Bank cash deposit rules: ఇప్పుడు యూపీఐ, నెట్ బ్యాంకింగ్ యుగం నడుస్తున్నా..చేతికి క్యాష్ వచ్చినప్పుడు లేదా బిజినెస్, ఫ్యామిలీ అవసరాల కోసం బ్యాంకులో నగదు జమ చేయాల్సిన పరిస్థితి తరచూ వస్తూనే.. ఉంటుంది. అయితే.. బ్యాంకులో క్యాష్ వేసేటప్పుడు కొన్ని నియమాలు, పరిమితులు ఉంటాయని చాలా మంది పట్టించుకోరు. చిన్న చిన్న రూల్స్ మిస్ ..అయితే అనవసరమైన ఇబ్బందులు లేదా క్వశ్చన్స్ ఎదుర్కోవాల్సి రావచ్చు. మరి బ్యాంకులో.. డబ్బు జమ చేసేటప్పుడు తప్పకుండా తెలుసుకోవాల్సిన ఆ 4 ముఖ్యమైన నియమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
బ్యాంకులో ఒకే రోజులో.. రూ. 50,000 కంటే ఎక్కువ జమ చేయాలంటే పాన్ కార్డ్ వివరాలు ఇవ్వడం చాలా ముఖ్యం. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో.. లేదా బ్యాంకుల అంతర్గత నిబంధనల ప్రకారం.. ఒక ఆర్థిక సంవత్సరంలో నిర్ణీత పరిమితి దాటినప్పుడు కూడా పాన్ లేదా ఆధార్ వివరాలను అడుగుతూ ఉంటారు. పాన్ కార్డ్ లింక్ చేయని అకౌంట్లలో.. పెద్ద మొత్తంలో డబ్బు వేయడానికి ప్రయత్నిస్తే ట్రాన్సాక్షన్స్ ఆగిపోయే అవకాశం ఉంటుంది. అందుకే.. మీ బ్యాంక్ అకౌంట్‌కు పాన్ కార్డ్ ఎప్పటికప్పుడు లింక్ అయి ఉందో లేదో చెక్ చేసుకోవడం బెస్ట్.
చాలామంది అనుకునేది ఏంటంటే.. బ్యాంకులో మన డబ్బు వేయడానికి లిమిట్ ఏముంటుందిలే అని. కానీ ఆర్థిక నియమాల ప్రకారం, ఒక ఆర్థిక సంవత్సరంలో సేవింగ్స్ అకౌంట్లలో పెద్ద మొత్తంలో (సాధారణంగా రూ.10 లక్షల స్థాయి దాటినప్పుడు) డబ్బు జమ అయితే ఆ సమాచారం సంబంధిత అధికారులకు రిపోర్ట్ అవుతుంది. కరెంట్ అకౌంట్ల విషయంలో ఈ పరిమితి ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. దీని అర్థం డబ్బు వేయడం నేరం అని కాదు. కానీ ఆ డబ్బుకు సరైన సోర్స్ (ఆదాయ మార్గం లేదా పొదుపు వివరాలు) ఉండాలి. రేపు ఎప్పుడైనా ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని అడిగితే ..చూపించగలిగేలా క్లారిటీ ఉండాలి.
ఇప్పుడు ప్రతి బ్యాంకు కూడా నెల వారీ ఫ్రీ క్యాష్ డిపాజిట్ లిమిట్‌ను ఫిక్స్ చేస్తోంది. బ్రాంచ్‌లో అయినా, క్యాష్ డిపాజిట్ మెషీన్లో అయినా.. నిర్దేశించిన సంఖ్య కంటే ఎక్కువ సార్లు లేదా ఎక్కువ వేస్తే సర్వీస్ చార్జీలు లేదా జీఎస్టీ వర్తించే అవకాశం ఉంటుంది. అకౌంట్ టైప్ (బేసిక్ సేవింగ్స్, రెగ్యులర్ సేవింగ్స్, సాలరీ, కరెంట్ అకౌంట్) బట్టి ఈ రూల్స్ మారుతూ.. ఉంటాయి. అందుకే.. నెలలో ఎన్నిసార్లు, ఎంత మొత్తం ఫ్రీగా వేయొచ్చో మీ బ్యాంకు రూల్స్ తెలుసుకుని ప్లాన్ చేసుకోవడం బెస్ట్.
ఇది అత్యంత ప్రాక్టికల్‌గా ..అందరూ ఫాలో అవ్వాల్సిన విషయం. మీరు జమ చేసే.. డబ్బుకు సంబంధించిన ఆధారం మీ దగ్గర ఉండేలా చూసుకోవాలి. ఉదాహరణకు.. ఆస్తి, బంగారం అమ్మకం, కుటుంబ సభ్యుల నుంచి వచ్చిన బహుమతి, లేదా వ్యాపార లావాదేవీలు ఇలా ఏదైనా కావచ్చు. ఆ డబ్బుకు సంబంధించిన బిల్లులు, రసీదులు లేదా బ్యాంక్ స్టేట్మెంట్స్ వంటివి అందుబాటులో ఉంచుకుంటే.. భవిష్యత్తులో ఎలాంటి వివరణ అడిగినా ఈజీగా సమాధానం ఇవ్వొచ్చు. ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు కూడా ఈ లెక్కలు కరెక్ట్‌గా ఉంటే ఎలాంటి టెన్షన్ ఉండదు.
వీటితో పాటు క్యాష్ డిపాజిట్ మెషీన్లో.. డబ్బులు వేసేటప్పుడు నోట్లు చిరిగి ఉండకుండా, మడతలు లేకుండా చూసుకోవాలి. డిపాజిట్ చేసిన తర్వాత వచ్చే స్లిప్ లేదా మెసేజ్‌ను కన్ఫర్మ్ చేసుకోవడం ఎప్పుడూ మంచిది. బ్యాంకింగ్ రూల్స్ అప్డేట్స్ గురించి అప్రమత్తంగా ఉంటే మన డబ్బుకు, మన అకౌంట్‌కు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవచ్చు.
మొత్తంగా చూస్తే.. బ్యాంకులో డబ్బు జమ చేయడం సింపుల్ ప్రాసెస్ అయినా.. పాన్ రూల్స్, లిమిట్స్, చార్జీలు, డాక్యుమెంటేషన్.. వంటి 4 విషయాలపై అవగాహన ఉంటే పని ఈజీగా అయి పోతుంది.