Indore Congress Candidate Akshay Bam Withdraws Nomination: ఇండోర్ కాంగ్రెస్ అభ్యర్థి అక్షయ్ కాంతి బామ్ సోమవారం తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఆయన తన నామినేషన్‌ను ఉపసంహరించుకునేందుకు బీజేపీ ఎమ్మెల్యే రమేష్ మెండోలాతో కలిసి ఆర్వో ఆఫీసుకు చేరుకున్నారు. ఇండోర్-మాల్వా ప్రాంతంలో ఓటింగ్‌కు కేవలం పక్షం రోజుల వ్యవధిలో లోక్‌సభ ఎన్నికలు ఉండటంతో కాంగ్రెస్ నేత నామినేషన్ విత్ డ్రా చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కాగా ఈ విషయంపై ఇండోర్ బీజేపీ అభ్యర్థి కైలాష్ విజయవర్గీయ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇండోర్ కాంగ్రెస్ అభ్యర్థికి బీజేపీ స్వాగతం పలుకుతోందని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
इंदौर से कांग्रेस के लोकसभा प्रत्याशी श्री अक्षय कांति बम जी का माननीय प्रधानमंत्री श्री @narendramodi जी, राष्ट्रीय अध्यक्ष श्री @JPNadda जी, मुख्यमंत्री @DrMohanYadav51 जी व प्रदेश अध्यक्ष श्री @vdsharmabjp जी के नेतृत्व में भाजपा में स्वागत है। pic.twitter.com/1isbdLXphb
— Kailash Vijayvargiya (@KailashOnline) April 29, 2024
కాగా ఇండోర్ మాల్వా ప్రాంతంలో నాలుగో దశలో ఎన్నికలు జరగనున్నాయి. మే 13న పోలింగ్ జరగనుండగా.. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఈ రోజే కావడం విశేషం.
ఇదివరకే సూరత్ కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ పత్రాల్లో సంతకాలు మ్యాచ్ కాలేదని ఆర్వో నామినేషన్ తిరస్కరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇండోర్ కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ విత్ డ్రా చేసుకోవడంతో ఎన్నికలు జరగకముందే బీజేపీ ఖాతాలో రెండు సీట్లు చేరినట్లే.