BigTV English
Advertisement

Dion Electric Augusta Sp And Asta Fh launched: అబ్బబ్బ.. రెండు స్టైలిష్ ఎలక్ట్రిక్ స్కూటర్లు లాంచ్.. ధర ఎంతంటే..?

Dion Electric Augusta Sp And Asta Fh launched: అబ్బబ్బ.. రెండు స్టైలిష్ ఎలక్ట్రిక్ స్కూటర్లు లాంచ్.. ధర ఎంతంటే..?

Augusta Sp And Asta Fh launched: ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగిపోయింది. పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా పెరగడంతో వాహన ప్రియులు ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నవి కాబట్టి. అందువల్లనే ప్రముఖ కంపెనీలన్నీ పెట్రోల్, డీజిల్ వెహికల్స్ కంటే ఇప్పుడు ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలపైనే ఫోకస్ పెడుతున్నాయి. ఇందులో భాగంగానే తమ వాహనాలలో అధిక ఫీచర్లను అందించి ఆకట్టుకుంటున్నాయి. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను ముందుడి ప్రోత్సహిస్తున్నాయి.


అందువల్లనే ఆటో మొబైల్‌ మార్కెట్‌లో రోజుకో కొత్త వాహనం రిలీజ్ అవుతుంది. అందులో ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్లపై ఎక్కువ మంది వాహన ప్రియులు ఆసక్తి చూపిస్తుండటంతో వాటినే కంపెనీలు విడుదల చేస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా మరో కంపెనీ తన లైనప్‌లో ఉన్న అద్భుతమైన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసింది. ఈ స్కూటర్ చూడ్డానికి అత్యంత ఆకర్షణీయంగా ఉంది. స్మార్ట్ మొబిలిటీ బ్రాండ్‌లో ఒకటిగా కొనసాగుతున్న డియోన్ ఎలక్ట్రిక్ కంపెనీ తాజాగా రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసింది.

అవి ‘అగస్టా ఎస్‌పి’, ‘అస్టా ఎఫ్‌హెచ్’ వంటి మోడళ్లు ఉన్నాయి. ఈ రెండు మోడళ్లు అత్యాధునిక ఫీచర్లతో వచ్చాయి. ఈ స్కూటర్లు మార్కెట్‌లో ఉన్న ఇతర వాటికి గట్టి పోటీనిస్తుందని పలువురు భావిస్తున్నారు. అగస్టా ఎస్‌పి ఎలక్ట్రిక్ స్కూటర్ 7.5 కిలో వాట్ల పీక్ పిఎమ్ఎస్ఎమ్ హబ్ మోటార్‌ను కలిగి ఉంది. దీని కారణంగా ఈ అగస్టా ఎలక్ట్రిక్ స్కూటర్ గంటకు 120 కిమీ స్పీడ్‌తో పరుగులు పెడుతుంది. ఇందులో 4.3 కిలోవాట్ల లిథియం అయాన్ ట్రాక్షన్ బ్యాటరీని అందించారు.


Also Read:  సరికొత్త కలర్ వేరియంట్‌లో ‘2024 హీరో గ్లామర్ 125’ లాంచ్.. ధర ఎంతంటే..?

అందువల్ల దీనికి ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే ఏకంగా 110 కి.మీ మైలేజీ అందిస్తుంది. అలాగే మరో మోడల్ అస్టాఎఫ్‌హెచ్‌ను మెరుగైన పనితీరు కోసం రూపొందించారు. ఈ రెండు మోడళ్లు 1కెవిఏ ఛార్జర్‌తో 4 నుంచి 5 గంటల సమయంలో ఫుల్‌గా ఛార్జింగ్ అవుతుంది. ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లలో సేఫ్టీ కోసం అధునాతన ఫీచర్లు అందించారు. ఇందులో ముందు భాగంలో టెలిస్కోపిక్ సస్పెన్షన్ అందించారు. అలాగే భద్రత కోసం అద్భుతమైన బ్రేకింగ్ సిస్టమ్ అందించారు.

అయితే బ్యాక్ సైడ్ సస్పెన్సన్ మాత్రం రెండు మోడళ్ల మధ్య మారుతూ ఉంటుంది. ఇందులో యాంటీ థెఫ్ట్ లాక్స్, అలాగే ఎల్‌ఈడీ లైటింగ్ సిస్టమ్ వంటివి ఉన్నాయి. ఇక వీటి ధరల విషయానికొస్తే.. అగస్టా ఎస్‌పి ఎలక్ట్రిక్ స్కూటర్ రూ.1,79,750ల ధరతో అందుబాటులోకి వచ్చింది. అదే సమయంలో ఆస్టా ఎఫ్‌హెచ్ రూ.1,29,999 ల ధరతో లభిస్తుంది. అయితే కంపెనీ ఈ డియోన్ ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ.22,000 వరకు డిస్కౌంట్లు ప్రకటించింది. ఈ ఆఫర్లు వచ్చే నెల అంటే సెప్టెంబర్ 23వ తేదీ వరకు అందుబాటులో ఉండనున్నాయి. కాగా వీటిని కొనుక్కోవాలని అనుకునే వారు కంపెనీ అఫీషియల్ వెబ్‌సైట్‌లో రూ.999 చెల్లించి ముందుగా బుక్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు కేవలం తమిళనాడులో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. త్వరలో భారతదేశమంతటా విస్తరించనున్నాయి.

Related News

EPFO Withdrawal: ఈపీఎఫ్ఓ విత్ డ్రా నిబంధనలతో కొత్త చిక్కులు.. కాలపరిమితి పెంపుపై చందాదారుల్లో అసంతృప్తి

Elite Black Smartwatch: అమెజాన్‌ బంపర్‌ ఆఫర్‌.. రూ.9 వేల స్మార్ట్‌వాచ్‌ ఇప్పుడు కేవలం రూ.2,799లకే!

Jiomart Offers: నవంబర్‌లో ఆఫర్ల వర్షం.. జియోమార్ట్‌లో సూపర్ డీల్స్ వచ్చేశాయ్..

Gold Rate Dropped: వావ్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..?

Dak Sewa App: ఇక మీ పాకెట్ లో పోస్ట్ ఆఫీస్ సేవలు.. సరికొత్త యాప్ లాంచ్ చేసిన తపాలాశాఖ

Gold Rate Dropped: గుడ్‌న్యూస్.. కుప్పకూలిన బంగారం ధరలు.. ఈ రోజు ఎంత తగ్గాయంటే..

Jio Offer: జియో కస్టమర్లకు సర్‌ప్రైజ్ గిఫ్ట్.. ఉచిత హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ప్రారంభం

EPFO Enrollment Scheme: ఈపీఎఫ్ఓ ఉద్యోగుల ఎన్ రోల్మెంట్ స్కీమ్.. మీరు అర్హులేనా?

Big Stories

×