Brahmamudi serial today Episode: ప్రశాంత్ ను పిలిచి హైదరాబాద్ లో రుద్రాప్రతాప్ వేసే నగల బిడ్‌లో పాల్గొనాలని అది చాలా పెద్ద ప్రాజెక్ట్ అని ఎలాగైనా దాన్ని తామే దక్కించుకోవాలని చెప్తుంది ఇందు. ప్రశాంత్ చేసేద్దాం మేడం అంటాడు. రాజు ఏదో చెప్పి ప్రశాంత్‌ను బయటకు పంపిస్తే.. సిన్సియర్‌గా పని చేసే వాళ్లను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తుంది. ఈ డీల్ మనకు వస్తే మన కంపెనీ నెక్ట్స్ లెవెల్‌కు వెళ్తుంది. ప్రజెంట్ మనకు నడుస్తు్న్న వర్క్ షీట్ తీసుకురా ఎంత త్వరగా డెలివరీ ఇవ్వగలమో అంచనా వేసుకోవచ్చు అంటూ ఇందు చెప్పగానే.. అలాగే మేడం అంటూ రాజు వెళ్లిపోతాడు.
వెంకీ ఆఫీసుకు వచ్చి అటూ ఇటూ చూస్తుంటే.. రాజు వెళ్లి ఏంట్రా ఆలోచిస్తున్నావు అని అడిగితే.. నాన్నకు తెలిస్తే ఏంటా అని ఆలోచిస్తున్నాను అంటే.. ఇప్పుడు కూడా వెనక్కి వెళ్లి ఈ జాబ్ కూడా పోయింది అని చెప్తావా..? ఏంటి..? అయినా థాంక్స్‌రా మంచి నిర్ణయం తీసుకున్నావు అంటూ రాజు అంటే అప్పుడే వచ్చిన ఇందు అదేంటి చలపతి అంకుల్ ఒప్పుకున్నాడు అందుకు అంకుల్‌కు థాంక్స్ చెప్పాలి కదా..? వెంకీ ఒకసారి అంకుల్‌కు కాల్ చేసి ఇవ్వు అయనకు థాంక్స్ చెప్పాలి. మొన్న చేస్తే తాయన లిఫ్ట్ చేయలేదు అంటే రాజు కంగారు పడతాడు. ఇప్పుడు ఎందుకు డైరెక్టుగా వెళ్లి కలుద్దామని అంటాడు. తర్వాత ప్రశాంత్ ను పిలిచి వెంకీని పరిచయం చేస్తుంది.
ఐశ్వర్య తన ఆఫీసుకు వచ్చిన రఘువీర్‌ను ఎంప్లాయీస్ అందరికీ పరిచయం చేస్తుంది. ఈరోజు నుంచి నేను ఎంతో రఘువీర్ కూడా మీకు అంతే అంటూ చెప్తుంది. నేను పార్ట్ నర్ అయినా మేనేజ్‌మెంట్ మొత్తం చూసుకునేది ఐశ్వర్యనే మీరు ఏం రిపోర్ట్ చేయాలన్నా ఐశ్వర్యకే చేయాలని చెప్తాడు. అలాగే ఎంప్లాయీస్ కు రెండు నెలల బోనస్ ప్రకటిస్తాడు. ఎందుకంటే ఈరోజు మనం పెద్ద డీల్ చేయబోతున్నాము అంటూ రుద్రప్రతాప్ వేయబోయే బిడ్ గురించి చెప్తాడు. ఆ బిడ్ మనం చేజిక్కించుకుంటే మన పేరు సిటీ మొత్తం మారుమోగుతుంది అని చెప్తాడు. తర్వాత రుద్రప్రతాప్ ఆన్ లైన్ లోకి వచ్చి తనకు కావాల్సిన నగలు డీటెయిల్స్ చెప్తాడు.
అంతా విన్న ఐశ్వర్య మనం ఆ నగలు చేయగలమా అంటూ రఘువీర్‌తో అంటే చేయగలం మనం ఆ ఇందు కన్నా ముందే మన కొటేషన్ వాళ్ల ఇన్ బాక్స్‌లో ఉండాలి అని చెప్తాడు. పార్వతీశాన్ని కొటేషన్ రెడీ చేయించమని చెప్తుంది ఐశ్వర్య. ఇక ఇందు, రాజులు కూడా రుద్రప్రతాప్ కంపెనీ కోసం వేయాల్సిన కొటేషన్ గురించి ప్రశాంత్, వెంకీలతో కలిసి ఆలోచిస్తుంటారు. రాజు మాత్రం తన మనసులో రాత్రికి జరగబోయే శోభనం గురించి ఆలోచిస్తుంటాడు. గోల్డ్ కొనాలని ఇందు చెబితే.. అలాగే పూలు కూడా కొనాలని రాజు చెప్పగానే.. ఇందు, ప్రశాంత్, వెంకీ షాక్ అవుతారు. మరోవైపు ఐశ్వర్య కూడా నగలు ఎలా డిజైన్ చేయించాలి..? ఎవరితో చేయించాలి అని స్టాప్‌తో ఆలోచిస్తుంటుంది. ఇంతలో ఇవాళ్టీ బ్రహ్మముడి ఏపిసోడ్ అయిపోతుంది.
Image Credit BY: Jio Hotstar/ Star Maa