E-Paper
Advertisement

షావోమి నుంచి బిగ్ అప్‌డేట్.. ఒకేసారి మార్కెట్లోకి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లు, ఫుల్ డీటైల్స్ ఇవే!

షావోమి నుంచి బిగ్ అప్‌డేట్.. ఒకేసారి మార్కెట్లోకి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లు, ఫుల్ డీటైల్స్ ఇవే!
Advertisement

Upcoming Smartphones 2026: షావోమి నుంచి త్వరలోనే మార్కెట్లోకి రాబోతున్న రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు ప్రస్తుతం టెక్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. POCO C95 Pro 4G, Redmi Note 17 Pro 5G ఫోన్‌లు థాయ్‌లాండ్‌కు చెందిన NBTC సర్టిఫికేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్నాయి. దీంతో ఈ ఫోన్‌ల గ్లోబల్ లాంచ్ ఎంతో దూరంలో లేదని స్పష్టమవుతోంది.

రీబ్రాండెడ్ వెర్షన్‌గా పోకో ఫోన్:

POCO C95 Pro 4G మోడల్ నెంబర్ 2606FPC72Yతో సర్టిఫికేషన్ సైట్‌లో కనిపించింది. ఈ ఫోన్ Redmi 17 4Gకి రీబ్రాండెడ్ వెర్షన్‌గా మార్కెట్లోకి రానుంది. దీనిలో 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన పెద్ద 6.9-అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను ఇవ్వొచ్చు. ఇక పనితీరు విషయానికి వస్తే.. మీడియాటెక్ హీలియో G91 Ultra ప్రాసెసర్‌తో పాటు, ఏకంగా 7,500mah భారీ బ్యాటరీ, 45 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. అలాగే వెనుక భాగంలో 50MP ప్రధాన కెమెరా, ముందువైపు 8MP సెల్ఫీ కెమెరాను అందించవచ్చు.

Advertisement

Also Read: గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

బ్యాటరీ సామర్థ్యంలో మార్పులు:

Redmi Note 17 Pro 5G గ్లోబల్ వేరియంట్ కూడా 2607DRA18G మోడల్ నెంబర్‌తో ఎన్‌బీటీసీ క్లియరెన్స్ పొందింది. టిప్‌స్టర్ కప్సర్ స్క్రిజ్‌పెక్ చెప్పినదాని ప్రకారం, చైనాలో విడుదలైన మోడల్‌తో పోలిస్తే.. గ్లోబల్ వేరియంట్‌లో కొన్ని మార్పులు ఉండనున్నాయి. ముఖ్యంగా చైనా మోడల్‌లో ఉన్న భారీ బ్యాటరీని గ్లోబల్ మార్కెట్ కోసం కాస్త తగ్గించి ఇవ్వనున్నారు. అయితే అంతర్జాతీయ యూజర్లను ఆకట్టుకునేలా వెనుకవైపు 8MP అల్ట్రావైడ్ కెమెరాను అదనంగా చేర్చనున్నట్లు తెలుస్తోంది.

ఫీచర్లు ఎలా ఉండబోతున్నాయి?

Advertisement

చైనాలో విడుదలైన Redmi Note 17 Pro మోడల్‌లో 6.83-అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జెన్ 4 చిప్, 67 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. గ్లోబల్ వెర్షన్‌లో కూడా దాదాపు అవే ఫీచర్లు కొనసాగే అవకాశం ఉంది. అయితే భారత్‌లో Redmi Note 17 సిరీస్ లాంచ్ గురించిన చర్చలు జోరుగా సాగుతున్నప్పటికీ.. POCO C95 Pro 4G మాత్రం ఇక్కడకు వస్తుందా లేదా అనేదానిపై ఇంకా ఎలాంటి అధికారిక స్పష్టత రాలేదు.

Also Read: విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

Related News

8,000mAh బ్యాటరీనా.. అమోలెడ్ స్క్రీనా? ఈ 3 కొత్త 5G ఫోన్లలో ఏది కొనుగోలు చేయడం ఉత్తమం?

మళ్లీ వివాదంలో టెలిగ్రామ్.. ఈసారి యాపిల్ స్టోర్ నుంచి అవుట్.. అసలేం జరుగుతోంది!

వాట్సప్‌లో ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు.. ఫోన్ స్టోరేజ్ సమస్యకు శాశ్వతంగా చెక్!

ఇస్త్రీ బల్లపై అల్యూమినియం ఫాయిల్.. తర్వాత జరిగే మ్యాజిక్ చూస్తే ఆశ్చర్యమే!

హానర్ నుంచి Robot Phone.. కెమెరానే గింబాల్‌లా తిరుగుతుంది, ఫీచర్లు చూశారా?

ఇది కలా? నిజమా?.. కళ్లు లేకపోయినా చూడొచ్చట.. మస్క్ కొత్త ‘చిప్’ మాయాజాలం!

అమెజాన్ బంపరాఫర్.. మోటో ఫోన్‌పై ఏకంగా రూ.17,000 డిస్కౌంట్.. గోల్డెన్ ఛాన్స్ వదులుకోకు భయ్యా!

ఐఫోన్ ప్రియులకు నిజంగా వరమే.. ఆ మోడల్స్‌పై Flipkart Saleలో ఏకంగా రూ.17,000 తగ్గింపు!

Big Stories

Advertisement
×