E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode November 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌కు మనోహరి గురించి నిజం తెలిసిపోయిందా..?  

Nindu Noorella Saavasam Serial Today Episode November 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌కు మనోహరి గురించి నిజం తెలిసిపోయిందా..?  
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: మనోహరి మీద అనుమానం వచ్చిన అమర్‌, మిస్సమ్మ, రాథోడ్‌లను పిలిచి మనోహరికి ఏదైనా ప్రాబ్లమ్‌ ఉందా అని అడుగుతాడు. అందుకు మిస్సమ్మ నింపాదిగా ఉంది కదా అంటుంది. మిస్సమ్మ మాటలకు రాథోడ్‌ షాక్‌ అవుతాడు. అమర్‌ ఏం సమస్య ఉందని అడిగితే.. అదే పార్థు గారు లేరు కదా అంతకన్నా పెద్ద సమస్య ఉంటుందా..? చెప్పండి అంటూ కవర్‌ చేస్తుంది మిస్సమ్మ. మిస్సమ్మ కవర్‌ చేయడంతో రాథోడ్‌ ఊపిరి పీల్చుకుంటాడు.

పార్థు కాకుండా ఇంకా ఏదైనా సమస్య ఉందా అని అమర్‌ అడిగితే ఆవిడకు ఎలాంటి సమస్యలు ఉన్నాయో మనకు ఎలా తెలుస్తాయి సార్ అంటూ రాథోడ్ చెప్పగానే.. సరే రాథోడ్‌ బయటకు వెళ్లాలి అంటూ అమర్‌ చెప్పగానే.. కారు రెడీగా ఉంది సార్‌ అంటూ రాథోడ్ కీస్ చూపిస్తే.. నువ్వు కాదు నేను ఒక్కడినే వెళ్తాను.. అంటూ అమర్‌ కీస్‌ తీసుకుని వెళ్లిపోతాడు. మిస్సమ్మ అనుమానంగా ఏంటి రాథోడ్‌ ఆయన మనోహరి గురించి అడిగిత ఒక్కరే బయటకు వెళ్లిపోయారు. ఏదో సమ్‌థింగ్‌ రాథోడ్‌ అంటుంది. రాథోడ్‌ కూడా అవును మిస్సమ్మ ఏదో సమ్‌థింగ్‌ ఈజ్‌ ఫిష్‌ అంటాడు.

Advertisement

అమర్‌ కారులో వెళ్లిపోవడం టెర్రస్‌ సుంచి చూస్తుంది యాదమ్మ. వెంటనే పరుగెత్తుకుంటూ మనోహరి రూంలోకి వెళ్లి అమర్‌ వెళ్లిపోయిన విషయం మనోహరికి చెప్తుంది. మనోహరి వెంటనే అయితే మనం వెళ్దా పద చంభా అంటే.. నేను ఎక్కడికి రాను మనోహరి నేను వస్తే.. ఆ రాథోడ్‌, భాగీ నన్ను పోలీసుల్లా ప్రశ్నిస్తారు అంటుంది. వాళ్లకు నేను చెప్తాను కానీ రాథోడ్‌ అమర్‌తో వెళ్లలేదా..? అంటే లేదు అమరేంద్ర సార్‌ ఒక్కరే కారేసుకుని వెళ్లిపోయారు అని చంభా చెబితే.. అయితే అమర్‌ ఇంటికి రావడానికి చాలా టైం పట్టొచ్చు.. అర్థరాత్రి వరకు కూడా రాకపోవచ్చు.. ఈలోపు మనం వెళ్లి రావొచ్చు పదా అంటూ మనోహరి, చంభాను తీసుకుని వెళ్లిపోతుంది.

చంభా, మనోహరి బయటకు వెళ్తుంటూ కింద మాట్లాడుకుంటూ ఉన్న రాథోడ్‌, మిస్సమ్మ చూస్తారు. మిస్సమ్మ మనోహరి ఆగమని చెప్తుంది. దగ్గరకు వెళ్లి ఇద్దరూ కలిసి ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగితే.. బయటకు వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు…? ఎందుకు వెళ్తున్నారు అని అడగొద్దని తెలియదా భాగీ అంటూ మనోహరి కోప్పడుతుంది. దీంతో రాథోడ్‌ ఒహో మీరు ఎక్కడికి వెళ్తున్నారో అడగకూడని ఘనకార్యం చేస్తున్నారా..? అంటే.. మనోహరి కోపంగా రాథోడ్‌ను తిడుతుంది. నీ లిమిట్స్‌ లో నువ్వు ఉండు రాథోడ్‌ అంటుంది.

Advertisement

మిస్సమ్మ కోపంగా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో చెప్పకపోతే నేను నిన్ను వెళ్లనివ్వను మనోహరి అంటే మనోహరి కోపంగా నువ్వు నన్ను ఆపలేవు భాగీ.. అయినా నేను ఎక్కడికి వెళ్లేది మీకు చెప్పాలని రూలేం లేదు కదా అంటే.. మాకు చెప్పొద్దు కనీసం ఆయనకు చెప్పాలి కదా అంటే.. అమర్‌ కు చెప్పొచ్చు కానీ అమర్‌ ఇంట్లో లేడు కదా అంటూ మనోహరి చెబితే.. అయితే మీరు సార్‌ ఇంట్లో లేడని కన్ఫం చేసుకున్నాకే బయటకు వెళ్తున్నారన్నమాట అంటే.. మనోహరి మరోసారి కోపంగా రాథోడ్‌ను తిడుతూ డ్రైవర్‌ వు డ్రైవర్ లాగే ఉండు అంటూ చంభాను తీసుకుని మనోహరి వెళ్లిపోతుంది. ఇక వీధి చివరన అమర్ కారు చాటుగా పార్క్‌ చేసుకుని ఉంటాడు. మనోహరి, చంభా కలిసి కారులో వెళ్లడం గమనించి వాళ్ల కారు ఫాలో అవుతుంటాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Brahmamudi Serial Today Episode November 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రుద్రప్రతాప్ జువ్వెల్లరీ కోసం పోటీ పడుతున్న ఇందు, ఐవ్వర్య  

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మనోజ్.. రవికి బంఫర్ ఆఫర్.. ప్రభా ఫుల్ హ్యాపీ..

Intinti Ramayanam Today Episode: పల్లవి ఫుల్ హ్యాపీ.. శ్రీకర్ మాటతో షాక్.. పల్లవి ప్లాన్ సక్సెస్..?

Telugu TV Serials: సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. అస్సలు ఊహించని ట్విస్ట్..

Friday TV Movies : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

పదేళ్ల ప్రయాణంలో ఎన్నో కన్నీళ్లు.. మరెన్నో విజయాలు.. దీపిక ఎమోషనల్ జర్నీ!

సరిగమపలో పాటలతో అదరగొడుతున్న కీర్తన.. కష్టం తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!

Big Stories

Advertisement
×