Trivikram : క్రేజి కాంబినేషన్ తో భారీ అంచనాల మధ్య వచ్చిన ఒక సినిమా డిజాస్టర్ అయింది. గురూజీ గురూజీ అనుకుంటే గునపం దించాడు అని అందరూ ఫీలయ్యారు. మాములుగా త్రివిక్రమ్ పై చాలామందికి ఒక నెగిటివ్ ఫీలింగ్. ఆ సినిమా డిజాస్టర్ తో వాళ్లకు ఇంకో అవకాశం ఇచ్చాడు త్రివిక్రమ్. చాలామంది ఆ ప్లాప్ ను ఎంజాయ్ చేశారు సోషల్ మీడియా లో, అప్పుడు అర్థమైంది త్రివిక్రమ్ మీద ఎంత నెగిటివ్ ఫీలింగ్ చాలామందికి ఉంది అని.
అప్పుడెప్పుడో వచ్చిన ఆత్మకథ (aatmkatha) సినిమా తర్వాత నిర్మాత రాధాకృష్ణ (Surya devara Radhakrishna) మళ్ళీ ఒక ప్లాప్ సినిమా భరించారు. అదే అజ్ఞాతవాసి.! (Agnyaathavaasi) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో రెండోసారి దర్శకుడిగా పనిచేసిన ప్రతి దర్శకుడు ఫెయిల్ అయినా … త్రివిక్రమ్ మాత్రం అత్తారింటికి దారేది తో ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి 100 కోట్ల మార్కెట్ కు దారితీసాడు. ఆ కాంబినేషన్ హ్యాట్రిక్ కొడుతుంది అనుకున్న టైం అది. అనిరుధ్, మణికంధన్ లాంటి టెక్నీషియన్స్ తోడయ్యేసరికి అంచనాలు మరింత పెరిగిపోయాయి.
కట్ చేస్తే సంక్రాంతి రిలీజ్, సినిమా భారీ డిజాస్టర్ టాక్. పవన్ కళ్యాణ్ హిట్,ప్లాప్ కి అతీతం కాబట్టి, పెద్దగా ఆలోచించలేదు. అప్పటికే పవన్ కళ్యాణ్ రాజీకీయాల్లో కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇప్పుడున్న ప్రాబ్లెమ్ అంతా త్రివిక్రమ్ కే, ఎన్టీఆర్ తో నెక్స్ట్ ప్రాజెక్ట్ చెయ్యాలి. అప్పటికీ ఎన్టీఆర్ ఒక పక్క వరుస హిట్ లతో ముందుకు వెళ్తున్నారు. టెంపర్ ముందువరకు ఎన్టీఆర్ హిట్ వెనుక పరిగెట్టారు.
కిక్-ఊసరవెల్లి
సింహ- దమ్ము
దూకుడు- బాద్ షా
గబ్బర్ సింగ్ – రామయ్య వస్తావయ్యా
కందిరీగ – రభస
ఈ సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు.
ఇక టెంపర్ తరువాత అందరికీ తెలిసిందే. త్రివిక్రమ్ ఈ డిజాస్టర్ నుంచి బయటకు వచ్చి ఎన్టీఆర్ తో ముందుకు సాగాలి, ముందుగానే అనిరుధ్ మ్యూజిక్ అనుకున్న తరువాత అది మారిపోయింది. అరవింద సమేత అని టైటిల్ అనగానే ఏంట్రా ఇది చాలామంది అనుకున్నారు. ఇక ఫస్ట్ లుక్ రిలీజ్ చూస్తే బోయపాటి పోస్టర్ మీద త్రివిక్రమ్ పేరు వేశారు అనేట్లు ఉంది.
సాంగ్స్ రిలీజ్ అయితే థమన్ మీద ట్రోల్స్. అనుకోకుండా ఎన్టీఆర్ ఇంట్లో భరించలేని విషాదం. వీటన్నింటినీ మధ్యలో, సంక్రాంతికి పోగొట్టుకున్న విజయాన్ని మళ్ళీ విజయదశమి వెతుక్కుంటే ఆ సినిమా గురించి మాట్లాడకుండా ఉండగలమా.?
గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ మొదటి 20 నిమిషాలు అరాచకానికి అర్ధం చూపించాడ. థియేటర్ బయట మాట్లాడిన ప్రతీ ఒక్కరి మాటలోను సినిమా సక్సస్ వినిపించింది. ఇది కదా గురూజీ స్టామినా అని త్రివిక్రమ్ అభిమానులు అందరూ అనుకున్నారు.
చాలామంది దర్శకులుకు ఒక ప్లాప్ పడగానే పనైపోయింది అనుకుంటారు. వాళ్లు ఇంకొక ప్రాజెక్ట్ చేయటానికి టైం తీసుకుంటారు. కానీ త్రివిక్రమ్ అలా చేయలేదు సంక్రాంతికి అజ్ఞాతవాసి పోతే సరిగ్గా విజయదశమికి అరవింద సమేత తో విజయం అందుకున్నాడు. ఈ జనరేషన్ కి ఇదే స్ట్రాంగ్ కం బ్యాక్ అని చెప్పాలి. ఇది మామూలు సినిమా కాదు. ఒక దర్శకుడు గా త్రివిక్రమ్ ఓటమిను, ఒక హీరో విషాదాన్ని దాటొచ్చి సక్సెస్ సాధించిన సినిమా. ఈ సినిమా తర్వాత తమన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తిరుగులేని సంగీత దర్శకుడుగా మారాడు. ఈ సినిమా నేటితో ఏడేళ్లు పూర్తి చేసుకుంది.
Also Read: Megastar Chiranjeevi : మాటలు మాత్రమే చెప్పారు, ప్రాజెక్టులు పక్కన పడేసారు