Shobha Shetty In Kissik Talks: బిగ్ బాస్ శోభాశెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బుల్లితెరపై మోనితగా ఎంతో క్రేజ్ ను సంపాదించుకుంది. కార్తీక దీపం లో మోనితగా నెగిటివ్ రోల్లో ఫేమస్ అయ్యింది. దీంతో ఆడియన్స్ లో మోనితగానే ఫేం సంపాదించుకుంది. అయితే ఆ ఇమేజ్ ని పోగోట్టుకోవడానికే బిగ్ బాస్ కి వచ్చానని చెప్పింది. తెలుగు బిగ్ బాస్ 7న కంటెస్టెంట్ గా వెళ్లిన ఆమె హౌజ్ లో శివంగిల రెచ్చిపోయింది. టాస్క్ లో అందరికి గట్టి పోటీ ఇస్తూ దూకుడు చూపించేది. అయితే గెలిస్తే సంబరపడిపోయే శోభా.. ఒటమిని మాత్రం ఒప్పుకునేది కాదు.
వివాదాలతో నెగిటివిటీ
హౌజ్ ప్రతి ఒక్కరితో వివాదాలు, అర్గ్యూమెంట్స్ తో ఫుల్ నెగిటివిటీని మూటగట్టుకుంది. అయినా.. హౌజ్ లో చివరి వరకు సాగింది. టైటిల్ గెలవడమే లక్ష్యంగా దూసుకుపోయిన ఆమె కల మాత్రం నెరవేరలేదు. లాస్ట్ వరకు కొనసాగిన శోభా శెట్టికి బయటకు వచ్చాక వరుస ఆఫర్స్ కెరీర్ ఫుల్ బిజీ అయిపోతుంది అనుకున్నారు. కానీ, శోభా కు మాత్రం ఇంతవరకు ఎలాంటి సీరియల్ కు కమిట్ కాలేదు. మళ్లీ ఆమె బుల్లితెర ఎంట్రీ ఎప్పుడెప్పుడా? ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఆమె కన్నడ బిగ్ బాస్ లో దర్శనమిచ్చింది. తెలుగులో సీరియల్స్ చేస్తూ ఆడియన్స్ ని అలరిస్తుందనుకుంటే… కన్నడ బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా వెళ్లింది.
ఫ్యాన్స్ కి షాక్
దీంతో ఆమె తెలుగు ఫ్యాన్స్ అంతా షాక్ అయ్యారు. తెలుగులో లాగే కన్నడలోనూ తన సత్తా చూపిస్తుందనుకుంటే.. మొదట్లోనే హౌజ్ నుంచి బయటకు వచ్చింది. తెలుగు బిగ్ బాస్ షోలో శివంగి రెచ్చిపోయిన ఆమె.. కన్నడ మాత్రం అంత దూకుడు చూపించలేకపోయింది. తరచూ హౌజ్లోని కంటెస్టెంట్స్ గొడవలు పడుతూ కనిపించింది. ఆఖరికి సెల్ఫ్ నామినేషన్ చేసుకుని మరి బయటకు వచ్చింది. అయితే తను నామినేట్ చేసుకోవడంపై హోస్ట్ కిచ్చా సుదీప్ శోభాపై ఫైర్ అయిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడు హౌజ్ లో ఏం జరిగింది.. తను బయటకు రావడానికి కారణంపై తాజాగా పెదవి విప్పింది. తాజాగా ఆమె బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ షోకి ముఖ్య అతిథిగా హాజరైంది. ఈ సందర్భంగా తనకు కెరీర్, పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంది. ఈ సందర్భంగా కన్నడ బిగ్ బాస్ హౌజ్ నుంచి తను బయటకు రావడంపై శోభాశెట్టి పెదవి విప్పింది.
రెండు వారాలకే అవుట్
హౌజ్ లోకి వెళ్లిన రెండు వారాలకే శోభా బయటకు రావడం అందరికి షాకిచ్చింది. అయితే అక్కడ ఉండలేక స్వయంగా ఎలిమినేట్ చేసుకుంది. ఏడుస్తూ.. తనని బయటకు పంపించాలంటూ ఏడుస్తూ హోస్ట్ ని వేడుకుంది. అయితే శోభా తీరుపై హోస్ట్ సుదీప్ ఫైర్ అయ్యారుంటూ వార్తలు వచ్చాయి. దానికి కారణం ఆమె ఈ సందర్బంగా వెల్లడించింది. ఆరోగ్య సమస్యల కారణంగానే నేను బయటకు వచ్చాను. అక్కడ నాకు హెల్త్ సపోర్టు చేయలేదు. నామినేషన్ టైంలో మనకు ఎంతో ఎనర్జీ కావాలి. నామినేషన్ టైంలో వారితో వాదించడం, మనల్ని మనం డిఫెండ్ చేసుకోవాలి. కానీ, నాకు అంత ఎనర్జీ లేదు. ఫిజికల్ టాస్క్ లు ఆడాలి. హౌజ్ ఫిజికల్ గా, మెంటల్ గా స్ట్రాంగ్ ఉండాలి. అది నా వల్ల కాలేదు. ఆరోగ్య కారణాల వల్లే నన్ను నేను సెల్ఫ్ నామినేట్ చేసుకుని బయటకు వచ్చాను. అప్పుడాయన నిన్ను గెలుపించుకున్న ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేస్తావా? ఇది ఎంతో పెద్ద ప్లాట్ ఫాలం. అలాంటి ఫ్లాట్ ఫాం వదులుకోవడం సరైన నిర్ణయం కాదని ఆయన నాపై అరిచారు. ఆయన అరవడంలో తప్పులేదు. కానీ, నా ఆరోగ్యం నాకు ముఖ్యం. అందుకే షో నుంచి బయటకు వచ్చాను’ అని శోభా వివరణ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Also Read: గోవా వీడియో.. బాయ్ ఫ్రెండ్ తో గొడవలు.. పెళ్లి వద్దురా బాబూ అనిపించింది..
పూర్తి ఇంటర్వ్యూను ఇక్కడ చూడండి: