NABARD Jobs: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది బంపర్ ఆఫర్ న్యూస్. డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, బీసీఏ, ఎంసీఏ, పీజీ డిప్లొమా పాసైన అభ్యర్థులకు ఇది మంచి అవకాశమే అని చెప్పవచ్చు. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్ మెంట్ (NABARD) కాంట్రాక్ట్ విధానంలో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలను సవివరంగా తెలుసుకుందాం.
ముంబయి, బాంద్రాలోని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవెలప్ మెంట్ (NABARD) లో కాంట్రాక్ట్ విధానంలో స్పెషలిస్ట్ పోస్టులు భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 30న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా అభ్యర్థులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 5
నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవెలప్ మెంట్ లో పలు రకాల ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. ఇందులో డేటా సైంటిస్ట్, డేటా ఇంజినీర్, డేటా సైంటిస్ట్, స్పెషలిస్ట్ – డేటా మేనేజ్ మెంట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
వెకెన్సీ వారీగా పోస్టులు చూసినట్లయితే..
*డేటా సైంటిస్ట్/ ఏఐ ఇంజినీర్- 02
* డేటా ఇంజినీర్- 01
* డేటా సైంటిస్ట్-కమ్-బీఐ డెవెలపర్- 01
* స్పెషలిస్ట్-డేటా మేనేజ్‌మెంట్- 01
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, బీసీఏ, ఎంసీఏ, పీజీ, పీజీ డిప్లొమా పాసై ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను పరిగణలోకి తీసుకుంటారు.
దరఖాస్తుకు చివరి తేది: 2025 జూన్ 30
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.
వయస్సు: ఉద్యోగాన్ని బట్టి వయస్సును నిర్ధారించారు. డేటా సైంటిస్ట్, ఏఐ ఇంజినీర్, డేటా ఇంజినీర్ పోస్టులకు 25- 35ఏళ్లు; డేటా సైంటిస్ట్‌కు 23- 30ఏళ్లు, స్పెషలిస్ట్‌కు 30- 40ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం: ఉద్యోగాన్ని బట్టి వేతనం నిర్ధారించారు. ఏడాదికి డేటా సైంటిస్ట్, ఏఐ ఇంజినీర్ పోస్టుకు రూ.21- రూ.30లక్షల జీతం ఉంటుంది. డేటా ఇంజినీర్‌కు రూ.18- 27లక్షల జీతం ఉంటుంది డేటా సైంటిస్ట్‌కు రూ.15-రూ.21లక్షల జీతం ఉంటుంది. స్పెషలిస్ట్‌కు రూ.12-రూ.15 లక్షలుల జీతం ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
దరఖాస్తు ఫీజు: ఓబీసీ, జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.850 ఫీజు ఉంటుంది. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు ఇంటిమేషన్ చార్జెస్ రూ.150 ఉంటుంది.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.nabard.org
ALSO READ: Pawan Kalyan: యువతకు భారీ గుడ్‌న్యూస్.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ప్రకటన
ముఖ్య సమాచారం:
మొత్తం పోస్టుల సంఖ్య: 5
దరఖాస్తుకు చివరి తేది: జూన్ 30