Podarillu Today Episode November 26th: మహాలక్ష్మి చక్రి కోసం వెయిట్ చేస్తూ ఉండగా చక్రీ లాప్టాప్ తీసుకుని వచ్చి ఇదిగోండి మీ లాప్టాప్ దొరికింది అని ఇస్తాడు. ఆ మాటతో చాలా సంతోషంగా ఫీల్ అయిన మహాలక్ష్మి వెంటనే ప్రజెంటేషన్ ఇవ్వడానికి రూమ్ కి వెళ్తుంది. తను అనుకున్న డ్రీం ప్రాజెక్టు గురించి అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పి ఇంప్రెస్ చేస్తుంది.మొత్తానికి మహాలక్ష్మి డ్రీమ్ ప్రాజెక్ట్ మాత్రం అందరికీ బాగా నచ్చడంతో మహాలక్ష్మి పై ప్రశంసలు కురిపిస్తారు. మొత్తానికి మహాలక్ష్మి అనుకున్న డ్రీం ప్రాజెక్టు అక్కడ వచ్చిన వ్యక్తికి నచ్చడంతో విక్కీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మహాలక్ష్మి వల్ల ఈ ప్రాజెక్టు కూడా విక్కీకి వచ్చింది అని తనని అప్రిషియేట్ చేసి కంగ్రాజులేషన్స్ చెప్తాడు కానీ మహాలక్ష్మి మాత్రం చాలా సీరియస్ గా బయటికి వచ్చేస్తుంది.
ఇక ప్రాజెక్టు ఇంత సక్సెస్ అవ్వడానికే కారణం చక్రీనే అని మహాలక్ష్మి ఎలాగైనా సరే చక్రీని కలిసి థాంక్స్ చెప్పాలని అనుకుంటుంది. ఇక సంతోషాన్ని పట్టలేక మహాలక్ష్మి బయటికి వచ్చి చక్రి కి ఫోన్ చేయగానే నేను ఇక్కడే మీ ఆఫీస్ దగ్గర ఉన్నాను అని చక్రీ చెప్తాడు. అయితే తన ఆనందాన్ని చక్రితో పంచుకోవడానికి వెళ్ళిన మహాలక్ష్మి మళ్ళీ మళ్ళీ థాంక్స్ చెప్తుంది. కానీ ఆ లాప్టాప్ తీసుకురావడానికి చక్రిబడిన కష్టాన్ని విని తనని హాగ్ చేసుకుని మీకు ఎన్నిసార్లు థాంక్స్ చెప్పినా సరిపోదు అంటూ అనడంతో చక్రి చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. మహాలక్ష్మి నన్ను ప్రేమిస్తుంది అని అనుకుంటాడు. చక్రి ఆ విషయం ఇంట్లో చెప్పి అందరికీ సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకుంటాడు. తనని వాటేసుకొని మరీ క్షమాపణ చెప్పింది అని చాలా సంతోషంగా ఇంట్లో వాళ్ళ అందరితో షేర్ చేసుకుంటాడు. చక్రి సంతోషానికి అవధులు లేవనే చెప్పాలి..
అయితే ప్రాజెక్టు సక్సెస్ అయినట్టు విక్కీ అనౌన్స్ చేస్తాడు. మహాలక్ష్మి వల్లే ఇదంతా జరిగింది అని అంటాడు. ఇక ఆఫీసు స్టాఫ్ ఉందని తీసుకుని వెళ్లి అందరికీ ట్రీట్ ఇవ్వాలని కి అనుకుంటాడు కానీ మహాలక్ష్మి నాకు టైం లేదు నేను వెళ్ళిపోతానని ఎంత చెప్పినా సరే అసలు వినకుండా నువ్వు లేకపోతే ఎలా అని బలవంతంగా తనని కూడా రెస్టారెంట్ కి తీసుకుని వెళ్తాడు.. అయితే రెస్టారెంట్లో విక్కీ ప్రవర్తన చూసి దివ్య మీ ఇద్దరి మధ్య ఏదో జరుగుతుంది అని ఎందుకు చెప్తున్నా సరే మహాలక్ష్మి మాత్రం నేను గాల్లోడు అలా తేలిపోను అని చాలా కోపంగా అంటుంది మహాలక్ష్మి.. విక్కీ తనపై చూపిస్తున్న కేరింగ్ కి మహాలక్ష్మి చాలా సీరియస్ అవుతూ ఉంటారు. మహాలక్ష్మి మాటకు మాట సమాధానం చెప్పు విక్కీకి షాకిస్తుంది.
ఇక విక్కీ ప్రతిసారి మహాలక్ష్మి దగ్గరికి వచ్చి తనకి ఏదో ఒకటి చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు.. అయితే మహాలక్ష్మి దగ్గర కూర్చొని నీకేం కావాలి అని ఎంతగా అడిగిన సరే నాకు ఇదొక్కటే చాలు అని మహాలక్ష్మి అంటుంది. విక్కీ తనతో ఎలాంటి పులిహోర కలపాలని చూసిన సరే.. నేను మహాలక్ష్మి దాంట్లోనే షేర్ చేసుకుని తింటాను అని ఎంత చెబుతున్నా సరే.. మహాలక్ష్మి మాత్రం నాకు వేరే వాళ్ళతో షేర్ చేసుకుని అస్సలు నచ్చదు అని అంటుంది. ఆ మాటతో విక్కి చాలా సీరియస్ అవుతాడు. ఇక చక్రికి మెసేజ్ చేసి అక్కడికి రమ్మని చెప్తుంది.. చక్రి రాగానే విక్కీ మహాలక్ష్మికి కారు డోర్ తీస్తాడు కానీ చక్రి దగ్గరికి వెళ్లి కార్ ఎక్కుతుంది మహాలక్ష్మి.. తను నా గర్ల్ నువ్వు చాలా కేర్ఫుల్ గా చూసుకోవాలి అని చక్రికి వార్నింగ్ ఇస్తాడు దాంతో చక్రి చాలా సీరియస్ అవుతాడు.
మహాలక్ష్మి ఇంటికొచ్చిన తర్వాత లోపలికి వెళ్ళిపోతుంది కాని చక్రి మాత్రం చాలా కోపంగా ఉంటాడు.. ఏంటమ్మా ఇంత లేట్ అయింది భోజనం చేసావా అని అడుగుతాడు. మాధవ్ కానీ మహాలక్ష్మి మాత్రం పార్టీ ఇచ్చారని చెప్తుంది. తనకి వాళ్ళ బాసు మంచి రెస్టారెంట్లో ఫుడ్ పెట్టించారు. మన ఇంట్లో ఉంటుంది తెల్ల అన్నం ఒకటే కూర కదా అని చక్రి చాలా కోపంగా అంటాడు. కానీ కన్నా మాత్రం మహాలక్ష్మిని హగ్ చేసుకుని ఐ లవ్ యు చెప్పింది అని చెప్పగానే మహాలక్ష్మి చాలా సీరియస్ అవుతుంది. చక్రి మహాలక్ష్మి చెప్పింది విని కోపంగా బయటికి వెళ్తాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..