Dude Collections : లవ్ టుడే, డ్రాగన్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకున్న హీరో ప్రదీప్ రంగనాథన్.. ఈ హీరో తాజాగా మరో సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. దీపావళి సందర్భంగా ఈయన నటించిన డ్యూడ్ మూవీ థియేటర్లలో రిలీజ్ అయ్యింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది దీపావళికి సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంది. ఏకంగా నాలుగు సినిమాలు డిఫరెంట్ కథలతో ప్రేక్షకులు ముందుకు వచ్చేసాయి. ఇందులో ఈ డ్యూడ్ మూవీ ఒకటి. స్టోరీ పరంగా మంచి మార్కులు పడ్డ ఈ సినిమా కలెక్షన్లు కూడా భారీగానే వసూలు చేస్తుంది. నాలుగు రోజులకు ప్రపంచ వ్యాప్తంగా 70 కోట్లకు పైగా రాబాట్టినట్లు తెలుస్తుంది.. అంతే కాదు ఇప్పుడు రిలీజ్ అయిన సినిమాలు అన్నిట్లో కల్లా ఇదే విన్నర్గా నిలిచిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి నాలుగు రోజులకు గాను ఎన్ని కోట్లు వసూలు చేసిందో ఒకసారి తెలుసుకుందాం..
ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం డ్యూడ్.. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వై రవిశంకర్, నవీన్ యెర్నెనీ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో శరత్ కుమార్, హ్రిదు హరూన్, డ్రావిడ్ సెల్వమ్, సత్య, రోహిణి, ఐశ్వర్య శర్మలు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. కీర్తీశ్వన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ రిలీజ్ కి ముందు భార్య అంచనాలను క్రియేట్ చేసుకుంది.. థియేటర్లలో వచ్చిన మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది.. 120 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈ చిత్రానికి తొలి రోజున ఇండియా వైడ్‌గా 9.75 కోట్ల రూపాయలు, రెండో రోజున 10 కోట్లు, మూడో రోజున 8 కోట్లు వసూళ్లు వచ్చాయి. 66 కోట్లు వచ్చినట్లు యూనిట్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. మొత్తం 70 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ను వసూల్ చేసిందని సమాచారం. మరి కొద్ది రోజుల్లోనే 100 కోట్లు రాబట్టినా ఆశ్చర్యం లేదని సినీ వర్గాల్లో టాక్..
Also Read: బాక్సాఫీస్ వద్ద ‘కే ర్యాంప్’ మోత.. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్..!
ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కుతోంది.. ఇక్కడ మాత్రమే కాదు ఓవర్సీస్ లో కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ జోరు కొనసాగుతుంది. యూఎస్ బాక్సాఫీస్ దగ్గర 575K డాలర్లకు పైగా వసూళ్లు రాబట్టి దూసుకెళ్తోంది.. సాయి అభ్యంకర్ సంగీతం అందించారు.. మొత్తానికి ఈ వీక్ డేస్ లో కూడా ఈ సినిమా హవానే కొనసాగుతుంది.. ఈ దీపావళికి రిలీజ్ అయిన సినిమాలలో ఈ సినిమానే విన్నర్గా నిలిచింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మొత్తానికి ప్రదీప్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ పడిపోయింది.. ఫైనల్ గా ఎన్ని కోట్ల వసూళ్లను కలెక్ట్ చేస్తుందో చూద్దాం..