BigTV English

India GDP at 8.4% : ప్రపంచమంతా ఒకవైపు ఇండియా మరోవైపు.. మూడో త్రైమాసికంలో 8.4 శాతం జిడీపీ నమోదు!

India GDP at 8.4% : ప్రపంచమంతా ఒకవైపు ఇండియా మరోవైపు.. మూడో త్రైమాసికంలో 8.4 శాతం జిడీపీ నమోదు!

India GDP at 8.4% : ఒకవైపు పాశ్చాత్య దేశాలు ఆర్థిక మాంద్యం కొట్టుమిట్టాడుతుంటే భారత జిడిపీ దూసుకుపోతోంది. జాతీయ గణాంకాల కార్యాలయం (National Statistical Office -NSO)తాజా గణాంకాల ప్రకారం 2023-24 మూడో త్రైమాసికం(అక్టోబర్ నుంచి డిసెంబర్)లో భారత జిడీపీ 8.4 శాతం ఉంది. ఈ వృద్ధి అంచనాల కంటే మెరుగ్గుగా ఉందని ఆర్థిక నిపుణలు అభిప్రాయపడుతున్నారు. ఈ గణాంకాలు ఎన్ఎస్ఓ గురువారం విడుదల చేసింది.


మైనింగ్, నిర్మాణం, తయారి రంగాలలో మంచి వృద్ధి నమోదు అవడంతో జిడిపీ 8.4 శాతం చేరుకుందని ఎన్ఎస్ఓ తెలిపింది. అనుకున్న దానికంటే ఎక్కువ వృద్ధి నమోదు కావడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంచనాలను కూడా ఎన్ఎస్ఓ సవరించింది. 2023-24 చివరి త్రైమాసికం (జనవరి -మార్చి) అంచనా 7.3 శాతం ఉండగా.. ఇప్పుడు దానిని 7.6 శాతానికి పెంచింది.

Read More: గోప్యత వద్దు.. రేపటి భద్రతే ముద్దు..


గత ఆర్థిక సంవత్సరం 2022-23లో కూడా జిడిపి గణాంకాలను ఎన్ఎస్ఓ ఇలాగే సవరించింది. ముందు 7.2 శాతం అంచనా వేయగా.. తరువాత 7 శాతానికి తగ్గించింది. కానీ ఈ సంవత్సరం వృద్ధి నమోదు కావడంతో అంచనా గణాంకాలను పెంచింది.

Related News

RBI New Rules: RBI కొత్త రూల్స్..! ఆ ఖాతాలకు సెటిల్‌మెంట్‌కి 15 రోజుల గడువు

Credit Score: సిబిల్ స్కోర్ అంటే ఏంటి? లోన్ ఇవ్వాలా వద్దా అని బ్యాంకు ఎలా నిర్ణయిస్తుంది ?

Bank Holidays: ఈ వారంలో 4 రోజులు బ్యాంకులు బంద్.. హాలిడేస్‌ లిస్ట్‌ ఇదే!

SBI Card New Rules: కార్డ్ యూజర్లకు ఎస్‌బీఐ ఝలక్.. కోటి ఆఫర్ పోయినట్టే

FMCG Sales: పండగలకు స్టాక్ పెంచిన FMCG.. సామాన్యులకు లాభమా? నష్టమా?

DMart: ఇక డి-మార్ట్ కు వెళ్లాల్సిన పని లేదు.. ఇలా చేస్తే నేరుగా ఇంటికే సరుకులు!

Big Stories

×