BigTV English

Rashmika’s Japan fans: జపాన్‌లో రష్మిక ఫాలోయింగ్, ఫోటోలతో ఫ్యాన్స్ రచ్చ

Rashmika’s Japan fans: జపాన్‌లో రష్మిక ఫాలోయింగ్, ఫోటోలతో ఫ్యాన్స్ రచ్చ

Rashmika's following in Japan, fans created a frenzy with photos


Rashmika’s following in Japan, fans created a frenzy with photos: పుష్ప, యానిమల్ సినిమాలతో స్టార్ హీరోయిన్ల సరసన చేరింది రష్మిక. తన యాక్టింగ్‌తో నేషనల్ వైడ్‌గా ఫుల్ ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకుంది. సౌత్ టూ నార్త్‌ వరుస హిట్స్ అందుకుంటూ పాన్ ఇండియా హీరోయిన్ అనే ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. అయితే తన స్టార్‌డంకి అక్కడితో బ్రేక్ పడలేదు. ఖండంతరాలను దాటి తన స్టార్‌డం తెచ్చుకొని ముందుకు దూసుకుపోతోంది. జపాన్ బ్రాండ్స్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ తగ్గేదెలే అంటోంది.

బిగ్గెస్ట్‌ బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్‌తోనే నేషనల్ క్రష్‌ అనిపించుకుంది ఈ అందాల భామ. ఇక పుష్ప వంటి మూవీస్‌తో రష్మికకు జపాన్‌లో కూడా మంచి ఫాలోయింగ్‌ ఏర్పడింది. దీంతో జపాన్‌కి చెందిన ఫ్యాషన్‌ బ్రాండ్ ఓనిట్‌సుక టైగర్‌కి రష్మిక బ్రాండ్ అంబాసిడర్‌గా గత ఏడాదే నియమించుకుంది. ఇక ఈ బ్రాండ్‌కి సంబంధించిన పలు వస్తువులను ప్రమోషన్ చేస్తూ పలు ఈవెంట్స్‌లలో చురుకుగా పాల్గొంటూ జపాన్‌లో సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల ఇటలీలో జరిగిన ఫ్యాషన్‌ ఈవెంట్‌కి రష్మిక గెస్ట్‌గా వెళ్లారు.


తాజాగా ఈమె జపాన్‌లో జరిగే మరో ఈవెంట్‌కి వెళ్లినట్లు తెలుస్తోంది. నిన్న హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి జపాన్‌ చేరుకున్న రష్మికకు అక్కడి ఫ్యాన్స్‌ గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పారు. అది చూసిన హీరోయిన్ రష్మిక సైతం వారి అభిమానానికి ఎమోషనల్ అయ్యారు. జపాన్ రాజధాని టోక్యోలో రష్మిక ఫ్యాన్స్‌ ఆమె పోస్టర్స్‌ పట్టుకొని స్వాగతం పలికారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఇక ఇది చూసిన రష్మిక ఫ్యాన్స్‌ నేషనల్ క్రష్, పాన్ ఇండియా హీరోయిన్ నుంచి ఇప్పుడు గ్లోబల్ స్టార్ అనిపించుకుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. రష్మిక ఇలా ఒక పక్క బ్రాండ్ ప్రమోషన్స్ చేస్తూ దేశ, విదేశాల్లో తిరుగుతూనే.. మరోపక్క తను సైన్‌ చేసిన సినిమాల షూటింగ్స్‌కి కూడా అటెండ్ అవుతూ ఫుల్ బిజీ అవుతూ వస్తున్నారు. ఇక ఇది చూసిన నెటిజన్లు రష్మిక ఇలాగే తన స్టార్‌డంని మెయింటైన్ చేయాలని తనను అభిమానించే ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Read More: విశ్వక్ సేన్ ‘గామి’ ట్రైలర్‌కు ప్రభాస్ ఫిదా.. వీడియో రిలీజ్ చేస్తూ ఏమన్నాడంటే?

అంతేకాకుండా ముందు ముందు తను ఓ ఉన్నతమైన స్టార్ హీరోయిన్‌గా వెలుగు వెలుగుతూ అందనంతా ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నారు. చూడాలి మరి తన స్టార్‌డంని ఇలాగే మెయింటైన్ చేస్తుందా లేక అందరి హీరోయిన్లలాగానే పెళ్లి చేసుకొని మధ్యలోనే డ్రాప్‌ అవుట్ అవుతుందా అనేది. ఎనీవే రష్మిక మూవీస్‌ అన్నీ మూడు పువ్వులు ఆరుకాయలు లాగా ఎప్పటికి నిలవాలని కోరుకుందాం.

Related News

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

Big Stories

×