Uttar Pradesh Crime: ఈ మధ్యకాలంలో ప్రేమ పెళ్లిళ్లు విపరీతంగా జరుగు తున్నాయి. ఒకవేళ పేరెంట్స్ వద్దంటే అఘాయిత్యానికి పాల్పడుతున్నారు యువతీ యువకులు. అందుకు కారణాలు ఏమైనా కావచ్చు. కాకపోతే వదిన చెల్లిని ప్రేమించాడు మరిది. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. తీరా మరో అమ్మాయితో ఎంగేజ్ మెంట్‌కు రెడీ అవుతున్నాడు. చివరకు చెల్లి బాధ తట్టుకోలేక.. మరిది ప్రైవేటు పార్ట్స్‌ని కట్ చేసింది అన్న భార్య. సంచలనం రేపిన ఈ ఘటన యూపీలో వెలుగు చూసింది.
యూపీలో దారుణం
యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లోని మౌ ఐమాకు ప్రాంతానికి చెందిన మల్కాన్‌పూర్-మిష్రిర్ పట్టి దంపతులకు ఐదుగురు కొడుకులు. రెండో కొడుకు ఉదయ్ కుమార్.. మౌ ఐమా పోలీస్‌స్టేషన్ ప్రాంతంలోని కహ్లి గ్రామానికి చెందిన మంజును వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు పెళ్లి జరిగి మూడేళ్లు అయ్యింది. ఉదయ్‌కుమార్ తమ్ముడు ఉమేష్.. వదిన చెల్లి మీనా(యువతి పేరు మరొకటి)తో పరిచయం పెరిగింది. ఉమేష్ ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు.
ఆ తర్వాత ప్రేమగా మారింది. మీనాను పెళ్లి చేసుకుంటానని ఉమేష్ మాట ఇచ్చాడు. ఉమేష్-మీనా రిలేషన్ గురించి ఆ కుటుంబంలోని అందరికీ తెలుసు. ఈ సమయంలో ఉమేష్ వివాహం గురించి ఇంట్లో చర్చలు మొదలయ్యాయి. దాదాపు మూడు నెలల కిందట ఉమేష్.. మీనాతో పెళ్లికి నిరాకరించాడు. అందుకు రకరకాల కారణాలు లేకపోలేదు. తాను మరొకర్ని ప్రేమిస్తున్నానని, ఆ యువతినే పెళ్లి చేసుకుంటానని ఇంట్లో చెప్పాడు ఉమేష్. నవంబర్‌లో ఉమేష్‌కు పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. వెంటనే రంగంలోకి మంజు దిగింది. తన మరిది ఉమేష్‌ని ఒప్పించడానికి తీవ్ర ప్రయత్నాలు చేసింది. అతను అంగీకరించలేదు. వదిన-మరిది మధ్య గొడవ జరిగింది కూడా.
మరిది ప్రైవేటు పార్ట్స్ కట్ చేసిన వదిన
ప్రేమలో మోసపోయిన మీనా నిరాశలోకి జారుకుంది. ఎవరితో మాట్లాడటానికి ఇష్టపడేది కాదు. తన చెల్లి పరిస్థితిని చూసిన మంజు.. మరిది ఉమేష్‌కు గుణపాఠం చెప్పాలని డిసైడ్ అయ్యింది. అక్టోబర్ 16న తెల్లవారుజామున 2 గంటల సమయంలో మంజు.. నిద్రపోతున్న మరిది గదిలోకి ప్రవేశించింది. తొలుత ఉమేష్ ప్రైవేట్ భాగాలపై కత్తితో దాడి చేసింది. ఆ తర్వాత వాటిని కత్తిరించింది. బాధకు తప్పుకోలేక ఉమేష్ అరవడం ప్రారంభించాడు. అరుపులు విని కుటుంబసభ్యులు గదిలోకి వెళ్లారు. రక్తంతో తడిసిన మంచంపై ఉమేష్ నొప్పితో విలవిలలాడుతున్నాడు.
ALSO READ: తెలుగు రాష్ట్రాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో ముగ్గురు మృతి
అతడి ప్రైవేట్ భాగం మంచంపై పడి ఉంది. వెంటనే కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుండి మరో ఆసుపత్రికి రిఫర్ చేయడంతో అక్కడ చేర్చారు. దాదాపు గంటన్నర ఆపరేషన్ తర్వాత అతడి ప్రాణాలను కాపాడారు డాక్టర్లు. యువకుడికి ప్రాణాపాయం తప్పిందని, పూర్తిగా కోలుకోవడానికి ఎనిమిది నెలలు పట్టవచ్చని తెలిపారు. ప్రస్తుతం బాధితుడు ఇంటెన్సివ్ కేర్‌లో వైద్య పర్యవేక్షణలో ట్రీట్‌మెంట్ జరుగుతోంది. ఈ ఘటన తర్వాత మంజు పరారీలో ఉంది. పోలీసులు ఆమె కోసం వెతుకుతున్నారు. ఉదయ్‌కుమార్ ఫ్యామిలీని ప్రశ్నించారు. చివరకు నిందితురాలు మంజు ప్రస్తుతం గర్భవతి. ఆమెని అదుపులోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు బయటపడటాయని పోలీసులు భావిస్తున్నారు.