Pawan Kalyan Mother Health: మోగాస్టార్ చిరంజీవి మాతృమూర్తి అంజనా దేవి ఆరోగ్యంపై కొంతకాలంగా రకరకాలు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నట్టు ఓ వార్త బయటకు వచ్చింది. రెండు నెలలుగా అంచనా దేవి ఆరోగ్యంపై తరచూ ఏదోక వార్త బయటకు వస్తుంది. అయితే ఇప్పటి వరకు దీనిపై మెగా ఫ్యామిలీ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. అలాంటిది ఏం లేదని, తన తల్లి ఆరోగ్యం బాగానే ఉందని ఆ మధ్య చిరు ఓ ప్రకటన ఇచ్చారు.
అయితే ఇప్పుడు తన తల్లి ఆరోగ్యంపై ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పందించారు. జనసేన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తన తల్లి అంజనా దేవి ఆరోగ్యంపై ప్రస్థావించారు. కొన్ని రోజులుగా తన తల్లి ఆరోగ్యం బాగానే లేదని, నడవలేని స్థితిలో ఉన్నారని పవన్ చెప్పుకొచ్చారు. తాజాగా పవన్ కళ్యాణ్ తన పార్టీలో మహిళల ప్రాధాన్యతపై మాట్లాడారు. జనసేనా మహిళ విభాగం ఏర్పాటుపై పవన్ స్పందించారు. తమ పార్టీ పెట్టినప్పుడ మహిళ విభాగానికి జాన్సీ వీరమహిళ అని పేరు పెట్టాలని నిర్ణయించనన్నారు. ఈ దేశం అభివ్రద్దిలో మహిళలది కూడా కీలక పాత్ర అన్నారు.
సమాజంలో బలమైన మార్పు రావాలంటే మహిళలే అన్నారు. ఈ సందర్భంగా ఉమెన్ ఎంపవర్మెంట్ పై మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో పవన్ తన తల్లిని గుర్తు చేసుకున్నారు. “ప్రస్తుతం మా అమ్మ ఆరోగ్యం బాగాలేదు. కొన్ని నెలలుగా ఆమె బెడ్ రెస్ట్‌లోనే ఉంటున్నారు” అని చెప్పారు పవన్. అలాగే మా నాన్న పోలీసు డిపార్మెంట్కి చెందిన వ్యక్తి అవ్వడంతో తరచూ ఆయన ట్రాన్సఫర్లు, వర్క్తో బిజీగా ఉండేవారు. తరచూ మేం కొత్త ప్లేస్కి వెళ్లడం వల్ల స్కూల్స్ మారుతుండేవాళ్లం. అలా ప్రతిచోట నేను కొత్తవాడిగా ఉండేవాడిని. దీంతో అందరు ఏడిపిస్తుంటే.. భయపడి స్కూల్ని వెళ్లమని మారాం చేసేవాళ్లం. అప్పుడు మా అమ్మ ఎందుకు నువ్వు బయపడి పారిపోతున్నావు.
Also Read: Mithra Mandali: ఆరు రోజుల్లో రిలీజ్.. ఇంకా షూటింగ్ జరగడమేంటి భయ్యా..!
నిన్ను ఎవరైనా పది దెబ్బలు కొడుతున్నారంటే.. తిరిగి నువ్వు ఒక్కసారైనా కొట్టాలి. అప్పుడే ఈ సమాజంలో బతకగలం‘ అని బోధించేది. అప్పడు ఆమె మాటలు నాకేంతో బలాన్ని ఇచ్చాయి. మా చిన్నప్పుడు అంత ఆమె వంటగదిలోనే ఉండేవారు. కానీ, ఆమె వంటగది నుంచే ప్రపంచాన్ని చూశారు, తెలుసుకున్నారు అంటూ పవన్ తన తల్లి అంజనా దేవి గురించి చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో పవన్ తన తల్లి ఆరోగ్యంపై చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. కొంతకాలంగా అంజనా దేవి ఆరోగ్యంపై వస్తున్న వార్తలు ఇప్పుడు స్పష్టత వచ్చిందంటున్నారు మెగా ఫ్యాన్స్. అంజనా దేవి త్వరగా కోలుకోవాలని మెగా ఫ్యాన్స్ ఆకాంక్షిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.