IND vs AUS 4th Test Day 1: బోర్డర్ గవాస్కర్ టోర్నమెంట్ 2024 టోర్నమెంట్ లో ( Border-Gavaskar Trophy 2024/25 ) భాగంగా ఇవాళ బాక్సింగ్ డే టెస్టు ( Boxing Test ) ప్రారంభం కావడం జరిగింది. అయితే.. ఈ బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్ లో ఆస్ట్రేలియా ( Australia ) దుమ్ములేపింది. బాక్సింగ్ డే టెస్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 300 కు పైగా పరుగులు చేసింది ఆస్ట్రేలియా. 86 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోరు 311/6 గా నమోదు కావడం జరిగింది.
Also Read: Virat Kohli – sam Konstas: 19 ఏళ్ల కుర్రాడితో గొడవ.. విరాట్ కోహ్లీపై నిషేధం ?
ఇక బాక్సింగ్ డే టెస్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి క్రీజ్‌లో స్టీవ్ స్మిత్ 68 పరుగులు చేసి… బ్యాటింగ్ చేస్తున్నారు. అటు ప్యాట్ కమిన్స్ 8 పరుగులు చేశారు. రేపు ఉదయం 5 గంటల సమయంలోనే రెండో రోజు బాక్సింగ్ డే టెస్టు ప్రారంభం కానుంది. ఇక ఆస్ట్రేలియా బ్యాటర్లలోనే… ఓపెనర్ సామ్ కాన్‌స్టాస్ ( Sam Konstas ) 60 పరుగులు చేసి రాణించాడు. మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా 57 పరుగులు చేశాడు. మార్నస్ లబుషేన్ 72 పరుగులు చేసి… రాణించారు.
ఇలా బాక్సింగ్ డే టెస్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఓపెనర్ సామ్ కాన్‌స్టాస్ ( Sam Konstas ) , ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకుని ఔట్ అయ్యారు. భారత బౌలర్లలో బుమ్రాకు 3 వికెట్స్ పడ్డాయి. టీమిండియా ( Team India) స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, ఆకాశ్ దీప్, వాషింగ్టన్ సుందర్‌కు తలో వికెట్ పడగొట్టారు. ఈ తరుణంలోనే… బాక్సింగ్ డే టెస్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 300 కు పైగా పరుగులు చేసింది ఆస్ట్రేలియా జట్టు.
Also Read: Sam Konstas: బుమ్రా బౌలింగ్ లో తొలి సిక్స్ కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు…చరిత్రలో తొలిసారి!
ఇది ఇలా ఉండగా…ఇవాళ బాక్సింగ్ డే టెస్టు ( Boxing Test ) ప్రారంభం అయిన తరుణంలో…. విరాట్ కోహ్లీ సహనం కోల్పోయాడు. తొలి టెస్ట్ ఆడుతున్న 19 ఏళ్ల సామ్ కాన్‌స్టాస్ ( Sam Konstas ) ను విరాట్ కోహ్లీ తన భుజంతో ఢీ కొట్టిన సంగతి తెలిసిందే. అయితే…. కాన్ స్టాప్ ను విరాట్ కోహ్లీ తన భుజంతో ఢీ కొట్టడాన్ని పలువురు తప్పు పడుతున్నారు సీనియర్ క్రికెటర్లు. మాటల వరకు ఏమీ పరవాలేదు కానీ ఇలా వ్యవహరించడం సరికాదు అంటూ గవాస్కర్ వెల్లడించారు.
కుర్ర క్రికెటర్ సామ్ కాన్‌స్టాస్ ( Sam Konstas ) ఆట విరాట్ కోహ్లీని కలవర పెడుతుందని మైకేల్ వాన్ ( Michael Vaughan ) అన్నారు. ఇలాంటి ప్రవర్తన కోహ్లీ స్థాయి ఆటగాడికి తగదు అంటూ అలిసా హిలీ విమర్శిస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ “చోక్లీ” ( Chokli ) పదాన్ని వైరల్ చేస్తున్నారు. ఇక దీనిపై ఐసీసీ వెంటనే స్పందించాలని.. విరాట్ కోహ్లీపై ( Virat Kohli ) బ్యాన్ విధించాలని కొంత మంది ఆస్ట్రేలియా మాజీలు డిమాండ్ చేస్తున్నారు.