Big Stories

PM Modi: వై దిస్ విద్వేషం.. ప్రధాని నరేంద్రమోడీ వివాదస్పద వ్యాఖ్యలు..

- Advertisement -

అయితే ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. అది ఇప్పుడు కాదు. 2006లో ఇచ్చిన స్పీచ్ అది. అప్పుడు ప్రధానిగా ఉన్న మన్మోహన్‌ ముస్లింలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని బహిరంగంగా ప్రకటించారు. కావాలంటే ఈ వీడియో చూడండి అంటూ ఓ వీడియోను కూడా రిలీజ్ చేసింది బీజేపీ. మరి ఈ వీడియో ఓరిజినలా? ఫేకా? కాస్త డీప్‌ సెర్చ్‌ చేస్తే ఇది ఒరిజినల్ వీడియో అని తేలింది. అలాగని ఇది నగ్నసత్యమా? అంటే కాదు. అర్ధసత్యం మాత్రమే. అంటే మన్మోహన్‌ ముస్లింలకు ప్రాధాన్యత ఇస్తామన్నది ముమ్మాటికీ నిజమే. కానీ దానికి ముందు ఆయన ఇంకా చాలా విషయాలు మాట్లాడారు. అదేంటో మీరు కూడా వినేయండి.

- Advertisement -

Also Read: బీజేపీ రెబల్ అభ్యర్థి షాకింగ్ కామెంట్స్..

మన్మోహన్‌ మాట్లాడిన దాంట్లో ఆఖరి డైలాగ్‌ను పట్టుకొని దాని ఆధారంగా మోడీ తన స్పీచ్‌లో అస్త్రంగా మార్చుకున్నారు. కాంగ్రెస్ వస్తే మళ్లీ ముస్లింలకు ప్రాధాన్యత ఇస్తుందని చెప్పేశారు. ఇంతకీ ఆయన చెప్పిందేంటి.. అందరితో పాటు ముస్లింలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. మొదటి హక్కు మైనారిటీలకు ఇస్తామన్నారు. అంటే ఎస్సీ, ఎస్టీలతో పాటు ఇతర మైనారిటీలకు అభివృద్ధి ఫలాలు అందిస్తామన్నారు. కానీ దానిని మొత్తం తీసేసి.. కేవలం ముస్లింల గురించి మాత్రమే మాట్లాడిన మాటలను హైలేట్ చేసి వీడియోను వదిలింది బీజేపీ.

సో ప్రధాని మోడీ చేసిన ఆరోపణల్లో పూర్తిగా నిజం లేదు. మరి మోడీ మన్మోహన్‌ వ్యాఖ్యలను పూర్తిగా విన్నారా? లేదా? అనేది తేలాల్సిన అంశం. ప్రధాని హోదాలో ఉండి విషయాన్ని పూర్తిగా తెలుసుకోకుండా ఇలాంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం తప్పు. ఇప్పటికే మోడీ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెరుగుతున్నాయి. ఇక చొరబాటుదారులు, మంగసూత్రాలు లాక్కుంటారు అనే పదాలను తన స్పీచ్‌లో వాడటం ఏంటన్నది కూడా హాట్‌ టాపిక్. అసలు 18 ఏళ్ల నాటి వీడియోను ఇప్పుడు బయటికి తీసుకురావడం ఎందుకు? ప్రస్తుతం దేశవ్యాప్తంగా మోడల్ కోడ్ ఆఫ్ కాండాక్ట్ అమల్లో ఉంది. ఇలాంటి సమయంలో మతం పేరిట రాజకీయాలు చేయడం నేరం కిందకే వస్తుంది. అంతేకాదు.. ప్రధాని మోడీ చేసింది విద్వేషపూరిత ప్రసంగమని హిందీ వచ్చిన చిన్న పిల్లాడిని అడిగినా తెలుస్తుంది. మరి ఇంత జరుగుతుంటే ఎన్నికల కమిషన్‌ ఏం చేస్తుంది? అనేది ఇక్కడ బిగ్ క్వశ్చన్.

అయితే ప్రధాని మోడీ అమాయకుడు, తెలియక చేశారని అని అస్సలు చెప్పలేం. ఎందుకంటే ప్రధాని కాకముందే.. ప్యూర్ పొలిటికల్ లీడర్. ఆయన విద్వేషపూరిత ప్రసంగం చేయడం కూడా ఇది ఫస్ట్ టైమ్ కాదు. ఆయన గుజరాత్ సీఎంగా ఉన్న 12 ఏళ్ల కాలంలో అనేక సార్లు ముస్లింలను టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ పరంపర కొనసాగింది. 2017లో యూపీ ఎన్నికల ప్రచారంలో శ్మశాన్‌ వర్సెస్ ఖబరిస్థాన్ అంటూ స్లొగన్ ఎత్తుకున్నారు. ఇంకా అప్పుడు జరిగిన ఎన్నికల్లో పాకిస్థాన్ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకను ఫిక్స్ చేస్తుందన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ అధ్యక్షతన ఓ మీటింగ్‌ జరిగిందని.. ఇది కుట్రే అంటూ ఆరోపించారు..ఆ తర్వాత ఇదంతా తప్పుడు సమాచారం వల్ల జరిగిందని PMO సంజాయిషీ ఇచ్చుకుంది.

గతంలో అయినా.. ఇప్పుడయినా. ఇవి ప్రజలను మిస్‌లీడ్ చేసే వ్యాఖ్యలు తప్ప మరేం కాదు. ఎందుకంటే దీనిపై చర్చ జరుగుతుంది. సమర్థించే వారు సమర్థిస్తారు. విమర్శించే వారు విమర్శిస్తారు. సో టోటల్‌గా ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. సోసైటీ రెండుగా విడిపోతుంది. నచ్చిన వాళ్లు ఓట్లు వేస్తారు. నచ్చని వాళ్లు అపోజిషన్‌కు సపోర్ట్ చేస్తారు. తీరా జరగాల్సిందంతా జరిగిపోయాక ఆఖరికి తప్పుడు సమాచారం వల్ల ఇదంతా జరిగిందని సంజాయిషీ ఇస్తారు. ఇదే రాజకీయం.. ఈ రాజకీయాల వల్లే ఓట్లు రాలతాయన్న ఆశ వారిది. లేకపోతే మోడీ లాంటి నేత రోజుల వ్యవధిలో మాట ఎలా మారుస్తారు చెప్పండి. నమ్మకపోతే మరో ఎగ్జాంపుల్ చూడండి.

Also Read: కేజ్రీవాల్‌కు మరో బిగ్ షాక్.. హెల్త్ పిటిషన్‌ను కొట్టివేసిన రౌస్ అవెన్యూ కోర్టు

చూశారుగా ఈ నెల 19న జరిగిన ఎన్నికల ప్రచారంలో మహ్మద్‌ షమీ ఇష్యూను తెరపైకి తీసుకొచ్చారు. పొగిడారు. మళ్లీ 21వ తేదీ వచ్చేసరికి మళ్లీ ముస్లింలపై విద్వేషపూరిత వ్యాఖ్యలు అంటే మధ్యలో ఒక్కరోజులో ఏం జరిగింది? ఏం మారింది? ఈ క్వశ్చన్‌కి ఆన్సర్ మారింది.. ఈ లోపు ఫస్ట్‌ ఫేజ్‌ ఓటింగ్ ముగిసింది..అందుకే ఆయన స్వరం కూడా మారినట్టు కనిపిస్తుంది. ఓ రాష్ట్రంలో ముస్లింలను మచ్చిక చేసుకునే ప్రయత్నం. మరో రాష్ట్రంలో ముస్లింలపై విద్వేషం. ఎందుకిదంతా.. ఓట్ల కోసమే కదా. నాలుగు రోజుల్లో ముగిసే ఎన్నికల కోసం ఎందుకీ రాజకీయాలు చేస్తున్నారు. ఎందుకు సమాజాన్ని విడగొడుతున్నారు..? అనేది ఇక్కడ క్వశ్చన్.

నేషనల్ వైడ్‌గా మోడీ ప్రభంజనం సృష్టిస్తుంటే.. ఇక భాగ్యనగరంలో ఆ బాధ్యతను భుజానికెత్తుకున్నారు హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత. తనదైన స్టైల్‌లో తనదైన విమర్శలతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. అన్ని వర్గాలు సమానం అనుకుంటూనే కొన్నిసార్లు ఆమె చేసే చేష్టలు, వ్యాఖ్యలు చిక్కుల్లో పడేస్తున్నాయి. ఫర్‌ ఎగ్జాంపుల్ ఈ వీడియో చూడండి.

ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోనే ఇప్పుడు ఆమెను చిక్కుల్లో పడేసింది. ఆమెపై ఏకంగా కేసు నమోదైంది.. షేక్ ఇమ్రాన్ అనే వ్యక్తి బేగంబజార్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. అంతేకాదు ఈసీ దృష్టికి కూడా తీసుకెళ్లాడు. బట్ మాధవీలత దీనిపై రియాక్ట్ అయ్యారు. లేని ధనస్సు.. లేని బాణానికి తనపై కంప్లైంట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. ఈ వీడియోను కావాలనే వైరల్ చేసి తనపై నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారంటూ ఓ ట్వీట్ వదిలారు. పూర్తి వీడియోను కాకుండా కొంచెం పార్ట్‌నే వైరల్ చేస్తున్నారని. అయినా కానీ ఎవరి మనోభావాలైనా దెబ్బతీసి ఉంటే సారీ అంటూ ట్వీటారు. కానీ ఇప్పుడీ వీడియోపై సోషల్ మీడియాలో ఓ యుద్ధమే నడుస్తుంది. తప్పే అని కొందరు.. తప్పేంటని మరికొందరు. వర్డ్స్‌తో వార్ చేస్తున్నారు.

సో ఎన్నికల సమయంలో సున్నిత అంశాలను తెరపైకి తేవడం వాటి ఆధారంగా రాజకీయ లబ్ధి పొందడం అనేది అనుకోకుండా జరుగుతుందా? పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతుందా? అనేది బిగ్ క్వశ్చన్. మరి ఇవన్నీ జరుగుతుంటే ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది? అనేది విపక్షాల ప్రశ్న.. మరి వారి ప్రశ్నలకు ఈసీ సమాధానం చెబుతుందా లేదా అన్నది చూడాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News