Fintech Unicorn Razorpay: పెర్పార్మెన్స్ బాగుంటే ఏడాది చివరలో ఉద్యోగులకు గిఫ్ట్‌లు ఇస్తుంటాయి కొన్ని కంపెనీలు. దీపావళి సందర్భంగా చెన్నైలోని ఓ కంపెనీ ఉద్యోగులకు కారులు ఇచ్చింది. కంపెనీ స్థాయికి తగ్గట్టుగా బహుమానం ఇస్తుంటాయి. ఈ విషయంలో ఒక్కో కంపెనీది ఒక్కో స్టయిల్.
రీసెంట్‌గా ఫిన్‌టెక్ యూనికార్న్ రేజర్ పే లో పని చేస్తున్న ఉద్యోగులకు బంపరాఫర్ ఇచ్చింది ఆ కంపెనీ. పని చేస్తున్న 3000 సిబ్బందికి లక్ష విలువ చేసే ఎంప్లాయిస్ స్టాక్ ఆప్షన్ ఇచ్చింది. రేజర్ పే ఈ స్థాయిలో స్టాక్ ఆప్షన్ అందించడం ఇదే తొలిసారి.
పనితీరు ఆధారంగా ఎంపిక చేసిన ఉద్యోగులకు గతంలో ఈ తరహా ఆప్షన్ ఇచ్చామంటోంది ఆ కంపెనీ. మొత్తం సిబ్బందికి స్టాక్ ఆప్షన్ ఇస్తున్నట్లు వెల్లడించింది. ఈ లెక్కన కంపెనీలో వారే ఓనర్లు. గతంలో రేజర్ పేకి సంబంధించి స్టాక్ ఆప్షన్లు అందుకున్న ఉద్యోగులు పలుసార్లు బౌ బ్యాక్ ద్వారా ఈ ప్రయోజనం పొందారు.
ఈ విధంగా ఆరేళ్ల కిందట ఈ కంపెనీ ప్రారంభించింది. అప్పుడు కేవలం 140 మందికి మాత్రమే ఇచ్చింది. 2019లో 400 మంది, 2021లో 750 మంది ఉద్యోగులు ప్రయోజనం పొందారు. 2022లో దాదాపు 650 మంది ఈ ప్రయోజనం పొందినవారిలో ఉన్నారు. మాజీ ఉద్యోగులు సైతం ఇందులో ఉన్నారు.
ALSO READ: ప్రీమియం ప్లస్ ప్లాన్ సబ్‌స్క్రైబర్లకు షాకిచ్చిన ఎక్స్.. మస్క్ అంటేనే పక్కా కమర్షియల్ మరి!
రేజర్ పే సహ వ్యవస్థాపకుడు, సీఈఓ హర్షిల్ మాథుర్ మాట్లాడుతూ, కంపెనీ విజయం వెనుక ఉద్యోగులదే కీలకపాత్ర అని చెప్పారు. కంపెనీ ఇంత పెద్ద స్థాయిలో ఇలాంటి చొరవ తీసుకోవడం అసాధారణమన్నారు. మొత్తానికి ఈ కంపెనీ ఉద్యోగుల పంట పడిందనే చెప్పవచ్చు. ఈ తరహా కాన్సెప్ట్ దేశంలో చాలా కంపెనీలు అమలు చేస్తున్న విషయం తెల్సిందే.