Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ త్వరలోనే రాబోతోంది. కొత్త పోస్టర్‌లో స్పష్టంగా “కమింగ్ సూన్” అని హైలైట్ చేస్తూ, ఈ సేల్ ప్రత్యేకంగా దసరా–దీపావళి సీజన్ కోసం ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ చివర్లో లేదా అక్టోబర్ ప్రారంభంలో జరిగే ఈ సేల్, దీపావళికి ముందువరకూ కొనసాగుతుంది. ఈ సారి కూడా అదే పండుగల సీజన్‌లో భారీ తగ్గింపులు, బ్యాంక్ ఆఫర్లు, ఫ్లాష్ డీల్స్ ఉంటాయని ముందుగానే సూచిస్తోంది.
మొబైల్ ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ వాచీలు, గృహోపకరణాలు, ఫ్యాషన్, బ్యూటీ వరకు దాదాపు అన్నింటిపైనా పెద్ద తగ్గింపులు ఉండనున్నాయి. అలాగే ఆక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌లపై తక్షణ తగ్గింపు సూచనలు ఉన్నాయి. కానీ ఈ ఆఫర్లకు గడువు, కనీస కొనుగోలు పరిమితి, గరిష్ట తగ్గింపు పరిమితి వంటి షరతులు తప్పనిసరిగా ఉంటాయి. కాబట్టి ముందే రూల్స్ చదవడం ముఖ్యం.
ఎలా సిద్ధం కావాలి ?
ముందుగా, కొనాలనుకుంటున్న ఉత్పత్తులను విష్‌లిస్ట్‌లో వేసుకోండి. ఎందుకంటే సేల్ మొదలయ్యాక ధరల మార్పులు నిమిషాల్లోనే జరుగుతాయి. ముందే రివ్యూలు, ఫోటోలు, వీడియోలు చూసి క్లారిటీ తెచ్చుకోండి. ధర పోలిక తప్పనిసరి. సేల్ ముందు, సేల్ రోజున ధరలు ఎలా ఉన్నాయో గమనిస్తే నిజమైన తగ్గింపును గుర్తించగలుగుతారు.
Also Read: Ghaati Censor Report: అనుష్క ‘ఘాటీ’కి సెన్సార్ కట్స్.. ఆ సీన్లపై కోత.. మొత్తం మూవీ నిడివి ఎంతంటే!
బ్యాంక్ ఆఫర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 10 శాతం తగ్గింపు అనుకున్నంత సులభం కాదు. కనీస బిల్లు, గరిష్ట తగ్గింపు పరిమితి, ఆఫర్ ఎన్ని సార్లు వాడుకోవచ్చో తెలుసుకోవాలి. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఈఎంఐ ఆఫర్ల షరతులు వేర్వేరు కావచ్చు. ముఖ్యంగా ఈఎంఐలో వడ్డీ ఖర్చును కూడా లెక్కలోకి తీసుకోవాలి.
ఒకటికి రెండు సార్లు పరిశీలించండి
ఎక్స్చేంజ్ ఆఫర్ తీసుకుంటే పాత ఫోన్ లేదా పరికరం బాగా ఉండాలి. స్క్రీన్ లేదా ఏదైనా డ్యామేజ్ ఉంటే దాని విలువ తగ్గిపోయే ఛాన్స్ ఉంటాయి. పాత పరికరాన్ని ముందే శుభ్రం చేసి, బిల్, ఛార్జర్ సిద్ధంగా ఉంచితే డెలివరీ రోజున సమస్యలు రాకుండా ఉంటుంది. రిటర్న్, వారంటీ పాలసీలను ముందే చదవండి. చిన్న ఫ్యాషన్ ఐటెమ్స్ సైజ్ సరిపోకపోతే రిటర్న్ ఎలా ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ వస్తువులకు ఎన్ని రోజులు రిటర్న్ విండో ఉందో ముందుగానే తెలుసుకోవాలి. కొన్ని ప్రోడక్ట్స్‌కు ‘ఓపెన్ బాక్స్ డెలివరీ’ ఆప్షన్ ఉంటే, డెలివరీ బాయ్ ముందు ప్యాక్ తెరిచి పరికరం ఆన్ చేసి చూపిస్తాడు, ఇది ఉంటే తప్పక ఎంచుకోండి. డెలివరీ సమయంలో వీడియో తీయడం కూడా మంచిది.
మొత్తం చూస్తే ఈ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో నిజమైన లాభం ముందుగానే ప్లాన్ చేసుకోవడంలోనే ఉంది. విష్‌లిస్ట్ రెడీ చేసుకోండి, ధరలు పోల్చండి, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్చేంజ్, రిటర్న్ పాలసీలను స్పష్టంగా చూసుకోండి. అప్పుడు సేల్ మొదలైన వెంటనే ఒక్క క్లిక్‌తోనే ఉత్తమ డీల్ మీ కార్ట్‌లో పడుతుంది. ఆకర్షణీయమైన ప్రకటనలు చాలానే వస్తాయి, కానీ తెలివైన ప్లాన్ చేస్తేనే నిజమైన సేవింగ్ మీ చేతిలో మిగులుతుంది.