Passenger Alert: ప్రయాణికులకు అలర్ట్.. గోరఖ్ పూర్ జంక్షన్ గుండా వెళ్లే రైళ్లు తాత్కాలికంగా రద్దు చేయబడ్డాయి. రాబోయే మూడు రోజులు ఈ మార్పులు అమల్లో ఉండనున్నాయి. ప్రయాణికులు తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకునే ముందు ఈ మార్పులను గమనించాలని అధికారులు తెలిపారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ఎందుకు రద్దు అయ్యాయంటే..
సాధారణంగా ట్రాక్ మెయింటెన్స్, సాంకేతిక సమస్యల కారణంగా రైల్లు రద్దు చేస్తుంటారు. అలాగా గోరఖ్ పూర్ జంక్షన్ పరిసర ప్రాంతాల్లో ట్రాక్ రిపేర్ జరుగుతుండడంతో.. ప్రయాణికుల భద్రతా దృష్ట్యా.. రైళ్లను తాత్కాలికంగా రద్దు చేయబడ్డాయి. ఇదే పరిస్థితి రాబోయే మూడు రోజులు ఉంటుందని అధికారులు వెల్లడించారు.
ఏ రైళ్లు ప్రభావితమయ్యాయి అంటే..
రాబోయే మూడు రోజుల పాటు గోరఖ్‌పూర్ జంక్షన్ వద్ద రద్దు చేయబడిన రైళ్ల జాబితా ఇదే..
రైలు నం. 15009/15010 గోరఖ్‌పూర్ – బాద్షానగర్ ప్యాసింజర్
రైలు నం. 15015/15016 గోరఖ్‌పూర్ – బాలరాంపూర్ ప్యాసింజర్
రైలు నం. 15017/15018 గోరఖ్‌పూర్ – బస్తీ ప్యాసింజర్
రైలు నం. 15019/15020 గోరఖ్‌పూర్ – దియోరియా ప్యాసింజర్
రైలు నం. 75005/75006 గోరఖ్‌పూర్ – గోండా ప్యాసింజర్
గమనిక: ఇది పూర్తి సమాచారం కాదు కాబట్టి.. మీ ప్రయాణ రైలు ప్రభావితమైందా లేదా అని తెలుసుకోవాలంటే.. అధికారిక IRCTC వెబ్‌సైట్ కానీ మొబైల్ యాప్‌ను తప్పనిసరిగా చెక్ చేయాలి.
ప్రయాణికులు ఏమి చేయాలి..
ప్రయాణించేటప్పుడు రైళ్ల సమాచారం కోసం.. IRCTC వెబ్ సైట్ ద్వారా సమాచారం స్వీకరించవచ్చు.
ఒకవేళ మీ ప్రయాణించే రైళ్లు రద్దయితే.. ఇతర బస్సులు లేదా వేరే రైళ్ల ద్వారా ప్రయాణం సిద్ధం చేసుకోండి.
రద్దయిన రైళ్ల టికెట్లకు.. ప్రయాణికులు ఎలాంటి జరిమాన లేకుండా పూర్తి రీఫండ్ పొందవచ్చు.
రైల్వే పంపే మెసేజ్ లు, సోషల్ మీడియా అప్డేట్, అధికారిక ప్రకటనలు గమనించండి.
ప్రయాణికులకు సూచనలు..
ప్రయాణించేటప్పుడు ముందుగానే స్టేషన్ కు చేరుకోవడం మంచిది.
దగ్గర్లోని బస్సు కానీ టాక్సీ సర్వీసుల వివరలా ముందుగానే తెలుసుకోవడం మంచిది.
అత్సవసర సమయంలో ఉపయోగపడే వస్తువలను వెంటతీసుకెళ్లడం మంచిది.
ప్రయాణ సమయంలో మీ ఫోన్ లో ఛార్జింగ్, ఇంటర్నెట్ ఉందా లేదా అని చూసుకోవాలి.