Festivel Offers: రెండు రోజులు మాత్రమే మిగిలాయి. ఫెస్టివల్ సీజన్ ఆఫర్లలో చివరి గంటలు మొదలయ్యాయి. ఆన్‌లైన్ షాపింగ్ ప్రేమికులు అందరూ ఒకే ప్రశ్న అడుగుతున్నారు . ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, జియోమార్ట్‌లలో ఏది బెస్ట్? ఎవరిది ఎక్కువ సేవింగ్? ఇప్పుడే మనం తెలుసుకుందాం.
80శాతం తగ్గింపుతో ఫ్లిప్‌కార్ట్
ఫ్లిప్‌కార్ట్ ఈసారి నిజంగా పెద్ద ఎత్తున పోటీ ఇచ్చింది. “బిగ్ బిలియన్ డేస్” పేరుతో ఆఫర్లు తెచ్చి మార్కెట్ మొత్తం కదిలించింది. మొబైల్స్, ల్యాప్‌టాప్స్, టీవీలు, ఫ్యాషన్, ఫర్నిచర్ ఇలా ఏ కేటగిరీ చూసినా తగ్గింపుల జల్లు కురుస్తోంది. కొన్ని ప్రోడక్ట్స్‌పై 80శాతం వరకు తగ్గింపు ఉంది. ముఖ్యంగా ఎస్‌బిఐ, ఐసిఐసిఐ బ్యాంకు కార్డు యూజర్లకు 10శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా అందిస్తోంది.
పాత ఫోన్లు, ల్యాప్‌టాప్స్ ఇచ్చి కొత్తవాటిని తీసుకునే ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా బాగానే వర్కవుట్ అవుతున్నాయి. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ యూజర్లకు ఫ్రీ షిప్పింగ్, ఫాస్ట్ డెలివరీ, ప్రాధాన్య ఆర్డర్ ప్రాసెసింగ్ లాంటి సదుపాయాలు కస్టమర్లకు మంచి అనుభవం ఇస్తున్నాయి. టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషిన్లు వంటి వస్తువులు కూడా బంపర్ ధరల్లో దొరుకుతున్నాయి. మొత్తానికి టెక్నాలజీ, గాడ్జెట్స్, ఫ్యాషన్ షాపింగ్ కోసం ఫ్లిప్‌కార్ట్ ఈసారి మస్త్ డీల్.
Also Read: Health Tips: ఇంటి వంటల్లో దాగిన ఆరోగ్య రహస్యం.. ఈ పప్పు మీ ఆయుష్షు పెంచుతుంది
60శాతం తగ్గింపుతో అమెజాన్
ఇప్పుడు అమెజాన్ వైపు వెళ్తే, ఈసారి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ పేరిట నిజంగానే సూపర్ డీల్స్ తెచ్చింది. క్వాలిటీ ప్రొడక్ట్స్, సేఫ్ షిప్పింగ్, ఫాస్ట్ డెలివరీ అనగానే అమెజాన్‌నే గుర్తు వస్తుంది. ఈసారి అదనంగా ఎక్స్‌ట్రా హ్యాపీనెస్ డేస్ పేరుతో ప్రతి కేటగిరీలో కూడా తగ్గింపులు పెంచింది. మొబైల్స్‌పై 50శాతం, ల్యాప్‌టాప్స్‌పై 45శాతం, హోమ్ అప్లయెన్సెస్‌పై 60శాతం వరకు తగ్గింపులు ఉన్నాయి.
హెచ్ డిఎఫ్ సి, వన్ కార్డ్, అమెజాన్ పే ఐసిఐసిఐ యూజర్లకు 10శాతం క్యాష్‌బ్యాక్, అమెజాన్ పే లేటర్ ద్వారా ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది. అమెజాన్ ప్రత్యేకత అయిన ఫ్లాష్ డీల్స్ ఈసారి కూడా అదిరిపోయాయి. ప్రతి నాలుగు గంటలకు కొత్త ఆఫర్లు వస్తుండటంతో షాపర్లు స్క్రోల్ చేయకుండా ఉండలేరు. ఫ్యాషన్ కేటగిరీలో “ట్రై బిఫోర్ యూ బై” ఫీచర్‌తో ముందుగా ట్రై చేసి తర్వాత కొనుగోలు చేసే ఆప్షన్ ఇచ్చింది. ఈ కాన్సెప్ట్ ఇప్పటివరకు ఇతర సైట్లలో లేనిది. అమెజాన్ క్వాలిటీ, సర్వీస్, స్పీడ్ ఈసారి మరింతగా ఆకట్టుకుంటున్నాయి.
60శాతం తగ్గింపుతో జియెమార్ట్
ఇక జియోమార్ట్‌ను తీసుకుంటే, అది పూర్తిగా కొత్త రంగు చూపిస్తోంది. ఒకప్పుడు కేవలం గ్రోసరీలతో మాత్రమే ఉన్న ఈ ప్లాట్‌ఫాం ఇప్పుడు ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, హోమ్ డెకర్, కిచెన్ వస్తువుల వరకు విస్తరించింది. “ఫెస్టివ్ రెడీ ఇండియా సేల్” పేరిట ఈసారి వస్తువులపై 60శాతం వరకు డిస్కౌంట్లు ఉన్నాయి.
రోజువారీ వాడుక వస్తువులు అయిన ఆయిల్, రైస్, డిటర్జెంట్, షాంపూ, బ్యూటీ ప్రొడక్ట్స్ అన్నీ చవకగా లభిస్తున్నాయి. జియోమార్ట్ వాలెట్ ద్వారా క్యాష్‌బ్యాక్, లోకల్ డెలివరీ సర్వీస్, కిరాణా పార్ట్నర్ సిస్టమ్ వల్ల ఇది గ్రామీణ, పట్టణ వినియోగదారుల ఇద్దరికీ సౌకర్యంగా మారింది. ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు తక్కువ ధరల్లో నాణ్యతతో వస్తువులు అందించడం జియోమార్ట్ ప్రత్యేకత.
ఈ మూడింట్లో ఎవరిది బెస్ట్?
ఇప్పుడు అసలు విషయానికి వస్తే , ఈ మూడింట్లో ఎవరిది బెస్ట్? ప్రతి ఒక్కరి అవసరం వేరుగా ఉంటుంది. మొబైల్స్, గాడ్జెట్స్, ఫ్యాషన్ వస్తువులు కొనాలనుకునేవారికి ఫ్లిప్‌కార్ట్ బెస్ట్ ఆప్షన్. ప్రీమియం బ్రాండ్స్, క్వాలిటీ, సురక్షితమైన డెలివరీ కావాలంటే అమెజాన్‌ను ఎంచుకోవచ్చు. ఇక రోజువారీ వస్తువులు, హోమ్ అవసరాలు, ఫుడ్ ఐటమ్స్ కొనాలనుకునేవారికి జియోమార్ట్ సరైన ఎంపిక.
మూడింటిలో ఎవరు గెలుస్తారో చెప్పడం కష్టం, కానీ కస్టమర్ మాత్రం ఖచ్చితంగా గెలుస్తాడు. ఎందుకంటే ఈ పోటీ వల్లనే మనకు ఇంత పెద్ద తగ్గింపులు దొరుకుతున్నాయి. కానీ గుర్తుంచుకోండి. ఇంకా రెండు రోజులు మాత్రమే మిగిలాయి. మీరు కార్ట్‌లో వేసి వదిలేసిన వస్తువులు ఈ సేల్ ముగిసాక మళ్లీ పాత ధరలకే వెళ్తాయి. ఇప్పుడే షాపింగ్ పూర్తి చేసేయండి, లేదంటే “అయ్యో మిస్ అయిపోయింది” అని చెప్పుకునే పరిస్థితి వస్తుంది. ఈ ఫెస్టివల్ సీజన్‌లో మీరు ఎంత సేవ్ చేసారో అంతే సంతోషం మీ ఇంట్లో ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, జియోమార్ట్ ముగ్గురూ మీ కోసం సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మీరు ఎవరినీ ఎంచుకుంటారో అదే మీ లాభం నిర్ణయిస్తుంది.కాబట్టి ఆలోచించకుండా, ఈ ఫెస్టివల్ సేల్‌ను మీ షాపింగ్ హ్యాపీ మెమరీగా మార్చేసుకోండి.