Shubman Gill: టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప. శుభ్‌మన్ గిల్ కు ఏమాత్రం టాలెంట్ లేదని….మార్కెటింగ్ కోసమే టీమిండియాలోకి తీసుకున్నారని రాబిన్ ఉతప్ప బాంబు పేల్చారు. ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో టీమిండియా జట్టులోకి శుభ్‌మన్ గిల్ రావడం పట్ల రాబిన్ ఉతప్ప తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అతనికి ప్రతిభ ఏమాత్రం లేదని…. కేవలం మార్కెటింగ్ కోసం మాత్రమే భారత క్రికెట్ నియంత్రణ మండలి అతని తీసుకున్నట్లు వ్యాఖ్యానించారు. అతని స్థానంలో టాలెంట్ ఉన్న శ్రేయాస్ అయ్యర్ లాంటి ప్లేయర్లు తీసుకుంటే బాగుండేదని వ్యాఖ్యానించారు. దీంతో రాబిన్ ఉతప్ప చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి.
మరో ఏడు రోజుల్లోనే ఆసియా కప్ 2025 టోర్నమెంట్
ఆసియా కప్ 2025 టోర్నమెంటు మరో ఏడు రోజుల్లో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అంటే సెప్టెంబర్ 9వ తేదీ నుంచి సెప్టెంబర్ 28వ తేదీ వరకు ఆసియా కప్ 2025 టోర్నమెంట్ కొనసాగనుంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ కూడా ఫిక్సయిన సంగతి తెలిసిందే. ఇక సెప్టెంబర్ 14వ తేదీన టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఈ టోర్నమెంట్ లో భాగంగా మ్యాచ్ కూడా జరగనుంది. ఆసియా కప్ 2025 టోర్నమెంట్ దుబాయ్ లో నిర్వహిస్తున్నారు. రాత్రి 8 గంటలకు… ఈ మ్యాచులు ప్రారంభమవుతాయి. దుబాయిలో విపరీతంగా ఎండలు ఉన్న నేపథ్యంలోనే… సాయంత్రం సమయంలో మ్యాచ్లు నిర్వహిస్తున్నారు.
సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీ లో టీమిండియా
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ మరో ఏడు రోజుల్లో ప్రారంభం కానుంది. అయితే ఇప్పటికే టీం ఇండియా జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించింది. ఆగస్టు 19వ తేదీన ముందుగా చెప్పిన విధంగానే భారత క్రికెట్ జట్టును ప్రకటించింది బీసీసీఐ పాలకమండలి. ఈ జట్టులో సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్గా వ్యవహరించనున్నారు. గిల్ వైస్ కెప్టెన్ గా కొనసాగుతారు. అయితే ఈ జట్టులో శ్రేయస్ అయ్యర్ కు ఛాన్స్ దక్కలేదు. అటు మహమ్మద్ సిరాజుకు కూడా అవకాశం ఇవ్వలేదు భారత క్రికెట్ నియంత్రణ మండలి. కె ఎల్ రాహుల్ లాంటి కీలక ప్లేయర్ ను కూడా పక్కన పెట్టింది. హర్షిత్ రానకు మాత్రం అవకాశం ఇచ్చారు.
ఇలాంటి నేపథ్యంలో గిల్ ను ఎందుకు సెలెక్ట్ చేశారని రాబిన్ ఉతప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. టాలెంట్ ఉన్న ప్లేయర్ ను సెలెక్ట్ చేయాల్సి ఉందని.. కానీ మార్కెటింగ్ కోసం గిల్ ను ఎంపిక చేసారని ఫైర్ అయ్యారు. గిల్ స్థానంలో యశస్వి జైస్వాల్ లేదా శ్రేయాస్ అయ్యర్ ను తీసుకుంటే బాగుండేదని ఊ తప్ప వెల్లడించారు.
Also Read: Mitchell Starc Retirement: ఆస్ట్రేలియాకు ఎదురు దెబ్బ… డేంజర్ బౌలర్ మిచెల్ స్టార్క్ రిటైర్మెంట్
Robin Uthappa has shared a different perspective on Shubman Gill’s selection for the upcoming Asia Cup 2025 👀#AsiaCup2025 #ShubmanGill #BCCI #CricketTwitter pic.twitter.com/FoGZuEF7tG
— InsideSport (@InsideSportIND) September 2, 2025