మనకు కొంచెం బంగారం దొరికినా చెప్పలేనంత సంతోషంతో ఎగిరి గంతేస్తాం. కానీ, వాళ్లకు ఏకంగా బంగారు గనే దొరికింది. అంత పెద్ద బంగారు గని కలిగిన దేశం ఏమిటో తెలుసా? మరేదో కాదు మన పొరుగునే ఉన్న చైనా. అక్కడ భూగర్భంలో సుమారు వెయ్యి టన్నులకు పైగా బంగారం ఉందని అంచనా. దాని విలువ సుమారు 7.4 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. చైనా గానీ.. దాన్ని వెలికి తీస్తే.. బంగారం మార్కెట్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా?
చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లోని వాంగు గోల్డ్ పీల్డ్‌లో బయటపడింది. అక్కడ జరిపిన భూగర్భ పరిశోదనల్లో భూమి లోపల 40కి పైగా బంగారు ఖనిజ సిరలను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే దీన్ని 2024లోనే కనుగొన్నారు. మూడు వేల మీటర్ల లోతులో సుమారు వెయ్యి టన్నుల బంగారం ఉండవచ్చని అంచనా వేశారు. ఆ తర్వాత మరింత లోతుగా పరిశీలించి.. కొన్ని నిర్దిష్ట ప్రాంతాల్లో మాత్రమే తవ్వాలంటూ పరిమితులు విధించారు. దాని వల్ల అంచనా 151 మెట్రిక్ టన్నులకు తగ్గింది. అలాగని 2024లో అంచనాలు తప్పని కాదు. అంచనా సరైనదే. కానీ, తవ్వకాల పరిధే తక్కువ. పైగా ఈ గనిలో పనులు ప్రారంభించి, తవ్వకాలు మొదలుపెట్టేందుకు మరో ఐదేళ్లు పట్టవచ్చని అంచనా. 2032 నుంచి వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించాలనేది వారి టార్గెట్.
బంగారం గని అంటే.. మనం ఇప్పుడు చూస్తున్నట్లుగా మెరిసిపోతుందని అనుకుంటే పొరపాటే. అది కూడా మట్టే.. అదిలో అనే ఖనిజాలతో కలిసిపోయి ఉంటుంది. వాటి నుంచి బంగారాన్ని వేరు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం అక్కడ ఉన్న గనిలో ఒక టన్నుకు 4.64 గ్రాముల బంగారం ఉంటుంది. అలా అక్కడ వెయ్యి టన్నుల వరకు బంగారాన్ని ఉత్పత్తి చేయొచ్చు. ప్రస్తుతానికైతే 151 టన్నుల బంగారం వెలికి తీసేందుకు అనుమతులు లభించాయి.
అక్కడ తవ్వకాల్లో బయటపడిన మరో విశేషం ఏమిటంటే.. అక్కడ డ్రిల్లింగ్ ద్వారా సేకరించిన కొన్ని రాతి నమూనాల్లో బంగారం కంటికి కనిపించే స్థాయిలో ఉందంట. సుమారు 2 వేల మీటర్ల లోతులో సేకరించిన ఒక నమూనాలో ప్రతి టన్ను రాతిలో 138 గ్రాముల బంగారం ఉన్నట్లు గుర్తించారు. సాధారణంగా అనేక బంగారు గనుల్లో ఒక టన్ను ఖనిజం నుంచి చాలా తక్కువ బంగారం లభిస్తుంది. వాటితో పోల్చితే వాంగు ప్రాంతంలో లభించే ఖనిజంలో బంగారం చాలా ఎక్కువగా ఉంది. అయితే, ఇది నమూనా మాత్రమే. అక్కడే మిగతా చోట్ల తవ్వితే అదే స్థాయిలో బంగారం లభిస్తుందా లేదా అని చెప్పడం కష్టం.
అక్కడ పరిశోధనలు చేస్తున్న సమయంలో.. భూమిలో మరింత లోతుకు వెళ్తే ఇంకా బంగారం ఉండవచ్చని అంచనా వేశారు. త్రీడీ మోడలింగ్ పద్ధతిలో నిర్వహించిన పరిశోదనల్లో 3 వేల మీటర్ల లోతు వరకు వెళ్లి పరిశీలిస్తే.. వెయ్యి టన్నులకు పైగా బంగారం ఉండే అవకాశం ఉందన్నారు. పరిశోధనల్లో భాగంగా ఇక్కడ సుమారు 65 కిలోమీటర్ల లోతు వరకు డ్రిల్లింగ్ చేపట్టారట. కానీ, అంత లోతులోకి వెళ్లి బంగారం తవ్వడం.. దాన్ని సురక్షితంగా బయటకు తీసుకురావడం అనేది చాలా ఖర్చు, కష్టంతో కూడుకున్న అంశం.
వాంగు ప్రాంతంలో వెయ్యి టన్నులకు పైగా బంగారం అంచనా నిజమైతే.. అది ప్రపంచంలోని అది పెద్ద బంగారు నిక్షేపాల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. దక్షిణాఫ్రికాలోని సౌత్ డీప్ గోల్డ్ మైన్ ప్రపంచంలోనే భారీ బంగారం నిల్వలు కలిగిన గనుల్లో ఒకటిగా పేరొందింది. అక్కడ సుమారు 871 టన్నుల బంగారం నిల్వలు ఉన్నట్లు అంచనా.
అసలు ఈ బంగారం గనులు ఎలా ఏర్పడతాయనే సందేహం చాలామందిలో ఉంటుంది. ప్రస్తుతం వాంగు గోల్డెన్ ఫీల్డ్ ప్రాంతాన్నే పరిశీలిస్తే.. అది పురాతన భౌగోళిక పరిణామాలకు గురైన ప్రాంతం. అక్కడి భూమి లోపల జరిగిన టెక్టానిక్ కదలికల వల్ల రాళ్లలో పగుళ్లు ఏర్పడ్డాయి. ఈ పగుళ్ల ద్వారా వేడి ఖనిజ ద్రవాలు ప్రవహించాయి. వాటిలో ఉండే బంగారం వివిధ ఖనిజాలతో కలిసి క్వార్ట్జ్ సిరల్లో పేరుకుపోయింది. ఆ తర్వాత జరిగిన భౌగోళిక ప్రక్రియల వల్ల ఈ ప్రాంతంలో బంగారం నిక్షేపాలు ఏర్పడి ఉండవచ్చని పరిశోధకుల భావిస్తున్నారు.
బంగారం తవ్వకాలంటే అంత ఈజీ కాదు. కొన్ని కిలోమీటర్ల లోతు వరకు తవ్వకాలు జరపాలి. అంతకంటే లోతుగా తవ్వితే ప్రమాదం. అందుకే.. ప్రభుత్వం పరిమితి విధించించి. తాజా సమాచారం ప్రకారం.. 151 టన్నుల బంగారం వరకే తవ్వాలని పరిమితి విధించారు. అందులో 111.54 టన్నుల బంగారం మైనింగ్ హక్కులకు ఒక కంపెనీకి, మిగతా 39.50 టన్నులు తవ్వకం హక్కులకు వేరొక కంపెనీకి అప్పగించారు. ప్రాజెక్టులో భాగంగా కొత్త షాఫ్టులు, ఖనిజాలను ప్రాసెస్ చేసే మౌలిక సదుపాయాలను చేపట్టాలి. వాస్తవానికి ప్రపంచంలో అత్యధిక బంగారాన్ని ఉత్పత్తి చేసే దేశాల్లో చైనా కూడా ఒకటి. అయితే, ఆ దేశంలో ఉన్న డిమాండ్ వల్ల ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవల్సి వస్తోంది. అందుకే, చైనా తమ అధికారిక బంగారు గనుల నిల్వలను పెంచుకొనే ప్రయత్నం చేస్తోంది.
Also Read: మహానది కోల్‌ఫీల్డ్స్ ఐపీఓ ప్రారంభం.. పెట్టుబడుదారులకు పండగే, ఇష్యూ ప్రైస్తోపాటు జీఎంపీ