E-Paper
Advertisement

చెక్‌పై చివరన ‘ఓన్లీ’ (Only) ఎందుకు? ఇది RBI రూలా? లేక జస్ట్ అలవాటా?

చెక్‌పై చివరన ‘ఓన్లీ’ (Only) ఎందుకు? ఇది RBI రూలా? లేక జస్ట్ అలవాటా?
Advertisement

Cheque Writing: సాధారణంగా ఎవరికైనా చెక్ రాసి ఇచ్చేటప్పుడు నగదు మొత్తాన్ని అక్షరాల్లో రాసిన తర్వాత చివరన ‘Only’ అని చేరుస్తుంటారు. ఉదాహరణకు రూ. 5,000 కు చెక్ ఇస్తే ‘ఫైవ్ థౌజండ్ ఓన్లీ’ (Five Thousand Only) అని రాస్తుంటాం. అయితే ఇలా రాయడం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? ఇది బ్యాంకింగ్ నిబంధనా? లేక కాలానుగుణంగా వస్తోన్న అలవాటా? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

‘Only’కి ప్రధాన కారణం ఇదే

చెక్ పై అక్షరాల్లో మొత్తాన్ని రాసిన తర్వాత ‘Only’ అని చేర్చడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం భద్రతే. ఒకవేళ మీరు కేవలం ‘Five Thousand’ అని రాసి పక్కన ఖాళీ స్థలాన్ని వదిలేస్తే, వేరొకరు ఆ ఖాళీలో మరికొన్ని పదాలు చేర్చి ఆ మొత్తాన్ని మార్చే ప్రమాదం ఉంది. అక్షరాల చివర ‘Only’ అని రాయడం వల్ల ఆ మొత్తం అక్కడితో పూర్తయిందని స్పష్టమవుతుంది. దీనివల్ల మోసగాళ్లు ఆ మొత్తాన్ని పెంచడానికి అవకాశం ఉండదు. అందుకే బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి బ్యాంకులు కూడా చివరన తప్పనిసరిగా ‘Only’ అని ముగించాలని తమ వినియోగదారులకు సూచిస్తున్నాయి.

నిబంధనలు ఏం చెబుతున్నాయి?

Advertisement

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూల్స్ ప్రకారం.. చెక్ నింపేటప్పుడు చివరన ‘Only’ అని రాయడం తప్పనిసరి ఏం కాదు. అయితే యాక్సిస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ వంటి ప్రముఖ బ్యాంకులు.. చెక్ దుర్వినియోగం కాకుండా ఉండేందుకు ఈ పద్ధతిని తప్పనిసరిగా పాటించాలని తమ కస్టమర్లకు సూచించాయి. ఇది టెక్నికల్ గా చట్టబద్ధమైన నిబంధన కాకపోయినప్పటికీ బ్యాంకింగ్ రంగంలో ఒక ముందస్తు జాగ్రత్తగా ‘Only’ కొనసాగుతూ వస్తుండటం విశేషం.

అంకెలను అక్షరాల్లో ఎందుకు రాయాలి?

బ్యాంక్ చెక్ మీద మొత్తాన్ని అటు అంకెల్లో (Figures) ఇటు అక్షరాల్లో (Words) రెండింటిలోనూ నగదు విలువను తప్పనిసరిగా రాస్తుంటారు. ఇలా రెండు రకాలుగా రాయడం వల్ల బ్యాంక్ సిబ్బందికి ఆ మొత్తాన్ని ధృవీకరించడం సులభమవుతుంది. అలాగే ప్రాసెసింగ్ సమయంలో ఎలాంటి తప్పులు లేదా గందరగోళం జరగకుండా ఉంటుంది.

Advertisement

Also Read: సముద్రంపైనే అద్భుత వ్యవసాయం.. ఉప్పు నీటితో కూరగాయల సాగు.. అదరగొట్టేశారు కదయ్యా!

చెక్ విషయంలో జాగ్రత్తలు

చెక్ నింపేటప్పుడు అనవసరమైన ఖాళీ ప్రదేశాలను వదలకుండా రాయడం మంచిదని బ్యాంకింగ్ వర్గాలు సూచిస్తున్నాయి. పేరు, తేదీ, మొత్తం వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలని హితవు పలుకుతున్నారు. అలాగే అంకెల్లో ఉన్న మొత్తం, అక్షరాల్లో ఉన్న మొత్తంతో మ్యాచ్ అవ్వాలి. చెక్ పైన దిద్దడం, కొట్టివేతలు అస్సలు చేయకూడదు. సరిగ్గా నింపిన చెక్ క్లియరెన్స్ త్వరగా అవ్వడమే కాకుండా దుర్వినియోగానికి గురికాకుండా ఉంటుంది.

Also Read: జియో మైండ్ బ్లోయింగ్ ప్లాన్స్.. రూ. 500 లోపే 15 ఓటీటీలు.. ఉచిత AI, క్లౌడ్ స్టోరేజ్!

Tags

Related News

బాంబు పేల్చిన పెట్రోల్ బంక్ డీలర్లు.. యూపీఐ చెల్లింపులు నిలిపివేత.. ఆ తేదీ నుంచి క్యాష్ తప్పనిసరి!

ప్రతి ఐఫోన్ విక్రయంతో శామ్‌సంగ్‌కు రూ.24,000 లాభం.. ఎలాగంటే?

ఐస్ క్రీమ్ రంగంలోకి రిలయన్స్.. అమూల్ పని అయిపోయినట్లేనా? అంబానీ అసలు వ్యూహం ఏంటి?

వొడాఫోన్ సూపర్ ప్లాన్.. అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్.. ఎంత డేటా వినియోగించినా ఎక్స్‌ట్రా ఖర్చు అసలు ఉండదు

“యుపిఐ బ్యాన్, క్యాష్ మాత్రమే”.. ఢిల్లీ, ఎంపీ షాపులు, పెట్రోల్ పంప్స్‌లో వ్యాపారుల నిర్ణయం

మానవాళికి పెను ప్రమాదం పొంచి ఉందా? 90 వేల కోట్ల ఏఐ ఏజెంట్లు ప్రపంచ జనాభా కంటే ఎక్కువ..

రోజుకు రూ.50 పొదుపుతో.. ఏకంగా రూ.14 లక్షల ఆదాయం.. ఏం చేయకుండానే సంపాదించొచ్చు!

Big Stories

Advertisement
×