పూణేలోని చారిత్రాత్మక శనివర్ వాడా కోట లోపల ముస్లిం యువతులు రీసెంట్ గా నమాజ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు కోటలో నమాజ్ చేసిన ప్రాంతంలో శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజ్యసభ ఎంపి మేధా కులకర్ణి నేతృత్వంలో ఈ కార్యక్రమం కొనసాగింది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో పాటు మహారాష్ట్రలో రాజకీయ దుమారం రేపింది.
కోటలో నమాజ్ కు సంబంధించిన వీడియోను ఎంపీ కులకర్ణి ఎక్స్ వేదికగా షేర్ చేశారు. 1732 లో నిర్మించబడి, 1818 వరకు మరాఠా సామ్రాజ్యంలోని పేష్వాల స్థావరంగా పనిచేసిన శనివర్ వాడాలో జరిగిన ఈఘటనను ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. ఈ ఘటనకు వ్యతిరేకంగా నిరసనకు పిలుపునిచ్చారు.”ఇది ప్రతి పూణే పౌరుడికి ఆందోళన, కోపం తెప్పించే విషయం. పూణే పాలకులు ఏం చేస్తున్నారు? వారసత్వ ప్రదేశాల పట్ల గౌరవం ఎందుకు కనుమరుగవుతోంది? రండి, మనమందరం ఐక్యంగా ఉండి మన సంస్కృతిని గౌరవిద్దాం” అని కులకర్ణి సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చారు. “ఈ సంఘటన కోట ప్రాంగణంలోనే జరిగిందని స్పష్టం చేస్తుంది. ఇలాంటి కోటలు ఆ తర్వాత నమాజ్ చేసే మతపరమైన ప్రదేశాలుగా మారడాన్ని మేము చూశాము. అటువంటి ఆక్రమణలను నివారించడానికి, మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం” అని కులకర్ణి వెల్లడించారు. శుద్ధీకరణ కార్యక్రమం గురించి ఎంపి ట్వీట్ చేస్తూ “శనివర్ వాడ ఒక చారిత్రాత్మక ప్రదేశం. ఇది మా విజయానికి చిహ్నం, మరాఠా సామ్రాజ్యం అటాక్ నుంచి కటక్ వరకు విస్తరించిన కేంద్రం. ఎవరైనా ఇక్కడ నుండి నమాజ్ చేయడానికి వస్తే, మేము దానిని సహించము” అన్నారు.
शनिवार वाड्यात नमाज पठण चालणार नाही, हिंदू समाज आता जागृत झाला आहे ! 🚩🚩
🚩चलो शनिवार वाडा! 🚩
रविवार, 19 ऑक्टोबर 2025
📍 शनिवार वाडा, कसबा पोलीस चौकीसमोर
🕓 सायंकाळी 4 वाजता
—
🔥 पुण्याचे वैभव – शनिवार वाडा
ऐतिहासिक वारसा स्थळ की गैर हिंदू प्रार्थना स्थळ?
सारसबाग येथे… pic.twitter.com/EObcXMZ6Rt— Dr. Medha Kulkarni (@Medha_kulkarni) October 19, 2025
ఈ సంఘటనపై అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) తీవ్రంగా స్పందించింది. కులకర్ణి ఈ సమస్యను మతపరమైనదిగా మార్చడానికి ప్రయత్నించారని ఆరోపించింది. “మేధా కులకర్ణి పూణేలో మతపరమైన విభేదాలను సృష్టించడానికి ప్రయత్నించారు. ఆమెపై వెంటనే కేసు నమోదు చేయాలి. శనివర్ వాడా ఏ ఒక్క గ్రూపు, మతానికి చెందినది కాదు. పూణే ప్రజలందరిదీ. కులకర్ణి ఉద్దేశపూర్వకంగా నగరంలో శాంతిని చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. బిజెపి ఆమెను అదుపులో పెట్టాలి” ఎన్‌సిపి అధికార ప్రతినిధి రూపాలి పాటిల్ థోంబారే అన్నారు.
అటు నమాజ్ వైరల్ వీడియోపై మహారాష్ట్ర మంత్రి నితేష్ రాణే స్పందించారు. “శనివర్ వాడాకు ఒక చరిత్ర ఉంది. ఇది మన శౌర్యానికి చిహ్నం. హిందూ సమాజ హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ప్రజలు అక్కడ నమాజ్ చేసినట్లుగా, హిందువులు హాజీ అలీ దగ్గరికి వెళ్లి హనుమాన్ చాలీసా జపించడానికి మీరు అంగీకరిస్తారా? అది మనోభావాలను దెబ్బతీయలేదా? సూచించిన ప్రదేశాలలో మాత్రమే ప్రార్థనలు చేయాలి. ఈఘటనపై హిందూవులు ఆందోళన చేయడం సమర్థనీయమే” అన్నారు.
Read Also: బెంగళూరులో చీకట్లు, ఢిల్లీలో వెలుగులు.. దీపావళిలో ఇంత తేడా ఉందా?