BigTV English

Amazon Prime Day Sale 2024: అమెజాన్ కొత్త సేల్ రెడీ.. భారీ డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు పొందొచ్చు.. ఫుల్ డీటెయిల్స్ ఇవే!

Amazon Prime Day Sale 2024: అమెజాన్ కొత్త సేల్ రెడీ.. భారీ డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు పొందొచ్చు.. ఫుల్ డీటెయిల్స్ ఇవే!

Amazon Prime Day Sale 2024: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ఎప్పటికప్పుడు తమ వినియోగదారులను అట్రాక్ట్ చేసేందుకు కొత్త కొత్త సేల్‌ను ప్రకటిస్తూ ఉంటుంది. స్మార్ట్‌ఫోన్లు, గృహోపకరణాలు, ఇతర ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్‌పై ఊహకందని డిస్కౌంట్లను ఆ సేల్ ద్వారా అందిస్తుంది. అయితే ఇప్పుడు మరొక సేల్‌తో వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ సారి ‘అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2024’తో రానుంది. తాజాగా ఈ సేల్ వివరాలను అమెజాన్ ప్రకటించింది.


ఈ ‘అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2024’ జూలై 20, శనివారం మధ్యాహ్నం 12:00 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ సేల్ జూలై 21, ఆదివారం రాత్రి 11:59 గంటల వరకు కొనసాగుతుంది. ఈ 48 గంటల సేల్ ఈవెంట్‌లో ఇంటెల్, శామ్‌సంగ్, వన్‌ప్లస్, ఐక్యూ, హానర్, సోనీ, ఆసుస్ దీంతోపాటు బజాజ్, ఇంటెల్, బోట్, సోనీ, హెచ్‌పీ, ఏసర్, లెనోవోతో సహా 450కి పైగా భారతీయ, గ్లోబల్ బ్రాండ్‌లను కొనుక్కోవచ్చని కంపెనీ తెలిపింది. ఇందులో హోమ్ & కిచెన్, ఫ్యాషన్ & బ్యూటీ సహా చాలా ప్రొడక్టులను తగ్గింపు ధరలతో పొందవచ్చు.

ఈ సేల్‌లో బ్యాంక్ ఆఫర్లు కూడా అందించారు. అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2024 సమయంలో కొనుగోలుదారులు ICICI, SBI బ్యాంక్ కార్డ్‌లు, క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలను ఉపయోగించి చేసిన చెల్లింపులపై 10 శాతం డిస్కౌంట్లను పొందుతారు. అలాగే Amazon Pay ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు రూ.2,500 వరకు వెల్‌కమ్ రివార్డులను పొందుతారు. రూ.300 వరకు క్యాష్‌బ్యాక్ (ప్రైమ్ మెంబర్స్)కు మాత్రమే.. అలాగే రూ.2,200 వరకు రివార్డ్‌లను పొందవచ్చు.


Also Read: అమెజాన్ కిర్రాక్ డీల్.. చీప్ ధరలో 5జీ ఫోన్లు.. విడిచిపెట్టారో మళ్లీ దొరకవ్..!

అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2024లో ఎకో స్మార్ట్ స్పీకర్, ఫైర్ టీవీ స్టిక్‌పై 55 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. ఏవైనా ప్రొడక్టులను ఆర్డర్ చేసిన రోజు లేదా ఆ తర్వాత రోజు డెలివరీ చేసే అవకాశం ఉంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే.. అమెజాన్ ప్రైమ్ మెంబర్లు మాత్రమే ఈ సేల్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రైమ్ మెంబర్లు కాకపోతే 30 రోజుల పాటు ప్రైమ్ మెంబర్‌షిప్‌ (ట్రయల్)ను ఫ్రీగా వినియోగించుకోవచ్చు.

అయితే డిస్కౌంట్ సేల్‌లో పాల్గొనడానికి కస్టమర్‌లు ప్రైమ్ మెంబర్‌షిప్‌ను కొనుగోలు చేయవచ్చు. భారతదేశంలో ప్రైమ్ మెంబర్‌షిప్ ధర ఒక నెలకు రూ.299గా ఉంది. అదే మూడు నెలలకు రూ.599 చెల్లించాల్సి ఉంటుంది. ఒక సంవత్సరానికి రూ.1,499 చెల్లించాలి. అమెజాన్ ప్రైమ్ షాపింగ్ ఎడిషన్ ప్లాన్ ధర 12 నెలలకు రూ.399గా నిర్ణయించారు. అంతేకాకుండా అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా కొత్త కొత్త చిత్రాలు, సిరీస్‌లు కూడా చూసుకోవచ్చు.

Tags

Related News

Minimum Balance Account: బ్యాంకు మినిమమ్ బ్యాలెన్స్ కొత్త నియమాలు.. పెనాల్టీ తప్పదా?

Trump On Gold: దిగొచ్చిన పసిడి.. ‘బంగారు’ మాట చెప్పిన ట్రంప్, ఏమన్నారు?

PM-KMY Scheme: కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఈ స్కీంలో నెలకు రూ. 55 కడితే చాలు..ఉద్యోగం చేయకపోయినా పెన్షన్ గ్యారంటీ..

BSNLలో 365 రోజుల వ్యాలిడిటీ ప్లాన్స్ ఇవే…ఏకంగా 600 జీబీ డేటా పొందే ఛాన్స్…ఎంత రీచార్జ్ చేయాలంటే..?

Real Estate: ప్రీ లాంచ్ ఆఫర్స్ అంటే ఏంటి..? మీ సొంత ఇంటి కలను ఇలాంటి ఆఫర్స్ ఎలా ముంచేస్తాయి..

Real Estate: బ్యాంకులు వేలం వేసే ఇళ్లను చాలా చీప్‌గా కొనేయొచ్చు.. మరి, ఆ వేలంలో ఎలా పాల్గోవాలి ?

Big Stories

×