apple security alert: ప్రస్తుతం దేశంలో అధికంగా వాడుతున్న ప్రముఖ యాపిల్ కంపెనీ వస్తువులకు భారీ ముప్పు పొంచి ఉంది. తాజాగా దేశంలోని యాపిల్ యూజర్లకు ప్రభుత్వం కీలక హెచ్చరికలు చేసింది. దేశంలోని సెక్యూరిటీ ఎజెన్సీ అయిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం మంగళవారం ఓ కొత్త సెక్యూరిటీ బులిటెన్ ను విడుదల చేసింది. యాపిల్ వాచ్, యాపిల్ టీవీ, మాక్, మరియు విషన్ ప్రో యూజర్లకు ఈ హెచ్చరికలు జారీ చేసింది. ఈ యాపిల్ వస్తువులు వాడుతున్న యూజర్ల పర్సనల్ డేటాను చోరి చేసేందుకు యత్నిస్తున్నారని పేర్కొంది. రిమోట్ కంట్రోలింగ్ ద్వారా పర్సనల్, కాన్షిడెన్షియల్ డేటాను చోరి చేసి ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో యూజర్లు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. ఇందులో భాగంగా ఆయా వస్తువుల యూజర్లకు హెచ్చరికలు జారీ చేసింది.
సెక్యూరిటీ ఎజెన్సీ ఇచ్చిన సమాచారం ప్రకారం యాపిల్ లోని పలు వర్షన్లకు అలర్ట్ ఇచ్చింది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
-యాపిల్ విషన్ ఓఎస్ వెర్షన్ ప్రియర్ టూ 1.1
-యాపిల్ మాక్ఓఎస్ మాంటెరే వెర్షన్స్ ప్రియర్ టూ 12.7.4
-యాపిల్ మాక్ఓఎస్ వెంచురా వెర్షన్స్ ప్రియర్ టూ 13.6.5
-యాపిల్ మాక్ఓఎస్ సొనొమా వెర్షన్స్ ప్రియర్ టూ 14.4
-యాపిల్ వాచ్ఓఎస్ వెర్షన్స్ ప్రియర్ టూ 10.4
-యాపిల్ సఫారి వెర్షన్స్ ప్రియర్ టూ 17.3
యాపిల్ లో సెక్యూరిటీ సమస్య ఏంటి ?
దేశంలోని సెక్యూరిటీ ఎజెన్సీ ప్రకటించిన హెచ్చరికతో యాపిల్ యూజర్లలో భయాందోళన మొదలైంది. దీంతో అసలు ఈ కొత్త సెక్యూరిటీ సమస్య ఏంటనే దానిపై చర్చించుకుంటున్నారు. అయితే దీనిపై ఎజెన్సీ సంస్థ వివరణ ఇచ్చింది. పర్సనల్ ఇన్పర్మేషన్ ను దొంగిలించేందుకు నేరగాళ్లు ప్రయత్నిస్తారని.. ఇందులో భాగంగా ఎక్సిక్యూటివ్ ఆర్బిట్ కోడ్, బైపాస్ సెక్యూరిటీ వంటి వాటిని దొంగిలించి సిస్టమ్ ను టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది. అయితే ఇదంతా గత కొన్ని సంవత్సరాల క్రితం యాపిల్ సంస్థ అందుబాటులోకి తెచ్చిన వస్తువులపై ఈ ప్రభావం పడుతుందని పేర్కొంది.
విషన్ ప్రో, యాపిల్ టీవీ హెచ్ డీ, 4కే మోడల్స్, యాపిల్ వాచ్ సిరీస్ 4 ఇతర మోడల్స్, మాక్ బుక్స్ వంటి కొత్తగా లాంఛ్ అయిన వస్తువులకు ఈ సెక్యూరిటీ అలర్ట్ వర్తిస్తుందని స్పష్టం చేసింది. అయితే ఇటువంటి మేజర్ సెక్యూరిటీ భారీ నుండి బయట పడాలంటే యాపిల్ సంస్థ తన డివైస్ లోని రిలీజ్ చేసే కొత్త సాఫ్ట్ వేర్ ను అప్డేట్ చేయాలని పేర్కొంది.