Big Stories

LPG Cylinder Price : గ్యాస్ సిలిండర్ల ధర పెంపు.. ఈ రోజు నుంచే అమలు..

LPG Gas Cylinder Price Hike
LPG Gas Cylinder Price Hike

Commercial LPG Cylinder Price Hike: చమురు మార్కెటింగ్ కంపెనీలు శుక్రవారం వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరల సవరణలను ప్రకటించాయి. 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధర రూ. 25.50 పెరిగింది. కొత్త రేట్లు మార్చి 1 నుంచి అమలులోకి వచ్చాయి. 19 కేజీల గ్యాస్ సిలిండర్లు వాణిజ్య అవసరాలకు వినియోగిస్తారు. రెస్టారెంట్లు, హోటళ్లు, చిరుతిళ్ల వ్యాపారులు ఈ సిలిండర్లను ఉపయోగిస్తారు. 19 కేజీల గ్యాస్‌ సిలిండర్ ధర ఢిల్లీలో ఇప్పటి వరకు రూ.1,769.50 ఉండేది. ఇప్పుడు రూ.25.50 పెరగడంతో దీని ధర రూ.1,795కు చేరింది.

- Advertisement -

చెన్నైలో రూ.1,960.50, ముంబైలో రూ.1,749, కోల్‌కతాలో రూ.1,911కు వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. 14.2 కేజీల వంటగ్యాస్‌ సిలిండర్‌ ధరను మాత్రం పెంచలేదు. ఈ సిలిండర్లను గృహ అవసరాలకు వినియోగిస్తారు. స్థానిక పన్నుల కారణంగా దేశీయ వంట గ్యాస్ ధరలు రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఈ  ఆర్థిక సంవత్సరంలో మార్చి 1న గృహ సిలిండర్ ధరలలో చివరి సవరణ జరిగింది.

- Advertisement -

మరోవైపు విమాన ఇంధన రేట్స్ ను ప్రభుత్వరంగ ఇంధన రిటైల్‌ సంస్థలు పెంచేశాయి. ఢిల్లీ, కోల్ కతా లో కిలో లీటర్ ఏటీఎఫ్ ధర రూ. 8,900 పెరిగింది. దీంతో ఇప్పటి వరకు రూ.1,01,397 ఉన్న కిలో లీటర్ ఏటీఎఫ్ రేట్.. రూ.1,10,297కు పెరిగింది. ముంబైలో రూ.98,806కు చేరింది. చెన్నైలో రూ.1,05,399కు పెరిగింది.

Read More: ప్రపంచమంతా ఒకవైపు ఇండియా మరోవైపు.. మూడో త్రైమాసికంలో 8.4 శాతం జిడీపీ నమోదు!

దేశీయ విమాన సంస్థలకు ఏటీఎఫ్ రేట్స్ ఢిల్లీలో 921.4 డాలర్లు, ముంబైలో 919.49 డాలర్లు, కోల్‌కతాలో 959.49 డాలర్లు, చెన్నైలో 916.49 డాలర్లుగా ఉన్నాయి. విమానాల నిర్వహణకు 40 శాతం ఖర్చు ఏటీఎఫ్ వల్లే అవుతుంది.

దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న ముడి చమురుపై విండ్ ఫాల్ టాక్స్ ను కేంద్రం పెంచింది. ఇప్పటి వరకు ఈ పన్ను టన్నుకు రూ.3,300 ఉండేది. ఆ ట్యాక్స్ ను ప్రస్తుతం రూ.4,600 కు పెంచారు. డీజిల్‌ ఎగుమతులపై పన్నును కుదించారు. లీటర్ కు రూ. 1.5 కు మార్చారు. ఏటీఎఫ్‌, పెట్రోల్ ఎక్స్ పోర్ట్స్ పై
ఎలాంటి పన్ను విధించలేదు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News