Onion Export Restrictions| దేశంలోని ఉల్లి, బాస్మతి బియ్యం రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ముఖ్యంగా ఉల్లిపాయ ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని తొలగించింది. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. ఇప్పటి వరకు ఉల్లి ఎగుమతి ధర ను కేంద్రం నియంత్రించింది. ఒక టన్ను ఉల్లి 550 డాల్లరు (దాదాపు రూ.46000) కనీస ధరకు విక్రయించాలని ఆంక్షలు ఉండేవి.
పైగా ఉల్లి ఎగుమతిపై గత ఏడాది ఆగస్టు లో కేంద్ర ప్రభుత్వం 40 శాతం పన్ను విధించింది. ఆ తరువాత 2023 డిసెంబర్ నుంచి ఈ సంవత్సరం మే వరకు ఉల్లి ఎగుమతులపై నిషేధం కూడా విధించింది. దీంతో దేశంలోని రైతులు ఎగుమతి చేయడానికి ఇబ్బందులు పడేవారు. ఆ తరువాత నిషేధం తొలగించి ఆంక్షలు విధించింది.
Also Read: రిటైర్మెంట్ తరువాత నెలకు రూ.లక్ష సంపాదన.. ఇలా ప్లాన్ చేసుకోండి సరిపోతుంది..
” ఉల్లి ఎగుమతికి కనీస ధర ఆంక్షలు వెంటనే తొలగించబడ్డాయి. ఈ మార్పు తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు కొనసాగుతాయి.” అని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ అధికారిక ప్రకటనలో పేర్కొంది.
దేశంలో మహారాష్ట్ర, హర్యాణాలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో ఉలి పండించే రైతులు భారీ సంఖ్యలో ఉన్నారు. ఎన్నికల ముందు రైతులను ప్రసన్నం చేసుకునేందుకే కేంద్రంలోని బిజేపీ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఎగుమతి చేయడానికి ఉల్లి ధరలపై కనీస ధరల ఆంక్షలు ఉండడంతో ఇతర దేశాలు భారత దేశం నుంచి ఉల్లి కొనడానికి వెనుకడుగు వేస్తున్నాయి. దీంతో రైతుల ధర తగ్గించి విక్రయించాలన్న ప్రభుత్వ ఆంక్షలు అడ్డుగా ఉండేవి. ఇప్పుడు ఎగుమతిపై ఆంక్షలు తొలగిపోవడంతో రైతులు ఆర్థికంగా లాభాలు పొందే అవకాశం ఉంది.
మరోవైపు దేశంలో ఉల్లి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఎగుమతులు పెరిగితే ఈ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. కానీ దేశంలో ఉల్లి పంట ఈ సారి భారీగా ఉన్నందున మరో రెండు నెలల్లో కొత్త ఉల్లి అందుబాటులో రానుందని ధరలు నియంత్రణలోకి వస్తాయని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖరే వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో దేశంలో ఉల్లి నిల్వలు 38 లక్షల టన్నులు ఉన్నట్లు ఆమె తెలిపారు.