Vijay Devarakonda Rowdy Janardhan: హీరో విజయ్ దేవరకొండ కొత్త సినిమా రౌడీ జనార్థన్ నేడు పూజ కార్యక్రమాన్ని జరుపుకుంది. నేడు(అక్టోబర్ 11) దిల్ రాజు ఆఫీసులులో ఉదయం 6 గంటలకు మూవీ పూజా కార్యక్రమంతో గ్రాండ్గా లాంచ్ అయ్యింది. రాజావారు రాణివారు ఫేం రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్ రాజు నిర్మిస్తున్నారు. శనివారం జరిగిన ఈ మూవీ పూజ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ముఖ్యఅతిగా హాజరై ముహుర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అయితే ఈ సినిమా విజయ్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ పూజ కార్యక్రమంలో ఆమె కూడా పాల్గొంది. విజయ్-కీర్తి కాంబోలో వస్తున్న తొలి చిత్రమింది. ఫస్ట్ టైం వీరిద్దరు రౌడీ జనార్థన్ జతకట్టడం ఆసక్తిని సంతరించుకుంది. ఇక ఈ సినిమాకు మలయాల మ్యూజిక్ డైరెక్టర్ క్రిస్టో జేవియర్ (Christo Xavier) సంగీతం అందించబోతున్నాడు. ఇప్పటి వరకు కేవలం మలయాళ చిత్రాలకు పని చేసిన అతడు తొలిసారి రౌడీ జనార్థన్తో తెలుగులో ఎంట్రీ ఇస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం మలయాళ సంగీత దర్శకుడిని తీసుకోవడం ప్రస్తుతం ఆసక్తిని సంతరించుకుంది.
దీంతో క్రిస్టో జేవియర్ ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యారు. కాగా కింగ్డమ్ మూవీ తర్వాత విజయ్ నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలను ఉన్నాయి. నిజానికి అనౌన్స్మెంట్తోనే రౌడీ జనార్థన్పై హైప్ క్రియేట్ అయ్యింది. దీనికి కారణం దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాత ఈ సినిమాను నిర్మిస్తుండటం. అయితే ప్రస్తుతం దిల్ రాజు గ్రాఫ్ చాలా పడిపోయిందనే విషయం తెలిసిందే. సినిమాల విషయంలో ఆయన అంచన తప్పదు. కానీ, ఈ మధ్య అన్ని మిస్ ఫైర్ అవుతున్నాయి. ఆయన బ్యానర్లో ఈ మధ్య హిట్స్ కంటే ప్లాప్స్ చిత్రాలే ఎక్కువ ఉన్నాయి. మరోవైపు కింగ్డమ్ ఫలితంతో విజయ్ ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు.
Also Read: Allu Arjun – Atlee : అదో కొత్త ప్రపంచం… AA22 మూవీ స్టోరీపై క్లూ ఇచ్చిన డైరెక్టర్ అట్లీ
ఈ క్రమంలో దిల్ రాజు బ్యానర్ విజయ్‌కి మంచి హిట్ ఇస్తుందా? లేదా? అని ఫ్యాన్స్ని తొలుస్తున్న ప్రశ్న. ఈ క్రమంలో ఈ సినిమా విషయంలో ఫ్యాన్స్ హోప్స్ ఇస్తున్న పాయింట్ ఏదైనా ఉందంటే అది హీరోయిన్ కీర్తి సురేష్. మహానటితో నేషనల్ అవార్డు అందుకున్న ఈ భామకు తెలుగులో మంచి క్రేజ్ ఉంది. నేను శైలజా, దసరా, సర్కారు వారి పాట, దసరా చిత్రాలంతో మంచి హిట్స్ అందుకుంది. చివరిగా తెలుగులో భోళా శంకర్ చిత్రంలో కనిపించింది. ఆ తర్వాత కీర్తి మరో తెలుగు సినిమాలో కనిపించలేదు. లాంగ్ గ్యాప్ తర్వాత ఆమె నటిస్తున్న చిత్రమిది. పైగా పెళ్లి తర్వాత కీర్తి ప్రకటించిన తొలి చిత్రం కూడా ఇదే కావడం విశేషం.