Raksha Bandhan 2025: అమ్మానాన్నల తర్వాత అన్న తమ్ముడు అమ్మాయికి అండగా ఉంటారు. వీరి బంధం మరింత గొప్పగా ఉండేందుకు జరుపుకొనే ఏకైక పండుగ రాఖీ పౌర్ణమి.. భారతీయులు ఎంతో ప్రేమగా సెలబ్రెట్ చేసుకునే పండగ ఇది. అక్కా చెల్లెళ్లు ఎక్కడున్న ఆగస్టులో వచ్చే ఈ పండగ రోజు తమ తోడబుట్టిన వాళ్లను కలుసుకుని రాఖీ కట్టి రోజంతా తమ కుటుంబసభ్యులతో ఎంతో సంతోషంగా గడుపుతారు.. రాఖీ కట్టిన తమ అక్కలు, చెల్లెళ్లకు తోడబుట్టిన సోదరులు మనసుకు నచ్చిన బహుమతులు ఇస్తుంటారు.. ఈ రాఖీ పౌర్ణమికి ఇంట్లోనే కూర్చొని సిస్టర్ సెంటిమెంట్ సినిమాలు చూసి ఎంజాయ్ చెయ్యండి.. మరి ఇవాళ ఎలాంటి సినిమాలను చూస్తే బాగుంటుందో ఒకసారి ఇక్కడ చూసేయ్యండి..
మెగాస్టార్ – హిట్లర్..
మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో హిట్లర్ మూవీ కూడా ఒకటి.. తన చెల్లెళ్లను కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. ఈ సినిమాను చూడడానికి అప్పట్లో మహిళలు ఎండ్లబండ్లలో వెళ్లేవారు. రాఖీ రోజు తప్పక చూడాల్సిన సినిమాల్లో ఇది ఒకటి. యూట్యూబ్ లో ఈ మూవీని చూడొచ్చు. తన అన్న ప్రేమను చెల్లెల్లు ఎలా అర్థం చేసుకున్నారో ఇందులో డైరెక్టర్ చక్కగా చూపించారు.
అర్జున్- పుట్టింటికి రా చెల్లి..
యాక్షన్ హీరో అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం పుట్టింటికి రా చెల్లి. సిస్టర్ సెంటిమెంట్‌తో వచ్చిన ఈ సినిమాను చూడడానికి అప్పట్లో మహిళలు ఆసక్తి కనబరిచారు. రాఖీ రోజు తప్పక చూడాల్సిన సినిమాల్లో ఇది ఒకటి. ఈ చిత్రం యూట్యూబ్‌లో ప్రసారం అవుతుంది.
శ్రీహరి – నువ్వొస్తానంటే నేనొద్దంటానా..
రియల్ స్టార్ శ్రీహరి, సిద్ధార్థ్, త్రిష ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం నువ్వొస్తానంటే నేనొద్దంటానా. చిన్నప్పుడే అమ్మనాన్నలను కోల్పోయి చెల్లికి అన్ని తానై అండగా ఉంటాడు శ్రీహరి. చెల్లిని pఇంటికి వచ్చిన సిద్ధార్థ్‌ను శ్రీహరి ఏం చేశాడు. చివరికి వాళ్లిద్దరి పెళ్లికి ఒప్పుకున్నాడా? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఈ చిత్రం య్యూటూబ్‌లో ఉంది.
రాజశేఖర్-గోరింటాకు..
యాక్షన్ కింగ్ రాజశేఖర్, మీరా జాస్మిన్ అన్నాచెల్లెళ్ల పాత్రల్లో నటించిన హిట్ మూవీ గోరింటాకు. అప్పట్లో ఈ సినిమా చూసి మహిళలు కన్నీళ్లు పెట్టకుండా థియేటర్ నుంచి రాలేదంటే ఈ సినిమా ఎంత ఇంపాక్ట్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీలు జీ5తో పాటు యూట్యూబ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.. ఆలస్యం లేకుండా ఈ మూవీని మరోసారి చూసేయ్యండి.
ఎన్టీఆర్ – రాఖీ..
జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఇది.. ఇందులో మంజుల ఆయనకు చెల్లె పాత్రలో నటించింది. తన చెల్లికి ఎంత చిన్న కష్టం వచ్చిన చూసుకునే అన్నయ్య పాత్రల్లో తారక్ కనిపించడం ఈ మూవీకే హైలైట్‌గా నిలిచింది. కృష్ణవంశీ దర్శకత్వం వచ్చిన ఈ చిత్రం యూట్యూబ్‌లో ఉంది. హ్యాపీగా చూసేయ్యండి..
పవన్ కళ్యాణ్ – అన్నవరం..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సంధ్య ప్రధాన పాత్రలో నటించిన మూవీ అన్నవరం. తమిళంలో హిట్ అయిన తిరుప్పాచ్చికి రీమేక్‌గా వచ్చిన ఈ చిత్రం తెలుగులో కూడా మంచి వసూళ్లను సాధించింది. అన్నవరం సినిమాలోని సాంగ్స్ కూడా అప్పట్లో చార్ట్ బస్టర్‌గా నిలిచాయి.. యూట్యూబ్ లో అందుబాటులో ఉంది…
ఇవే కాదు చాలా సినిమాలు ఉన్నాయి. మహేష్ బాబు అర్జున్ సినిమా జగపతిబాబు శివరామరాజు, చెల్లెలి కాపురం, పల్నాటి పౌరుషం, రక్త సంబంధం, బంగారు గాజులు, బ్రదర్ ఆఫ్ బొమ్మాళి, బ్రూస్ లీ, కత్తి, హనుమాన్, వీరసింహారెడ్డి, భోళాశంకర్, బ్రో, పెద్దన్న వంటి సినిమాలు కూడా సిస్టర్ సెంటిమెంట్‌తో వచ్చినవే.. మీకు నచ్చిన సినిమాను ఒకసారి చూసేయ్యండి…