Telusu kada Collections :సిద్ధూ జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) తాజాగా నటించిన చిత్రం ‘తెలుసు కదా’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన (Neeraja Kona) తొలిసారి దర్శకురాలిగా వ్యవహరించారు. సిద్దు జొన్నలగడ్డ హీరోగా, కేజిఎఫ్ (KGF ) బ్యూటీ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) , రాశిఖన్నా (Raashii khanna) హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం అక్టోబర్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. సిద్ధూ జొన్నలగడ్డ చివరిగా నటించిన జాక్ తర్వాత ఈ సినిమా విడుదల అయింది.
మరొకవైపు రొమాంటిక్ , మ్యూజికల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో కామెడీ, ఎమోషన్ , ఫ్యామిలీ విలువలను మిళితం చేస్తూ చాలా చక్కగా తెరకెక్కించారు. శ్రీనివాస్ రెడ్డి , హర్ష కీలకపాత్రలో నటించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. తమన్ అందించిన పాటలు మంచి విజయం అందుకొని సినిమాపై హైప్ తీసుకొచ్చాయి కానీ ఈ సినిమా స్టోరీ ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు రూ.35 కోట్ల బడ్జెట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ముఖ్యంగా నటీనటుల రెమ్యూనరేషన్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ మొత్తం కేటాయించినట్లు తెలుస్తోంది.
ఈ సినిమా బిజినెస్ విషయానికి వస్తే.. ఓటీటీ హక్కులు రూ.16 కోట్లు, శాటిలైట్ హక్కులు రూ.8కోట్లు, మ్యూజిక్ రైట్స్ రూ.1.5కోట్లు.. మొత్తం నాన్ థియేట్రికల్ హక్కులు రూ.25.5 కోట్ల మేరా బిజినెస్ జరిగినట్లు సమాచారం. థియేట్రికల్ బిజినెస్ రూ.12 కోట్లు మాత్రమే జరిగినట్లు సమాచారం. అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే 25 కోట్ల గ్రాస్ వసూల్ అవసరమని ట్రేడ్ విశ్లేషకులు కూడా తెలియజేశారు. మరి ఈ సినిమా విడుదల అయ్యి.. నాలుగు రోజులు అవుతున్న నేపథ్యంలో ఈ నాలుగు రోజులకు గానూ ఈ సినిమా ఎంత కలెక్షన్స్ వసూలు చేసింది అనే విషయం ఇప్పుడు చూద్దాం.
ALSO READ:Bigg Boss 9 Promo: నువ్వు వద్దు నీ ప్రేమ వద్దు.. పోవమ్మా.. మాధురికి తనూజ స్ట్రాంగ్ కౌంటర్
అక్టోబర్ 17న చాలా గ్రాండ్గా విడుదలైన ‘తెలుసు కదా’ సినిమా మొదటిరోజు దేశవ్యాప్తంగా రూ.2.1 కోట్ల నెట్ కలెక్షన్స్, రూ.3.25 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు సమాచారం. రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.3.76 కోట్ల షేర్ , రూ. 7.15 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ ట్రాకర్స్ తెలిపాయి. ఇక మూడవ రోజు కూడా పేలవంగా కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇకలా మొత్తంగా నాలుగు రోజులకు కలిపి.. రూ.6.5 కోట్ల షేర్, రూ.11 కోట్ల వరకు గ్రాస్ మాత్రమే వసూలు చేసినట్లు సమాచారం.
మొత్తానికైతే సిద్దు జొన్నలగడ్డ ఈ సినిమాతో జాక్ పాట్ కొడదాం అనుకున్నారు. కానీ జాక్ లాంటి ఫ్లాప్ చూసిన తర్వాత ఇప్పుడు హిట్ అని అన్నారు హీరో. కానీ జాక్ రిజల్ట్ వచ్చింది. మొత్తానికైతే జాక్ పాట్ రాలేదని చెప్పాలి. ఏది ఏమైనా సిద్ధూ జొన్నలగడ్డ ఆశలు మళ్లీ నిరాశగానే మిగిలిపోయాయని చెప్పడంలో సందేహం లేదు.