Dabur Ghee Honey Ban| భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (FSSAI) దేశంలో ప్రముఖ ఎఫ్ఎంసీజీ డాబర్ కంపెనీకి చెందిన కొన్ని ఆహార ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేసింది. ఈ జాబితాలో తేనె, ఆవు నెయ్యి, ఇతర ప్యాకేజ్డ్ ఆహార ఉత్పత్తులు ఉన్నాయి. ఈ ఉత్పత్తులపై “100 శాతం ప్యూర్”, “100 శాతం నేచురల్” వంటి ప్రకటనలు కనిపించాయి.
ఈ ప్రకటనలు వినియోగదారులను తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని ఎఫ్ఎస్ఎస్ఐ తెలిపింది. ఆగస్టు 3న ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. అలాగే డాబర్ 15 రోజుల్లో తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
డాబర్ అధికారిక వెబ్‌సైట్ పరిశీలించినప్పుడు పలు ఉత్పత్తులపై అనుమానాస్పద ప్రకటనలు కనిపించాయని ఎఫ్ఎస్ఎస్ఐ ల్లడించింది.
కొన్ని ఉత్పత్తులపై “100 శాతం ప్యూర్”, “100 శాతం నేచురల్”, “100 శాతం ప్యూరిటీ గ్యారంటీ”, “100 శాతం ఆర్గానిక్,” “100 శాతం టెండర్ కోకోనట్ వాటర్” వంటి పదాలను ఉపయోగించారు.
ఎఫ్ఎస్ఎస్ఐ ప్రకారం ఈ ప్రకటనలు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ (అడ్వర్టైజింగ్ అండ్ క్లెయిమ్స్) రెగ్యులేషన్స్ – 2018 నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి. ఈ పదాలకు స్పష్టమైన నిర్వచనం లేకపోవడంతో వినియోగదారులు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది.
ఎఫ్ఎస్ఎస్ఐ తన పరిశీలనలో మరికొన్ని నిబంధనల ఉల్లంఘనలను కూడా గుర్తించింది. డాబర్ హిమాలయన్ ఆర్గానిక్ ఆపిల్ సైడర్ వెనిగర్, డాబర్ ఆర్గానిక్ హనీ ఉత్పత్తులపై సరైన ఆర్గానిక్ అనుమతి లేకుండానే “జైవిక్ భారత్” లోగోను ఉపయోగించినట్లు తెలిపింది.
అలాగే డాబర్ హోమ్‌మేడ్ కొబ్బరి పాలపై “100 శాతం ప్యూరిటీ” అనే ప్రకటన ఉపయోగించారు. అయితే మిశ్రమ ఆహార ఉత్పత్తులపై ఇలాంటి ప్రకటనలకు నిబంధనలు అనుమతి లేదని ఎఫ్ఎస్ఎస్ఐ స్పష్టం చేసింది.
ఈ తరహా “100 శాతం” ప్రకటనలను వెంటనే నిలిపివేయాలని గతంలోనే డాబర్‌కు నోటీసు ఇచ్చినట్లు ఎఫ్ఎస్ఎస్ఐ తెలిపింది. అయితే కంపెనీ తగిన మార్పులు చేయలేదని సంస్థ పేర్కొంది. దీంతో విక్రయాలపై నిషేధ ఉత్తర్వులు జారీ చేయాల్సి వచ్చిందని వెల్లడించింది. ప్రస్తుతం డాబర్ 15 రోజుల్లో తీసుకున్న చర్యల వివరాలను సమర్పించాల్సి ఉంటుంది.
ఎఫ్ఎస్ఎస్ఐ ప్రకారం “100%” అనే పదానికి చట్టపరంగా నిర్దిష్ట నిర్వచనం లేదు. అందువల్ల “100 శాతం ప్యూర్”, “100 శాతం నేచురల్ “, “100% ఆర్గానిక్ ” వంటి ప్రకటనలు చేయాలంటే సైంటిఫిక్ ఆధారాలు ఉండాలి. ప్రతి ఆహార ఉత్పత్తిపై చేసే ప్రకటన నిజమైనది, స్పష్టమైనది, శాస్త్రీయంగా నిరూపించబడినదిగా ఉండాలి.
నిబంధనలు ఉల్లంఘించిన కంపెనీలకు నోటీసులు జారీ చేయడం, లేబుళ్లు మార్చాలని ఆదేశించడం, విక్రయాలు నిలిపివేయడం వంటి చర్యలు తీసుకునే అధికారం ఎఫ్ఎస్ఎస్ఐకి ఉంది.
Also Read: ఆర్భాటాలు లేకుండా ఉండలేరు.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎప్పుడూ ‘షో ఆఫ్’ చేస్తుంటారు
2024లో పతంజలి ఆరోగ్య ప్రకటనలపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అనంతరం కంపెనీ బహిరంగ క్షమాపణ చెప్పి కొన్ని ప్రకటనలను ఉపసంహరించుకుంది.
అదే ఏడాది “హెల్త్ డ్రింక్” అనే పేరుకు చట్టబద్ధమైన ఆహార వర్గీకరణ లేదని ఎఫ్ఎస్ఎస్ఐ స్పష్టం చేసింది. దీంతో ఈ కామర్స్ సంస్థలు ఆ కేటగిరీని తొలగించి ఉత్పత్తులను సరైన విభాగాల్లో చూపించడం ప్రారంభించాయి.
Also Read: ఐఐటీ డిగ్రీ లేకుండానే నెలకు రూ.5 లక్షల ఆదాయం? బీటెక్ డ్రాప్‌అవుట్ సంపాదన ఎలాగంటే
ఏ ఉత్పత్తిని కొనుగోలు చేసే ముందు దాని లేబుల్‌ను జాగ్రత్తగా పరిశీలించాలి. ప్రకటనల కంటే అధికారిక ధృవీకరణలు, శాస్త్రీయ ఆధారాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.