ప్రయాణీకులకు మెరుగైన ప్రయాణ అనుభావాన్ని కల్పించేందుకు భారతీయ రైల్వే సంస్థ ఎప్పటికప్పడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. టికెట్ బుక్ చేసిన దగ్గరి నుంచి గమ్యస్థానాలకు చేరుకొనే వరకు అనేక సదుపాయాలను కల్పిస్తోంది. కొంత మంది ప్రయాణీకులు అనివార్య కారణాలతో తమ ప్రయాణాలను క్యాన్సిల్ చేసుకుంటారు. లేదంటే, వాయిదా వేసుకుంటారు. ఇలాంటి వారు తమ టికెట్‌ను క్యాన్సిల్ చేసుకుని పూర్తి స్థాయిలో డబ్బును రిఫండ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC). ప్రయాణికులు తమ అధికారిక వెబ్ సైట్ తో పాటు కౌంటర్లలో కొనుగోలు చేసిన టిక్కెట్లను రద్దు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.
ఆన్ లైన్ ద్వారా టికెట్ క్యాన్సిల్ చేసుకోవాలి అనుకునే వాళ్లు నిర్ణీత గడువుకు ముందు క్యాన్సిల్ చేసుకుంటేనే పూర్తి స్థాయిలో డబ్బులు వాపస్ వచ్చే అవకాశం ఉంటుంది. రైలు బయల్దేరే సమయం దగ్గరపడుతున్న కొద్దీ అదనపు ఛార్జీలు పడతాయి. IRCTC యాప్ ద్వారా టికెట్ ఎలా క్యాన్సిల్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
⦿ IRCTC వెబ్ సైట్ ని ఓపెన్ చేసి ‘ట్రైన్స్’ అనే సెక్షన్ ను నావిగేట్ చేయాలి. ఆ తర్వాత ‘క్యాన్సిల్ టికెట్’ అనే అప్షన్ ను సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత కౌంటర్ టిక్కెట్ ను సెలెక్ట్ చేయాలి.
⦿ PNR నంబర్, రైలు నంబర్ ఎంటర్ చేసి Captchaను నమోదు చేయాలి. అడిగిన వివరాలను ఎంటర్ చేసిన తర్వాత సంబంధిత బాక్స్ లో టిక్ చేసి క్యాన్సిలేషన్ ప్రాసెస్ ను క్లిక్ చేయాలి.
⦿ పూర్తి వివరాలను అందించిన తర్వాత, బుకింగ్ సమయంలో ఇచ్చిన మొబైల్ నంబర్‌కు OTP నెంబర్ వస్తుంది.
⦿ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు వచ్చిన OTPని IRCTC సైట్ లో ఎంటర్ చేయాలి. టికెట్ క్యాన్సిల్ రిక్వెస్ట్ ను కన్ఫామ్ చేయాలి.
⦿ వెంటనే స్క్రీన్ మీద PNR వివరాలు డిస్ ప్లే అవుతాయి. వచ్చిన వివరాలను జాగ్రత్తగా పరిశీలించాయి. అన్ని సరిగా ఉంటే ‘క్యాన్సిల్ టికెట్’ ఆప్షన్ ను క్లిక్ చేయాలి. మీకు రావాల్సిన డబ్బులు వివరాలు కనిపిస్తాయి.
⦿ టికెట్ క్యాన్సిల్ చేసిన తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు PNR నంబర్ తో పాటు రీఫండ్ వివరాలకు సంబంధించిన SMS వస్తుంది. 3 నుంచి 7 రోజుల వ్యవధిలో డబ్బులు అకౌంట్ లోకి వచ్చేస్తాయి.
Also Read: రైల్లో ప్రయాణిస్తున్నారా? టీసీ ఇలా చేస్తే తప్పకుండా ప్రశ్నించవచ్చు, మీకు ఉన్న హక్కులివే!
కౌంటర్ లో టికెట్ తీసుకుంటే రీఫండ్ ఎలా?
కౌంటర్లలో టికెట్లు బుక్ చేసుకున్న వాళ్లు ఆన్ లైన్ ద్వారా టికెట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. లేదంటే మళ్లీ కౌంటర్‌కు వెళ్లి టికెట్ చూపించి క్యాన్సిల్ చేసుకోవచ్చు. కౌంటర్ లో టికెట్ క్యాన్సిల్ చేసుకున్న 3 రోజుల నుంచి 7 రోజుల లోపు డబ్బులు వాపస్ ఇచ్చే అవకాశం ఉంది.
టికెట్ క్యాన్సిల్ చేస్తే ఛార్జి పడుతుందా?
⦿ ఒక్కోసారి టికెట్ క్యాన్సిల్ చేసుకున్నందుకు ఛార్జి చెల్లించాల్సి ఉంటుంది. మీ టికెట్స్ RAC లేదంటే వెయిటింగ్ చూపిస్తే, రైలు బయల్దేరడానికి అరగంట ముందు టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే స్లీపర్ లో రూ. 60, ఏసీలో రూ. 65 రూపాయలు కట్ అవుతాయి.
⦿ ఒకవేళ మీ టికెట్ కన్ఫామ్ అయి రైలు బయలుదేరడానికి 48 గంటల ముందు టికెట్ క్యాన్సిల్ చేస్తే సెకెండ్ సీటర్ క్లాస్ లో రూ. 68 ఛార్జి పడుతుంది. .
⦿ థర్డ్ ఏసీ చైర్ క్లాస్ టికెట్ క్యాన్సిల్ కోసం రూ. 120, వన్ క్లాస్ టికెట్ క్యాన్సిల్ కోసం రూ. 180 చెల్లించాల్సి ఉంటుంది.
⦿సెకండ్ ఏసీ టికెట్ల క్యాన్సిలేషన్ కు రూ. 200, ఫస్ట్ క్లాస్ ఏసీకి రూ. 240 కట్ చేస్తారు. అదనంగా జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.