E-Paper
Advertisement

Mobile Recharge Hike: స్మార్ట్‌ఫోన్ యూజర్లపై టెలికాం కంపెనీల పిడుగు.. మరికొన్ని రోజుల్లో పెరగనున్న మొబైల్ రీచార్జ్ ధరలు

Mobile Recharge Hike: స్మార్ట్‌ఫోన్ యూజర్లపై టెలికాం కంపెనీల పిడుగు.. మరికొన్ని రోజుల్లో పెరగనున్న మొబైల్ రీచార్జ్ ధరలు
Advertisement

Mobile Recharge Hike| దేశంలోని పెద్ద టెలికాం కంపెనీలు ఎయిర్‌టెల్ ( Airtel), వొడాఫోన్ ఐడియా (Vodafone Idea), బిఎస్‌ఎన్ఎల్ (BSNL) మొబైల్ రిఛార్జ్ ధరలు పెంచడానికి సిద్ధమవుతున్నాయి. జియో (Reliance Jio) ప్రస్తుతానికి ఆ దిశగా అడుగులు వేయడం లేదు. ఈ ధరల పెంపు డిసెంబర్ 2025 అంటే మరి కొన్ని వారాల్లోనే జరగవచ్చు. దీనివల్ల లక్షలాది ప్రీపెయిడ్ యూజర్లు ప్రభావితమవుతారు. రీచార్జ్ ఖర్చులు పెరగబోతున్నాయి. ఇప్పుడే ప్లాన్లు చెక్ చేసుకోండి!

ధరలు పెంపు వెనుక కారణాలు ఇవే

టెలికాం ఇండస్ట్రీ ఆదాయ పెరుగుదల (రెవెన్యూ గ్రోత్) ఇప్పుడు మందగించింది. సెప్టెంబర్ త్రైమాసికంలో 10శాతానికి పడిపోయింది. మునుపటి క్వార్టర్లలో 14-16 శాతం గ్రోత్ ఉండేది. డిసెంబర్‌లో మరింత తగ్గవచ్చని విశ్లేషకులు అంటున్నారు. ఈ ఒత్తిడి వల్ల కంపెనీలు ధరలు పెంచాల్సి వచ్చింది. 5G నెట్‌వర్క్‌ల నిర్వహణ కోసం భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకే ARPU (అవరేజ్ రెవెన్యూ పర్ యూజర్) పెంచాల్సి ఉంది.

ఇప్పటికే కొన్ని ప్లాన్ ధరలు పెంచిన కంపెనీలు

Advertisement

వొడాఫోన్ ఇప్పటికే ఏడాది ప్లాన్ ధరలు పెంచింది. రూ.1999 ప్లాన్ 12శాతం పెంచి రూ.2240 చేసింది. 84 రోజుల రూ.509 ప్లాన్ 7శాతం పెంచారు. ఎయిర్‌టెల్ వాయిస్-ఓన్లీ ప్లాన్ తక్కువ ధర ప్లాన్ రూ.189 కూడా రూ.10 పెంచి రూ.199 చేసింది. బిఎస్ఎన్ఎల్ కూడా అవే ధరలకు వాలిడిటీ రోజులు తగ్గించింది. జియో మాత్రమే ఇప్పటి వరకు ప్లాన్ ధరలు పెంచలేదు. కానీ త్వరలో చేసే అవకాశం ఉంది.

మార్కెట్ అంచనా

షేర్ మార్కెట్ బ్రోకరేజ్ ఫర్మ్ మోతీలాల్ ఓస్వాల్ త్వరలోనే మొబైల్ రీఛార్జ్ ధరలు పెరగబోతున్నాయని అంచనా వేసింది. ఇన్‌ఫ్లేషన్ స్థిరంగా ఉంది. త్వరోలనే ఎలాంటి ఎన్నికలు కూడా లేవు కాబట్టి డిసెంబర్‌లోనే పెంపు జరుగుతుంది. 28 రోజుల 1.5GB డేటా ప్లాన్ రూ.50 పెరగవచ్చు. ఇలాంటి ధరల పెంపు దేశంలో కోట్ల సంఖ్యలో ఉన్న యూజర్ల బడ్జెట్‌ను దెబ్బతీస్తుంది. అన్ని రిఛార్జ్ ప్లాన్ ధరలు 15 శాతం వరకు పెరిగే ఛాన్స్ ఉందని జేపీ మోర్గాన్ రిపోర్ట్.

వొడాఫోన్ బిజినెస్ ప్లాన్ ఏమిటి?

Advertisement

వొడాఫోన్ నెట్‌వర్క్ ఉపయోగిస్తున్న తక్కువ ధర ప్లాన్ యూజర్లు జియో లేదా ఎయిర్‌టెల్ కు పోర్ట్ అవుతున్నారు. కానీ ఏడాది ప్లాన్ యూజర్లు లాయల్‌గా ఉన్నారు. వొడాఫోన్ మేనేజ్‌మెంట్ 15 నెలల తర్వాత ధరలు పెంచుతుందని చెప్పింది. కానీ ఇతర పోటీదారుల కంటే తక్కువగానే పెంచుతామని ఇప్పటికే ధరలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వినియోగదారులపై ఒత్తిడి లేకుండా చూస్తామని తెలిపింది.

యూజర్లపై ప్రభావం, ఖర్చులు ఎంత పెరుగుతాయి?

రీఛార్జ్ ప్లాన్ ధర రూ.50 పెరగడంతో బడ్జెట్ యూజర్లు ఇబ్బందిపడతారు. ఒకే ఫ్యామిలీలో ఎక్కువ సిమ్‌లు ఉంటే మంత్లీ బిల్ భారీగా పెరుగుతుంది. ప్రతి GB డేటాకు ధర కూడా పెరుగుతుంది. మధ్య తరగతి కుటుంబాలపై ఆర్థిక ఒత్తిడి పెరుగుతుందనడంలో సందేహం లేదు.

కంపెనీలు ధరలు ఎందుకు అడ్జస్ట్ చేస్తున్నాయి?

ప్రధాన కారణం ARPU పెంచడం. నెట్‌వర్క్‌లు బిల్డ్ చేయడానికి, 5G రోల్‌ఔట్ చేయడానికి భారీ ఇన్వెస్ట్‌మెంట్ కావాలి. ధరల పెంపు ద్వారా మాత్రమే ఆదాయ పెంచుకోవడానికి ప్రధాన మార్గమని టెలికాం కంపెనీలు భావితస్తున్నాయి.

Also Read: సరదా కోసం బ్లూటూత్ ల్యాండ్‌లైన్‌ ఫోన్ తయారు చేసిన యువతి.. 3 రోజుల్లోనే రూ.1 కోటి సంపాదన

యూజర్లు ఖర్చులు తగ్గించడానికి ఏం చేయాలి?

డేటా వాడకాన్ని ఆప్టిమైజ్ చేయండి. అనవసర యాప్స్ ఆఫ్ చేయండి. అందుబాటులో ఉండే.. తక్కువ ధర ప్లాన్‌లకు మారండి. ఏడాది వాలిడిటీ ప్లాన్‌లు తీసుకుంటే మంచి సేవింగ్స్ చేసుకోవచ్చు. Jio, Airtel, Vi, BSNL అన్ని ప్లాన్‌లు కంపేర్ చేసి, బెస్ట్ రేట్‌లో ఉండే నెట్‌వర్క్ కు పోర్ట్ కావడం కూడా మంచి ఆప్షన్.

 

Related News

మళ్లీ రీఛార్జ్ ధరలు పెంచనున్న జియో.. అంబానీ కీలక వ్యాఖ్యలు

బంగారం సరే.. డబ్బులు ఎలా డబుల్ అవుతాయ్? ఇలా చేస్తే సరి!

భయపెడుతోన్న రూపాయి.. బలపడుతోన్న డాలర్, RBI కళ్లెం వేయగలదా?

పోస్ట్ ఆఫీస్ RDలో నెలకు రూ.6,000 పొదుపు చేస్తే.. 5 ఏళ్లకు ఎంత వస్తుంది?

పండుగ సేల్‌లో 80 శాతం వరకు డిస్కౌంట్.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ బిజినెస్ సీక్రెట్ ఇదే

19 ఏళ్ల యువకుడి అద్భుత సృష్టి.. 3D ప్రింటింగ్ ఐడియాతో.. రూ.7 కోట్లకు పైగా సంపాదన!

అత్తమామల ఇల్లు, ఆస్తిపై కోడలికి హక్కులుంటాయా? భారత చట్టం ఏం చెబుతోందంటే

కొత్త ఉద్యోగంలో చేరారా? మీ PF ఖాతాలో ఈ 5 వివరాలు తప్పనిసరిగా చూడండి

Big Stories

Advertisement
×