దీపావళి: హైదరాబాద్ లో జరిగిన దీపావళి వేడుకల్లో 70 మందికి పైగా గాయాలు అయినట్టు వార్తలు వచ్చాయి. ఎక్కువగా చిన్న పిల్లలకు కంట్లో దెబ్బలు తాకినట్టు తెలుస్తుంది. ‘సరోజినీ దేవి ఐ హాస్పిటల్’ ఎక్కువ పేషెంట్స్ ని ట్రీట్ చేసింది. కొంత పేషెంట్లను వెంటనే ట్రీట్మెంట్ చేసి పంపించేశారు ఇంకా కొంత పేషెంట్స్ ని సర్జరీ కోసం అక్కడే ఉంచుకున్నారు.
దీపావళి వేడుకలు
హైదరాబాద్ నగరం లో దీపావళి వేడుకలు చాల ఘనంగా జరుగుతాయి. ప్రతి సంవస్తరం టపాకాయలు పేల్చే టైం లో జాగ్రత్త వహించండి అని ప్రభుత్వం చెప్తానే వస్తుంది.
ఇలాంటి ప్రమాదాల కోసం ప్రతి సంవస్తరం లాగే ఈ సంవస్తరం కూడా మెహిదీపట్నం లో ఉన్న సరోజినీ దేవి హాస్పిటల్ రెడీ గా ఉంది.
సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు
“సరోజినీ దేవి ఐ హాస్పిటల్” కి సోమవారం ఉదయం నుంచి మంగళవారం వరకు 90 పేషెంట్స్ ట్రీట్మెంట్ చేయించుకున్నారు హాస్పిటల్ యాజమాన్యం వెల్లడించింది. గాయపడిన వారు ఎక్కువగా పిల్లలు లేదా యంగ్ పీపుల్ అని వెల్లడించారు.
సర్జరీ అవసరం ఉన్న పేషెంట్స్ ల సంఖ్య ‘రెండు’ గా హాస్పిటల్ వెల్లడించింది. రాన్నున్న రోజుల్లో వీళ్ళకి సర్జరీ చేసే అవకాశం ఉంది. కానీసం 20 మంది పేషెంట్స్ వెంటనే ట్రీట్మెంట్ చేయించుకొని వెళ్లిపోయారు అని రెసిడెంట్ మెడికల్ ఆఫీస్ వెల్లడించింది.
దీపావళి వేడుకల్లో ఎక్కువగా చిన్నారులు గాయపడ్తారు, అలాగే కుర్రకారు జోష్ లో చేతిలో పట్టుకొని టపాకాయలు కాలుద్దామని గాయాల పలు అవుతారు. ఇలాంటి పనులు చేస్తే పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంది, కంటి చూపు కూడా ప్రమాదం లో పడే ఛాన్స్ ఉంది.
దీపావళి పొల్యూషన్
టపాకాయల మూలాన మరణం సంభవిస్తుందో లేదో తెలీదు కానీ, కాలుష్యం మూలాన మాత్రం ప్రాణానికి ముప్పు ఉంది అని తెలుస్తుంది. దీపావళి టపాకాయలు ఏటా 875 పెర్సెంట్ కాలుష్యాన్ని పెంచుతుంది. ఈ సంఖ్య వింటేనే మనకి వణుకు పుడుతుంది. ఇక ఊహించండి ఈ గాలి పిలుస్తే ఎంత వరకు మన ఆరోగ్యం చెడిపోతుందో.
టపాకాయల తయారీ విధానం
దీపావళి టపాకాయలు పొటాషియం నైట్రేట్ ఇంకా charcoal లాంటి కెమికల్స్ తో తయారు చేస్తారు, కానీ వీటి వలన కాలుష్యన్నీ హాని చేసే గ్యాసెస్ ఎక్కువగా గాలిలో కలుస్తాయి.