OG Glimpse: టాలీవుడ్ స్టార్ హీరో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తన పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆయన నటించిన సినిమాల నుంచి వరుస అప్డేట్స్ విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్(Sujeeth) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ఓజీ(OG). ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి గ్లింప్స్ వీడియో విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఈ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్ ఉంది. అయితే ఈ వీడియో పై కొంతమంది అభిమానులు విభిన్న రీతిలో రియాక్టర్ కామెంట్లు చేస్తున్నారు.
బర్తడే గ్లింప్ ఎవరిదయ్యా?
తాజాగా విడుదల చేసిన ఈ వీడియో 1:05 సెకండ్ల నిడివి కలిగి ఉంది. అయితే ఇందులో హీరో పవన్ కళ్యాణ్ కంటే కూడా ఎక్కువగా విలన్ పాత్రకే స్పేస్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేయడమే కాకుండా దర్శకుడు సుజిత్ పై విమర్శలు కురిపిస్తున్నారు. అసలు పుట్టినరోజు హీరోదని ఈ గ్లింప్ విడుదల చేసావా? లేదంటే విలన్ కోసం ఈ గ్లింప్ రిలీజ్ చేసావా? సుజీత్ ఏందయ్యా ఇది అంటూ ఈ వీడియో పై కామెంట్లు చేస్తున్నారు.. ఇక ఈ గ్లింప్ వీడియోలో భాగంగా విలన్ ఇమ్రాన్ హష్మీ(Imran Hashmi)ను ఎంతో హైలెట్ చేయటంతో ఈ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
డియర్ ఓజీ…
ఈ గింప్ వీడియో మొదలవగానే “డియర్ ఓజీ.. నిన్ను కలవాలని.. నిన్ను చంపాలని ఆశగా ఎదురు చూస్తున్న నీ ఓమీ అంటూ విలన్ చేత ప్రభాస్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ గ్లింప్ వీడియోని విడుదల చేశారు. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రియాంక ఆరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించగా, శ్రేయ రెడ్డి, అర్జున్ దాస్ వంటి తదితరులు కీలకపాత్రలలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాపై అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారని చెప్పాలి. ఇక దర్శకుడు సాహో సినిమా తర్వాత ఓజీ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి.
పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత హరిహర వీరమల్లు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ప్రేక్షకులను కాస్త నిరాశపరిచిందని చెప్పాలి. వీరమల్లు తర్వాత ఓజీ సినిమా రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీ భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కూడా ఉండబోతుందని ఈ స్పెషల్ సాంగ్ లో టిల్లు బ్యూటీ నేహా శెట్టి పవన్ కళ్యాణ్ తో కలిసి స్పెషల్ స్టెప్పులు వేయబోతున్నారని తెలుస్తోంది. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ అభిమానులు ఓజీ సినిమా పై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. మరి ప్రేక్షకుల అంచనాలకు అనుగుణంగా ఈ ఉంటుందా లేదా అనేది తెలియాల్సింది.
Also Read: Anushka Shetty: డాక్యుమెంటరీగా బాహుబలి.. కన్ఫర్మ్ చేసిన స్వీటీ!