BigTV English

Byju Raveendran: ఈ నెల ఓకే, మరి నెక్ట్స్ మంత్ మాటేంటి?

Byju Raveendran: ఈ నెల ఓకే, మరి నెక్ట్స్ మంత్ మాటేంటి?

Byju Raveendran: బల్లు ఓడలు.. ఓడలు బల్లు అవ్వడమంటే ఇదేనేమో. తక్కువ సమయంలో బాగా పాపులర్ అయ్యింది ఎడ్ టెక్ కంపెనీ బైజూస్. ఇదంతా ఒకప్పుడు మాట. కాలం మారుతోంది.. పరిస్థితులు మారాయి. కంపెనీ ఫౌండర్ ఆశలు గల్లంతయ్యాయి. చివరకు ఆ కంపెనీలో పని చేసిన ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. చివరకు పర్సనల్ లోన్ తీసుకుని శాలరీ ఇచ్చినట్టు తెలుస్తోంది.


బైజూస్‌లో ప్రస్తుతం 13000 వేల మంది ఉద్యోగులు ఉన్నట్లు ఓ అంచనా. వీరి కోసం దాదాపు 30 కోట్ల రూపాయలను తీసుకున్నట్లు తెలుస్తోంది. సీనియర్లకు జీతంలో 50 నుంచి 100 శాతం వేశారని ఎంప్లాయిస్ చెబుతున్నమాట. ముఖ్యమైన సిటీల్లో బైజూన్ ఏర్పాటు చేసిన టీచింగ్ సెంటర్లలోని టీచర్లకు, కింది స్థాయి ఉద్యోగులకు 100శాతం జీతం ఇచ్చినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా సీనియర్, టీచింగ్ సెంటర్ల మేనేజన్లకు సగం జీతం ఇచ్చినట్టు సమాచారం. రైట్స్ ఇష్యూ ద్వారా సేకరించిన మనీ బ్లాక్ కావడంతో ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు పర్సనల్‌‌గా ఫండ్స్ సేకరిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.

బైజూస్ కంపెనీలోని నలుగురు షేర్ హోల్డర్స్ రవీంద్రన్‌కు, ఆయన ఫ్యామిలీకి వ్యతిరేకంగా కేసు వేశారు. రైట్స్ ఇష్యూ ఫండ్స్‌‌ను కంపెనీ వినియోగించుకోకుండా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. ఈ కేసు వ్యవహారం ఇవాళ మళ్లీ విచారణ జరుగుతోంది. మంగళవారం తీర్పు బైజూస్ రవీంద్రన్‌కు అనుకూలంగా వస్తుందా? లేకపోతే పరిస్థితి ఏంటన్నది ముందున్న ప్రశ్న. రవీంద్రన్‌కు అనుకూలంగా తీర్పు వస్తుందని అంటున్నారు. రాకపోతే నెక్ట్స్ మంత్ శాలరీల పరిస్థితి ఏంటన్నది తెలియాల్సిఉంది.


ప్రస్తుతం బైజూస్ కంపెనీ నిధుల కొరతను ఎదుర్కొంటోంది. ఖర్చులను తగ్గించుకునేందుకు దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన లెర్నింగ్ సెంటర్లను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా బెంగుళూరులోని నాలెడ్జ్ పార్కులోని ఉన్న ప్రధాన ఆఫీసు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో లెర్నింగ్ సెంటర్లలో పని చేస్తున్న ఉద్యోగులు మినహా.. మిగిలినవారు వర్క్ ఫ్రమ్ హోం చేయాలని నిర్ణయించింది. ఆయా ప్రాంతాల్లో బైజూస్ ఆఫీసుల లీజు గడువు మిగియగానే వాటిని కూడా క్లోజ్ చేయాలని ఆలోచన చేస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే కంపెనీ ప్రతినిధులు మాత్రం పునర్ వ్యవస్థీకరణలో భాగంగానే ఇదంతా జరుగుతున్నట్లు చెబుతోంది.

ALSO READ: గుడ్ న్యూస్.. ఇకపై వారికి కూడా హెల్త్ ఇన్సూరెన్స్..

కరోనా సమయంలో సూళ్లు మూతబడడంతో ఆన్‌లైన్ క్లాసులకు మాంచి డిమాండ్ పెరిగింది. బైజూస్ వేగంగా విస్తరించడం, బిజినెస్ పుంజుకోవడం మొదలైంది. తర్వాత నాలుగైదు కంపెనీల్లో పెట్టుబడులను పెట్టడం, వాటిని టేకోవర్ చేయడంతో జరిగింది. చాలామంది విదేశీ ఇన్వెస్టర్లు బైజూస్‌లో పెట్టుబడులు పెట్టారు. సూళ్లు ఓపెన్ అయిన తర్వాత కంపెనీకి క్రమంగా నష్టాలు రావడం మొదలయ్యాయి. తర్వాత మనీలాండరింగ్ ఆరోపణలు రావడంతో డైరెక్టర్లు తప్పుకున్నారు.

Tags

Related News

Gold Mines: భారతదేశంలో 80 శాతం బంగారం అక్కడి నుంచే.. ఎక్కడో తెలుసా?

Rainwater business: ఇక్కడ వర్షం నీటిని అమ్మి… కోట్లు గడిస్తున్నారు… ఐడియా అదిరింది కదూ!

E20 Petrol: E20 పెట్రోల్ అంటే ఏంటి? దానివల్ల వాహనాలకు లాభమా? నష్టమా?

Income Tax Bill: ఇన్ కమ్ ట్యాక్స్ బిల్-2025 మనకు ఒరిగేదేంటి? తరిగేదేంటి?

Minimum Balance Account: బ్యాంకు మినిమమ్ బ్యాలెన్స్ కొత్త నియమాలు.. పెనాల్టీ తప్పదా?

Trump On Gold: దిగొచ్చిన పసిడి.. ‘బంగారు’ మాట చెప్పిన ట్రంప్, ఏమన్నారు?

Big Stories

×