BigTV English

Best Selling 7 Seater Car: భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన 7-సీటర్ కారు ఇదే.. ధర, స్పెసిఫికేషన్ల వివరాలివే!

Best Selling 7 Seater Car: భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన 7-సీటర్ కారు ఇదే.. ధర, స్పెసిఫికేషన్ల వివరాలివే!

Maruti Ertiga Best Selling 7 Seater Car in India: ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి కొత్త కొత్త కార్లను రిలీజ్ చేస్తూ వాహన ప్రియులను ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా ప్రతి నెల, ప్రతి ఏడాది అత్యధిక సంఖ్యలో కార్లను సేల్ చేస్తుంది. అయితే ఈ కంపెనీ అత్యధికంగా సేల్ చేసే వాటిలో ఎర్టిగా మోడల్ ఒకటి. ఈ మోడల్ గత నెలలో (మే 2024) 13,893 యూనిట్లు సేల్ చేయబడ్డాయి. దీని కారణంగా మార్కెట్‌లో అత్యధికంగా అమ్ముడైన 7-సీటర్ కారు కూడా ఇదే కావడం విశేషం. ఇప్పుడు ఈ మారుతి ఎర్టిగా ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్‌ల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.


ధర, వేరియంట్లు అండ్ కలర్ ఆప్షన్స్

మారుతి ఎర్టిగా ప్రారంభ ధర రూ. 8.69 లక్షలు, టాప్ వేరియంట్ రూ. 13.03 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) వద్ద అందుబాటులో ఉంది. ఇది LXi, VXi, ZXi, ZXi+ వంటి నాలుగు ట్రిమ్‌లలో లభిస్తుంది. అలాగే పెర్ల్ మిడ్‌నైట్ బ్లాక్, పెర్ల్ ఆర్కిటిక్ వైట్, డిగ్నిటీ బ్రౌన్, మెటాలిక్ మాగ్మా గ్రే, పర్ల్ మెటాలిక్ ఆబర్న్ రెడ్, వెండి, పర్ల్ మెటాలిక్ ఆక్స్‌ఫర్డ్ బ్లూ వంటి ఏడు మోనోటోన్ కలర్‌లను అందిస్తోంది.


Also Read: అదిరిపోయే ఫీచర్లతో న్యూ జెన్ మారుతి సుజుకి కార్లు.. ఫుల్ డీటెయిల్స్..!

ఇంజిన్ స్పెసిఫికేషన్లు

ఇది 5-స్పీడ్ MT లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడిన మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీతో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో అమర్చబడింది. అలాగే పెట్రోల్‌ను ఇంధనంగా ఉపయోగించి 103PS, 137Nm ఉత్పత్తి చేస్తుంది. అలాగే CNGపై 88PS, 121.5 Nmని అందిస్తుంది. అయితే CNG వేరియంట్‌లు కేవలం 5-స్పీడ్ MTతో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

ఇందులో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేతో కూడిన 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, ఆటో AC, పాడిల్ షిఫ్టర్‌లు వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అలాగే ఇది 4 ఎయిర్‌బ్యాగ్‌లు, వెనుక పార్కింగ్ సెన్సార్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), హిల్-హోల్డ్ అసిస్ట్, ISOFIX చైల్డ్ సీట్ ఎంకరేజ్‌లతో వస్తుంది.

Tags

Related News

Jio Cricket Plan: జియో స్పెషల్ ప్లాన్‌కి టైమ్ లిమిట్‌.. మిస్ అయితే మళ్లీ దొరకదు

Airtel Xstream Fiber:1జిబిపిఎస్ వేగంతో వస్తున్న ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్.. ప్రత్యేకతలు ఇవే

Matching Number Offer: జియో కొత్త ఆఫర్.. కేవలం రూ.50కి ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌కి మ్యాచింగ్ నంబర్లు!

Flipkart iPhone Offers: 2025లో ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ డీల్.. మిస్ అయితే మళ్లీ రాదు!

Nirmala Sitharaman: త్వరలో భారతీయుల చేతుల్లో రూ.2 లక్షల కోట్లు.. నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు

Samsung Galaxy: సామ్‌సంగ్ గెలాక్సీ ఎ37 5జి.. మిడ్ రేంజ్‌లో మాస్టర్ ఫోన్

Jio New Offers: జియో సెప్టెంబర్ హాట్ డీల్స్! వినియోగదారులు తప్పక తెలుసుకోవాల్సిన తాజా ఆఫర్లు

iPhone 18 Pro: ఆపిల్ 18 ప్రో వచ్చేసింది.. ఫీచర్స్ తెలుసుకుంటే కొనాలనే కోరిక పెరుగుతుంది!

Big Stories

×