డ్ భాగస్వామ్యం కారణంగా ఉచిత EMI ప్లాన్లు , ఎక్చేంజ్ ఆఫర్లను కూడా పొందే అవకాశం ఉంటుంది.
ఇక ఫ్లిప్ కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ టైమ్ లో వినియోగదారులు ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డులతో చెల్లిస్తే అడిషనల్ సేవింగ్స్ ను పొందే అవకాశం ఉంటుంది. అదనంగా, సూపర్ కాయిన్ పెర్క్ లు, UPI ఆధారిత చెల్లింపు ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. సేల్ ఈవెంట్ టైమ్ లో వినియోగదారులు ప్రముఖ బ్రాండ్ లకు సంబంధించిన స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లు, ఆడియో యాక్సెసరీస్, పెద్ద గృహోపకరణాలను తగ్గింపు ధరలకు కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తోంది. నిజానికి సేల్ గడువు తేదీని ఫ్లిప్ కార్ట్ అధికారికంగా నిర్ధారించలేదు. అక్టోబర్ 2న ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025ను ముగించింది. అక్టోబర్ 11 నుంచి బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ 2025 ప్రారంభకానుంది. సో , వినియోగదారులు ఆయా డీల్స్ మీద బెస్ట్ ఆఫర్లు, క్యాష్ బ్యాక్ తో పాటు బహుమతులు పొందే అవకాశం ఉంటుంది. ఫ్లిప్ కార్ట్ మెంబర్స్ మాత్రం ఇవాళ్టి నుంచి షాపింగ్ చేసే అవకాశం ఉంది. ఆయా వస్తువల మీద తగ్గింపు ధరలను ఒక్క రోజు ముందు నుంచే పొందవచ్చు.
Read Also: అరట్టై యాప్ నుంచి క్రేజీ అప్ డేట్.. ఇక తగ్గేదే లే!