BigTV English

Nara Lokesh : పవన్ కాళ్లు మొక్కిన నారా లోకేష్.. నెట్టింట వీడియో వైరల్

Nara Lokesh : పవన్ కాళ్లు మొక్కిన నారా లోకేష్.. నెట్టింట వీడియో వైరల్

Lokesh Touched Pawan Kalyan Feet : ఏపీలో అధికారం మారింది. కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్, మంత్రులు ప్రమాణ స్వీకారాలు చేశారు. ఈ వేడుకకు అతిరథ మహారథులు హాజరై.. కన్నులారా వీక్షించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు ప్రమాణ స్వీకారం చేసేటపుడు నారా, నందమూరి, మెగా ఫ్యామిలీలు భావోద్వేగానికి గురయ్యాయి. ఈ వేడుకలో ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.


మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా లోకేశ్.. పవన్ వద్దకెళ్లి ఆయన కాళ్లు మొక్కారు. జనసేన అధినేత అయిన పవన్ కల్యాణ్ కాళ్లు మొక్కుతుండగా.. ఆయన వద్దంటూ ఆపారు. ఏం పర్లేదు.. నాకు సోదరుడితో సమానమైన మీ కాళ్లు మొక్కడంలో తప్పులేదంటూ.. పవన్ కాళ్లు మొక్కి ఆశీర్వచనం తీసుకున్నారు నారా లోకేశ్.

Also Read : రియల్ హీరో పవన్ కల్యాణ్.. ప్రశంసల వర్షం కురిపించిన చంద్రబాబు, మోదీ


ఇప్పుడీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఏపీలో రాక్షసుల పాలనపోయి మంచి పాలన వచ్చిందనేందుకు ఇంతకంటే ఉదాహరణ లేదంటున్నారు నెటిజన్లు. ఎలాంటి అహం లేకుండా నారా లోకేశ్ పవన్ కాళ్లను తాకి ఆశీర్వాదం తీసుకోవడం తమ గుండెలను తాకిందంటున్న జనసైనికులు. లోకేష్ అన్నను మనం దత్తత తీసుకుందామంటూ కామెంట్లు పెడుతున్నారు.

కాగా.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియోకి ఓ నెటిజన్.. పవన్ వ్యక్తిత్వంపై కామెంట్ చేశారు. “కౌరవసేనను కూల్చడానికి శ్రీకృష్ణుడిలా నిలబడ్డాడు. ఒక దౌర్భాగ్యపు పరిపాలనను అంతమొందించడానికి తగ్గాడు.. నెగ్గాడు..నెగ్గించాడు. ఆయన ఆత్మవిశ్వాసం, నిజాయితీ, సేవా, మానవత్వం, బంధం విలువలు తెలిసినోడు, వాటిద్వారా గౌరవం, విలువలు, ఆనందం, ఆప్యాయతలు అన్ని లభిస్తాయి. ఇటువంటి వారికి పదవులు అనేవి చిన్నవి.” అని ఆ నెటిజన్ పవన్ పై ప్రశంసలు కురిపించారు.

Related News

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Big Stories

×