BigTV English

Upcoming Maruti Suzuki Cars: అదిరిపోయే ఫీచర్లతో న్యూ జెన్ మారుతి సుజుకి కార్లు.. ఫుల్ డీటెయిల్స్!

Upcoming Maruti Suzuki Cars: అదిరిపోయే ఫీచర్లతో న్యూ జెన్ మారుతి సుజుకి కార్లు.. ఫుల్ డీటెయిల్స్!

Upcoming Maruti Suzuki Cars: మారుతి సుజుకి కార్లు వాహన ప్రియుల్లో తమదైన ముద్ర వేసుకున్నాయి. కొత్త కొత్త మోడళ్లను మార్కెట్‌లో రిలీజ్ చేస్తూ ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే ఎన్నో అద్భుతమైన కార్లను రిలీజ్ చేసిన మారుతి సుజుకి మరికొద్ది నెలల్లో కొత్త కార్లు స్విఫ్ట్ సిఎన్‌జీ, న్యూ జెన్ డిజైర్, ఈవీఎక్స్ ఎస్యూవీలను భారత మార్కెట్‌లో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పుడు వాటికి సంబంధించిన వివరాలను తెలుసుకుందాం.


Maruti Suzuki Swift CNG:

మారుతి సుజుకి స్విఫ్ట్ ఇప్పుడు సీఎన్‌జీ వెర్షన్‌లో అందుబాటులోకి రానుంది. ఈ కారును ద్వితియార్థంలో భారత మార్కెట్‌లో లాంచే చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సీఎన్‌జీ కారు కిలోకి 32కి.మీ మైలేజీ అందిస్తుందని సమాచారం. ఈ సీఎన్‌జీ ఇంజిన్‌తో వస్తున్న కారు.. పెట్రోల్ వెర్షన్ కంటే సుమారు రూ.90,000 నుంచి రూ.95,000 ఎక్కువ ఉండే అవకాశం ఉంటుదని సమాచారం.


New Gen Maruti Suzuki Dzire:

ఈ New Gen Maruti Suzuki Dzire కారు వచ్చే ఏడాది 2025 జూలైలో రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ New Gen Maruti Suzuki Dzireలో సన్‌రూఫ్ కూడా యాడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అదే జరిగితే సన్‌రూఫ్ ఫెసిలిటీ ఉన్న తొలి సెడాన్ కారుగా New Gen Maruti Suzuki Dzire నిలుస్తుంది.

Also Read: కియా మరో ముందడుగు.. పోలీస్ క్యాంటీన్లలో అమ్మకాలు!

ఇందులో 1.2లీటర్ జెడ్ సిరీస్‌కు చెందిన మూడు సిలిండర్ జెడ్12ఈ పెట్రోల్ ఇంజిన్‌ను అందించే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఈ ఇంజిన్ 111.7ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కాగా ఇందులో మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఫీచర్లను అందించే అవకాశం ఉంది. ఇక కొత్త సెట్ బంపర్లు ఈ కారకు స్పెషల్ అట్రాక్షన్‌గా ఉంటాయని అంటున్నారు.

Maruti Suzuki eVX Electric SUV:

Maruti Suzuki eVX Electric SUV కారు ఈ ఏడాది చివరినాటికి భారత మార్కెట్‌లో రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కారు టెస్టింగ్ దశలో ఉన్నట్లు సమాచారం. ఇది 2700 ఎంఎం వీల్ బేస్‌తో 4.3మీ పొడవు ఉంటుందని అంటున్నారు. కాగా ఇందులో రెండు బ్యాటరీ ప్యాక్‌లను అమర్చే అవకాశం ఉంది. అందులో ఒకటి 48 కెడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్‌పై సుమారు 400 కిమీ మైలేజీ ఇస్తుంది. మరొకటి 60 కెడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్‌పై 550 కి.మీ మైలేజీ అందిస్తుంది. మరి ఈ కార్లు ఎంత మేర సక్సెస్ అవుతాయో చూడాలి.

Related News

E20 Petrol: E20 పెట్రోల్ అంటే ఏంటి? దానివల్ల వాహనాలకు లాభమా? నష్టమా?

Income Tax Bill: ఇన్ కమ్ ట్యాక్స్ బిల్-2025 మనకు ఒరిగేదేంటి? తరిగేదేంటి?

Minimum Balance Account: బ్యాంకు మినిమమ్ బ్యాలెన్స్ కొత్త నియమాలు.. పెనాల్టీ తప్పదా?

Trump On Gold: దిగొచ్చిన పసిడి.. ‘బంగారు’ మాట చెప్పిన ట్రంప్, ఏమన్నారు?

PM-KMY Scheme: కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఈ స్కీంలో నెలకు రూ. 55 కడితే చాలు..ఉద్యోగం చేయకపోయినా పెన్షన్ గ్యారంటీ..

BSNLలో 365 రోజుల వ్యాలిడిటీ ప్లాన్స్ ఇవే…ఏకంగా 600 జీబీ డేటా పొందే ఛాన్స్…ఎంత రీచార్జ్ చేయాలంటే..?

Big Stories

×