BigTV English

Modi First Cabinet Meeting: మోదీ కేబినెట్ భేటీ.. శాఖల కేటాయింపు.. కీలక సూచనలు!

Modi First Cabinet Meeting: మోదీ కేబినెట్ భేటీ.. శాఖల కేటాయింపు.. కీలక సూచనలు!

Modi First Cabinet Meeting with Ministers: ముచ్చటగా మూడోసారి కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువు దీరింది. దాదాపు 71 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధానితో కలిపి 30 మంది కేబినెట్ మంత్రులు, స్వతంత్ర హోదా కలిగిన మంత్రులు ఐదుగురు కాగా, మిగతా 36 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు.


సోమవారం సాయంత్రం ప్రధాని నరేంద్రమోదీ కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశానికి మంత్రులంతా హాజరుకానున్నారు. ఈ క్రమంలో మంత్రులకు ఆయన మార్గ నిర్ధేశం చేయనున్నారు. గతంలో చెప్పిన విషయాలనే ఈసారి చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. మీడియాకు ఎట్టి పరిస్థితుల్లోనూ మసాలా ఇవ్వకూడ దనేది అసలు పాయింట్.

అలాగే కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు లీక్ కాకూడదన్నది రెండో పాయింట్. కేబినెట్‌ మంత్రులకు అప్పగించే పనులకు సంబంధించి విపక్షాలు లేవనెత్తిన అంశాలకు సభలో సమాధానం చెప్పాల్సింది కూడా ఆయా శాఖల మంత్రులేనన్నది మూడో పాయింట్. ఇలా డజను అంశాలను మంత్రులకు ప్రధాని మోదీ వివరించే ఛాన్స్ ఉంది.


Also Read: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్ర దాడి.. 10కి చేరిన మృతుల సంఖ్య.. ఖండించిన ప్రధాని

ఆ తర్వాత శాఖల కేటాయింపు జరగనున్నట్లు ఢిల్లీ సమాచారం. దీని తర్వాత మంచి రోజు చూసుకుని మంత్రులు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ తతంగమంతా నాలుగైదు రోజుల్లో పూర్తి చేయాలన్నది ప్రధాని ఆలోచనగా చెబుతున్నారు. బడ్జెట్‌కు సమయం దగ్గరపడుతుండడమే దీనికి కారణంగా చెబుతున్నారు.

Tags

Related News

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

Big Stories

×