E-Paper
Advertisement

EPFOలో కీలక మార్పులు.. ఇకపై ప్రతి నెలా జీతం PF నుంచే, ఖాతాలో కనీస నిల్వలు తగ్గింపు

EPFOలో కీలక మార్పులు.. ఇకపై ప్రతి నెలా జీతం PF నుంచే,  ఖాతాలో కనీస నిల్వలు తగ్గింపు
Advertisement

EPFO New Rules: పరిస్థితులకు తగ్గట్టుగా అనేక విభాగాల్లో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. అందులో చెప్పుకోదగినది ఈపీఎఫ్‌. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ-ఈపీఎఫ్‌ఓ తమ చందాదారులకు ఊరట ఇచ్చేలా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఆ సంస్థ తీసుకొచ్చిన కొత్త నిబంధనలు చందాదారులకు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ఏకంగా 90 శాతం వరకు పీఎఫ్ విత్‌డ్రాకు అనుమతి లభించినట్లయ్యింది.

EPFOలో కీలక మార్పులు

ఈపీఎఫ్‌ పరిధిలోకి వచ్చే కార్మికులు, ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత నిధులు ఒకే సారి తీసుకోకుండా నిర్ణీత కాల వ్యవధిలో తీసుకోవచ్చు. విడతల వారీగా తీసుకునేలా వీలు కల్పిస్తూ ఈపీఎఫ్‌వో కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. సిస్టమాటిక్‌ విత్‌డ్రాయల్‌ ప్లాన్‌- SWP కి ఈపీఎఫ్‌వో సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ట్రస్టీస్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాకుండా ఉద్యోగుల భవిష్యనిధి ఖాతాలో కనీస నిల్వను 10 శాతానికి పరిమితం చేసింది.

Advertisement

గతంలో ఉన్న 75 శాతం ఉండేది. ఇప్పుడు 90 శాతానికి పెంచింది. ఖాతాదారులు తమ అకౌంట్‌లో కేవలం 10 శాతం నిల్వ ఉంచితే సరిపోతుంది. అత్యవసర పరిస్థితుల్లో సభ్యులు తమ పొదుపు మొత్తాన్ని సులభంగా పొందవచ్చు. ఉద్యోగస్తులు ఇకపై తమ పీఎఫ్ ఖాతా నుంచి మరింత ఎక్కువ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు.

ఒక సంవత్సరం పాటు ఉద్యోగం చేసి ఉండాలనే నిబంధన తొలగించబడింది ఆ సంస్థ. పీఎఫ్ నుండి నిధులను విత్‌డ్రా చేసుకోవడానికి ఏడాది పాటు ఉద్యోగం చేసి ఉండాలనే నిబంధన ఇకపై అమలులో ఉండదు. కొత్త నిబంధనల ప్రకారం.. పీఎఫ్ సభ్యులుగా చేరిన కేవలం రెండు నెలల తర్వాత నిరుద్యోగం ఏర్పడిన సందర్భంలో నిధులను విత్‌డ్రా చేసుకోవచ్చు.

Advertisement

గురువారం కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా అధ్యక్షతన జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్-CBT 240వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది.  పదవీ విరమణ పొందినవారు తమ పీఎఫ్ ఖాతా నుండి క్రమం తప్పకుండా ఆదాయాన్ని పొందవచ్చు. మిగిలిన డబ్బును ఈపీఎఫ్ లో పెట్టుబడిగా పెట్టవచ్చు. ఒకవేళ విత్‌డ్రా చేయని బ్యాలెన్స్‌పై వర్తించే ఈపీఎఫ్ రేటు వడ్డీ కొనసాగుతుంది. ఈ చర్య వల్ల తమ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలలో రూ. 5 లక్షలకు పైగా ఉన్న 55 ఏళ్లు పైబడిన సుమారు 6.32 లక్షల మంది చందాదారులకు ప్రయోజనం చేకూరనుంది.

ALSO READ: రూ.5 లక్షలు సేవింగ్స్ ఉంటే పెట్టుబడి కోసం ఇలా ప్లాన్ చేయండి.. చార్టర్డ్ అకౌంటెంట్ చేసిన సూచనలు

నిధులు ఉపసంహరణ కోసం ఉండే కాలాన్ని 12 నుంచి 2 నెలలకు కుదించింది. పదవీ విరమణ నాటికి మొత్తాన్ని నిర్ణీత కాలవ్యవధిలో నెల లేకుంటే 3, 6 నెలలకు ఒకసారి విడతలవారీగా నిధులు తీసుకోవచ్చు. దీని ద్వారా ఉద్యోగులకు ఆదాయం లభిస్తుంది. ఎస్‌డబ్ల్యూపీ పథకం స్వచ్ఛందమేకానీ తప్పనిసరి కాదు. ఈ పథకాన్ని కుటుంబ సభ్యులు, లబ్ధిదారులు తమ కుటుంబానికి ఆర్థిక భద్రత కోసం కొనసాగించవచ్చు. పదవీ విరమణ తర్వాత స్థిరమైన ఆదాయం, పెట్టుబడి భయాలు తగ్గించడం దీని లక్ష్యం.

పదవీ విరమణ తర్వాత చందాదారుడు చనిపోతే ఖాతాలోని నామినీ, ఆ వ్యక్తిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు మిగతా నిధి మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. లేకుంటే ఆ పథకం కింద చెల్లింపులు కొనసాగించవచ్చు. అది చందాదారుడి ఇష్టం మీద ఉంటుంది.

Related News

రూ.5 లక్షలు సేవింగ్స్ ఉంటే పెట్టుబడి కోసం ఇలా ప్లాన్ చేయండి.. చార్టర్డ్ అకౌంటెంట్ చేసిన సూచనలు

ఒక్క చోటే అంత బంగారమా? ఏకంగా ఏడు లక్షల కోట్లు.. లక్ అంటే వాళ్లదే!

బ్యాంకులో క్యాష్ డిపాజిట్ చేస్తున్నారా?ఈ 4 రూల్స్ తెలియకపోతే..ఇబ్బందులు తప్పవు!

ముంచుకొస్తున్న నిరుద్యోగ ముప్పు.. రెండేళ్లలో శాశ్వతంగా ఉపాధికి దూరం.. ఏఐ పరిశోధకుడి సంచలన హెచ్చరిక!

నెలకు రూ. 10 వేలు పెడితే చాలు.. ఏకంగా రూ.55 లక్షలు మీ సొంతం, ఈ స్కీమ్ గురించి తెలుసా?

డీమార్ట్‌లో మాంసాహారం, కూరగాయలు, పెద్ద ఎలక్ట్రానిక్స్ ఎందుకు అమ్మరు? అసలు సీక్రెట్ తెలిస్తే షాకే!

పెళ్లి కోసం ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటున్నారా? ఈ 7 సందర్భాల్లో మాత్రం మీకే నష్టం

Big Stories

Advertisement
×