Big Stories

Today Gold and Silver Rates: అమ్మో గోల్డ్.. మళ్లీ పెరిగిపోయింది.. రూ.80 వేలు దాటేసిన వెండి!

- Advertisement -

March 21st Gold and Silver Prices: ఏప్రిల్ నెల దాటితే పెళ్లిళ్లకు ముహూర్తాలు లేవు. మూఢం పూర్తయి పెళ్లిళ్లు చేయాలంటే అక్టోబర్ వరకూ ఆగాల్సిందే. అందుకే ఈలోగా ఉన్న ముహూర్తాలకే దేశవ్యాప్తంగా లక్షల జంటలు ఒక్కటవుతున్నాయి. పెళ్లంటే కచ్చితంగా బంగారం ఉండాల్సిందే కదా. సీజన్ డిమాండ్ తో పాటు.. ద్రవ్యోల్బణం, గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్‌లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి.

- Advertisement -

బుధవారం స్థిరంగా ఉన్న బంగారం ధరలు.. గురువారం (మార్చి 21) మళ్లీ పెరిగాయి. 100 గ్రాముల బంగారంపై రూ.10,000 నుంచి రూ.10,900 వరకూ ధర పెరిగింది. అంటే గ్రాముకు రూ.100 నుంచి రూ.109 వరకూ ధర పెరిగింది. ఉదయం 10 గంటలకు నమోదైన వివరాల ప్రకారం నేటి బంగారం ధరలు క్యారెట్ల వారిగా ఇలా ఉన్నాయి.

Also Read: 1% మంది చేతిలో 40% సంపద.. వరల్డ్ ఇన్‌ఈక్వాలిటీ ల్యాబ్ నివేదిక

హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1000 పెరిగి రూ.61,800కు చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1090 పెరిగి.. రూ.67,420కి చేరుకుంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.820 పెరిగి.. రూ.50,560 కు పెరిగింది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోనూ బంగారం ధరలు ఇలాగే ఉన్నాయి.

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,350 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,020గా ఉంది. 18 క్యారెట్ల బంగారం ధర రూ.51,070గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,800 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,420గా ఉంది. 18 క్యారెట్ల బంగారం ధర రూ.50,560గా ఉంది.

Also Read: యూజర్లకు బిగ్ అలర్ట్.. పర్సనల్ డేటా చోరి.. ప్రభుత్వం హెచ్చరిక

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,950 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,570గా ఉంది. 18 క్యారెట్ల బంగారం ధర రూ.50,690గా ఉంది.

కోల్ కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,800 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,420గా ఉంది. 18 క్యారెట్ల బంగారం ధర రూ.50,560గా ఉంది.

కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,800 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,420గా ఉంది. 18 క్యారెట్ల బంగారం ధర రూ.50,560గా ఉంది.

బంగారం మాదిరిగానే వెండి ధర కూడా పెరిగింది. కిలో వెండి పై రూ.1500 దాటడంతో రూ.81,500 కు చేరింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News