E-Paper
Advertisement

పుత్తడి ప్రియులకు ఊహించని షాక్.. పైపైకి బంగారం-వెండి ధరలు, మార్కెట్లో రేట్లు పరిశీలిద్దాం

పుత్తడి ప్రియులకు ఊహించని షాక్.. పైపైకి బంగారం-వెండి ధరలు, మార్కెట్లో రేట్లు పరిశీలిద్దాం
Advertisement

Gold Price Today: సామాన్యులకు అందని ఎత్తులో బంగారం-వెండి ధరలు ఉన్నాయా? రోజు రోజుకూ మార్కెట్లో ధరలు పైపైకి ఎగబాకుతున్నాయా? అందుకు అంతర్జాతీయ పరిణామాలే కారణమా? దేశీయ బులియన్ మార్కెట్ వర్గాలు ఏం చెబుతున్నాయి? కొన్నాళ్లుపాటు విలువైన లోహాల ధరలు పెరగడం ఖాయమని బలంగా చెబుతున్నాయి.

 

అంతర్జాతీయ  పరిణామాలు.. బంగారం ధరలు పైపైకి

Advertisement

అంతర్జాతీయ పరిణామాల ప్రభావం మార్కెట్లపై పడుతోంది. ముఖ్యంగా అమెరికా అప్పుల డేటా, డాలర్ విలువ వంటి పతనం వంటి అంశాలు బులియన్ మార్కెట్ పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. దీన్ని పసిగట్టిన పెట్టుబడుదారులు బంగారం-వెండి వైపు మొగ్గు చూపడం మొదలుపెట్టారు. ఫలితంగా బంగారం-వెండి ధరలు ఆకాశాన్ని తాకేలా చేస్తున్నాయి. గడిచిన నాలుగు రోజుల్లో తులం బంగారం రేటు రూ.9 వేలు వరకు పెరిగిదంటే పరిస్థితులు ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు. అంతర్జాతీయ మార్కెట్ తోపాటు దేశీయ మార్కెట్ లో ధరలను ఒక్కసారి చూద్దాం.

 

పుత్తడి ప్రియులకు ఊహించని షాక్

Advertisement

బంగారం కొనుగోలు చేయాలనుకున్న వారికి మార్కెట్లో ధరలు షాకిస్తున్నాయి. శ్రావణ మాసం ఐదు రోజుల ముందు వరకు భారీగా పడిన బంగారం, వెండి ధరలు అమాంతంగా ఎగబాకాయి. దీనికితోడు పెళ్లిళ్ల సీజన్ కావడంతో వినియోగదారులు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు భారీగా పెరిగాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 52 డాలర్లు పెరిగి 4664 డాలర్ల స్థాయికి చేరుకుంది. వెండి రేటు స్వల్పంగా తగ్గి 69 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

 

తెలుగు రాష్ట్రాల్లో ధరల మాటేంటి?

హైదరాబాద్‌-విజయవాడ మార్కెట్లో బంగారం-వెండి రేట్లు వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల మేలిమి బంగారం రేటు దాదాపు రూ.1.64 లక్షలకు దూసుకెళ్లింది. సోమవార ఒక్కరోజు తులం రూ.880 మేరా పెరిగింది. 22 క్యారెట్ల తులానికి రూ.800 పెరిగింది. దీంతో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,300 వద్దకు చేరుకుంది.

మరోవైపు వెండి కిలోకు రూ.5000 పెరిగి రూ.2,75,000 వద్దకు దూసుకెళ్లింది. పైన చెబుతున్న బంగారం-వెండి రేట్లు ఆగస్టు 25 ఉదయం 7 గంటల సమయంలో ఉన్నవి మాత్రమే. బులియన్ మార్కెట్లో ఓపెన్ తర్వాత ప్రాంతాలను బట్టి ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. వినియోగదారులు కొనుగోలు చేసే ముందే ధరలు తెలుసుకోవడం బెటర్.  మెట్రో నగరాల్లో బంగారం-వెండి ధరలు దాదాపుగా ఇదే స్థాయిలో ఉన్నాయి. కాకపోతే రూ. 500 అటు ఇటుగా ఉన్నాయి.

ALSO READ: పేరెంట్స్‌కు బిగ్ అలర్ట్.. ఆధార్ కీలక అప్‌డేట్స్, ఇంకెందుకు ఆలస్యం

Related News

తాతల ఆస్తి రెండో భార్యకు రాసిచ్చిన భర్త.. కోర్టుకెక్కిన మొదటి భార్య కూతురు.. చివరికి ఏం జరిగిందంటే

ఏటీఎం కార్డు పోయిందా? వెంటనే మీరు చేయాల్సిన పనులు ఇవే!

స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి చేస్తున్న పసిబిడ్డ.. ప్రపంచంలోనే అతిపిన్న వయసు ఇన్వెస్టర్

ఆటో డ్రైవర్ పిల్లల స్కూల్ ఫీజు రూ.1.5 లక్షలు.. భార్య ఎలా సాయం చేస్తోందంటే

రూ.92 లక్షల ట్యాక్స్ చెల్లించాను.. ఇప్పుడు ఉద్యోగం ఊడింది.. దిక్కుతోచని స్థితిలో టెకీ

నెలకు రూ.2,000 SIP పెట్టబడితో రూ.10 లక్షల కార్పస్.. ఇలా చేస్తే సాధ్యమే?

తగ్గేది లేదంటున్న పసిడి, మదుపరుల చూపుతో పైపైకి పరుగులు, మార్కెట్లో ధరల మాటేంటి?

ఇండియన్ ఐటీ కంపెనీలపై అమెరికా కొరడా.. గ్రీన్ కార్డ్ PERM ప్రాసెస్ నిలిపివేత! టెక్కీలకు కోలుకోలేని దెబ్బ

Big Stories

Advertisement
×