Aparna Das Wedding Photos Viral: సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. సెలబ్రిటీలు సైతం ఒక్కొకరుగా పెళ్లి పీటలు ఎక్కేస్తున్నారు. నిన్నటికి నిన్న మసూద హీరో తిరువర్ సీక్రెట్ గా పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు మలయాళ బ్యూటీ అపర్ణ దాస్ కూడా పెళ్లి పీటలు ఎక్కనుంది. అపర్ణ దాస్.. తెలుగువారికి కూడా సుపరిచితమే. విజయ్ నటించిన బీస్ట్ చిత్రంలో నటించి మెప్పించిన ఈ భామ దాదా సినిమాతో మంచి గుర్తింపును అందుకుంది.
ఇక తెలుగులో ఆదికేశవ సినిమాతో అడుగుపెట్టింది. వైష్ణవ్ తేజ్ కు అక్కగా నటించి అదరగొట్టింది. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందివ్వలేనప్పటికీ అపర్ణకు మాత్రం మంచి మార్కులే వేశారు ప్రేక్షకులు. ఇక గత కొంతకాలంగా అపర్ణ.. తన సహానటుడు దీపక్ పరంబోల్ తో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్న విషయం తెల్సిందే. ఇక ఎట్టకేలకు ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనున్నారు. తాజాగా అపర్ణ హల్దీ వేడుక ఎంతో గ్రాండ్ గా జరిగింది. ఈ ఫోటోలను ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. వీరి వివాహం ఏప్రిల్ 24 న జరగనుంది.
Also Read: #PawanKalyanWinningPithapuram: ‘ఎక్స్’ ను షేక్ చేస్తున్న పవన్ కళ్యాణ్.. ఇదెక్కడి మాస్ రా మావా..!
దీపక్, అపర్ణ కలిసి మనోకరం అనే సినిమాలో నటించారు. ఆ పరిచయమే ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి పీటలు వరకు వచ్చింది. ఈ జంటకు అభిమానులు, నెటిజన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం అపర్ణ చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. మరి తెలుగులో కూడా ఈ చిన్నదానికి మంచి ఆఫర్స్ వస్తాయేమో చూడాలి.