BigTV English

Mukesh Ambani : అంబానీ తర్వాతే ఎవరైనా.. గిఫ్ట్స్ ఇవ్వాలంటే!

Mukesh Ambani : అంబానీ తర్వాతే ఎవరైనా.. గిఫ్ట్స్ ఇవ్వాలంటే!

Mukesh Ambani


Mukesh Ambani : అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, ఆయన కుటుంబ సభ్యులు పలు సందర్భాల్లో ఖరీదైన కానుకలు ఇచ్చిపుచ్చుకుంటుంటారు. ఆ కానుకలకు సంబంధించి ఎన్నో వార్తలు మీరు వీనే ఉంటారు. అయితే కొన్ని నెలల క్రితమే ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ నిశ్చితార్థం సందర్భంగా వారికి అందించిన బహుమతులు చర్యనీయాంశంగా మారాయి.

ముకేష్ అంబానీ కొన్ని ప్రత్యేక సందర్బాల్లో తమ కుటుంబ సభ్యులకు ఖరీదైన గిఫ్ట్స్ ఇస్తుంటారు. వాటి విలువ కోట్లలోనే ఉంటుంది. వాటి గురించి విన్నవారు, తెలిసినవారు ముకేశ్ అంబానీ తర్వాతే గిఫ్ట్‌లు ఇవ్వాలంటే ఎవరైనా అని చెబుతుంటారు.


READ MORE : వరల్డ్ రిచెస్ట్ బిలియనీర్ లిస్ట్ నుంచి మస్క్ అవుట్.. ప్రపంచ కుబేరుడిగా అమెజాన్ అధినేత

అలానే కొన్ని రోజుల క్రితం అనంత్ అంబానీ- రాధికా నిశ్చితార్థం సందర్భంగా వధూవరులిద్దరికీ పలు బహుమతులు అందించారు ముకేష్ అంబానీ. తన రెండో కొడుకు అనంత్ అంబానీకి నిశ్చితార్థం వేడుక రోజున ఏకంగా రూ.4.5 కోట్లు విలువ చేసే బెంట్లీ కాంటినెంటల్ జీటీసీ స్పీడ్ కారును గిఫ్ట్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేశారు.

అంతేకాకుండా తనకు కాబోయే కోడలు రాధికా మర్చంట్‌కి ఖరీదైన వెండి గణపతి విగ్రహం, కుండలు సహా పలు నగలు కానుకగా అందించారట. అలాగే నీతా అంబానీ తన సొంత డైమండ్ నక్లెస్ సైతం రాధికా మర్చంట్ కి అందించినట్లు ఇటీవలే వార్తలు వచ్చాయి.

అదేవిధంగా అకాశ్ అంబానీ సైతం తన సోదురుడు అనంత్ అంబానీకి వజ్రాలతో రూపొందించిన పాంతర్ బ్రూచ్ జువెలరీని గిఫ్ట్‌గా అందించారు. దాని విలువ సుమారు రూ.1.3 కోట్లుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ముకేశ్ అంబానీ 2007లోనే తన భార్య నీతా అంబానీ పుట్టిన రోజు సందర్భంగా ఏకంగా ఆమెకు రూ.240 కోట్లు విలువ చేసే ప్రైవేట్ జెట్‌ను గిఫ్గ్‌గా ఇచ్చారు. గతేడాది దీపావళి గిఫ్ట్‌గా నీతా అంబానీకి రోల్స్ రాయిస్ కుల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్ కారును సైతం ఇచ్చారు. దాని విలువ రూ.10 కోట్లు ఉంటుంది.

READ MORE : యాపిల్ సంస్థకు రూ.16,500 కోట్ల ఫైన్.. ఎందుకంటే!

ఆకాశ్ అంబానీ, శ్లోకా మెహతా వివాహం 2019లో జరిగింది. ఈ సందర్భంగా పెద్ద కోడలికి రూ.450 కోట్లకుపైగా విలువైన నెక్లెస్ కానుకగా అందించారు. తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ కోసం 2022లో రూ.640 కోట్లు ఖర్చు చేసి దుబాయిలో లగ్జరీ విల్లాను కొనుగోలు చేసి బహుమతిగా ఇచ్చారు.

అంతేకాకుండా ముకేశ్ అంబానీ తన వద్ద నమ్మకంగా పని చేస్తోన్న ఉద్యోగి మనోజ్ మోదీకి ఓ ఇంటిని కానుకగా అందించారు. ఆ భవనం 22 అంతస్థుల్లో ఉంటుంది. భవనం విలువ రూ.1500 కోట్లు ఉంటుందట.

Tags

Related News

D-Mart: కొనేది తక్కువ, దొంగతనాలు ఎక్కువ.. డి-మార్ట్ యాజమాన్యానికి కొత్త తలనొప్పి!

JIO Super Plans: జియో నుంచి సూపర్ ఆఫర్లు.. ఏది ఫ్రీ, ఏది బెస్ట్ అంటే?

SEBI – Foreign Funds: భారతీయ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. విదేశీ ఫండ్స్‌కి SEBI గ్రీన్ సిగ్నల్

ICICI Bank New Rules: కస్టమర్లకు ICICI బిక్ షాక్.. కనీస బ్యాలెన్స్ రూ.10 వేలు కాదు.. అంతకుమించి.. పేదోళ్ల సంగతి ఏంటో?

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Big Stories

×